Tuesday, March 12, 2013

"సంఘములో కోల్పోయిన నా హోదాను నాకు తిరిగి ఇప్పించండి" రేప్ కేసులో నిర్ధోషి సుప్రీం కోర్టులో పిటీషన్....న్యూస్

హ్రుదయాన్ని కదిలించే ఒక పిటీషన్ భారత సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. నిర్భయ కేసు రాజకీయ నాయకులలోనూ, పోలీసులలోనూ, న్యాయస్థానాలలోనూ మరియూ మీడియాలలోనూ సంచలనం స్రుష్టించి నిందితులకు ఉరిశిక్ష పడాలని ఏక కంఠంతో పిలుపునిస్తూ ఎట్టిపరిస్తుతులలోనూ నేరానికి గురైన ఆ అభాగ్యురాలి పేరు మాత్రం బయటపెట్టకూడదని అభ్యర్ధించేరు.

2006 లో సంచలనం స్రుష్టించిన మయాపురి రేప్ కేసులో నిందితుడు నిరంజన్ కుమార్ బైలు దొరకక 4 సంవత్సరాలు జైలులో గడిపేడు. కేసు విచారణ ముగిసి , నిరంజన్ కుమార్ నిర్ధోషి అని తీర్పు ఇస్తూ కోర్టు అతన్ని విడుదల చేసింది.

మానభంగం జరిగి నిరంజన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు మీడియా అతని పై విపరీతమైన కవరేజ్ చేస్తూ అతన్ని ఒక మానవ మ్రుగంగా చిత్రీకరించేయి. అయితే అతను నిర్ధోషిగా నిరూపించబడిన తరువాత అతని గురించి కనీసం తమ మీడియాలలో ఒక వార్తగా కూడా చెప్పకుండా/రాయకుండా చలనంలేని వారిలాగ మౌనంగా ఉండిపోయినాయి.

కేసు విచారణలో ఉన్నప్పుడు మీడియావారు చేసిన హడావిడితో నిరంజన్ కుమార్ అవమానించబడ్డాడు. జైలులోకూడా అతనికి అవమానం జరిగింది. అతని భార్యా, పిల్లలూ సంఘం నుండి వెలివేయబడ్డవారిలాగా జీవించవలసి వచ్చింది. అతని భార్యా, పిల్లలూ ఎక్కడికీ వెళ్ళలేక, వెళ్ళినా అవమానపడి కుచించుకుపోయేరు.


సంచలనం స్రుష్టించిన కేసులో నిరంజన్ కుమార్ నిర్ధోషి అని కోర్టు తీర్పు ఇచ్చినా, అతను నిర్ధోషిగా నిరూపించబడి విడుదల అయినట్లు మీడియావారు ఒక్క వార్త కూడా రాయలేదు. మీడియాచే మానవ మ్రుగంగా చిత్రీకరించబడ్డ నిరంజన్ కుమార్ మానవ మ్రుగం కాదని ప్రకటించలేదు. దీనివలన నిర్ధోషిగా జైలు నుండి తిరిగి వచ్చిన నిరంజన్ కుమార్ ను సంఘం గౌరవించలేదు. అతను విచారణ ఖైదీగా జైలులో గడిపిన 4 ఏళ్ళు అతనికి శిక్చా కాలంగా భావించి అతన్ని అందరూ చీదరించుకున్నారు. నేను నిర్ధోషి, కోర్టు కూడా అది తెలుసుకుని నన్ను విడుదలచేసింది అని ఎంత చెప్పుకున్నా ఎవరూ అతన్ని నమ్మలేదు సరికదా అతన్ని నేరస్తుడుగానే చూసేవారట. వాళ్ళింటికి ఎవరూ వచ్చేవారు కాదట. తన పిల్లలను మిగిలిన పిల్లతో ఆదుకోనివ్వలేదట.

ఇవన్ని భరించలేని నిరంజన్ కుమార్ "కోల్పోయిన నా హోదాను నాకు తిరిగి ఇప్పించండి", నేను నిర్ధోషిననే విషయం మీడియాలు ప్రజలకు తెలపాలి, కనీసం ఒక వారం రోజులైన ఆ నేరం నేను చేయలేదని, ఆ విధంగా కోర్టు తీరు ఇచ్చిందని ప్రకటిస్తూ ఉండాలి. నేరం జరిగినప్పుడు, అనుమానంతో పోలీసులు నన్ను నిర్భంధించి నప్పుడు, నా పేరూ, నా ఫోటో తో సహా మీడియాలో నా గురించి ప్రచారం చేసి నన్ను ఒక మానవ మ్రుగంగా పేర్కొన్నారు. నేను నిర్ధోషి నని కోర్టులో నిరూపించబడిన విషయాన్ని మాత్రం కనీసం వారి వార్తలలో కూడా ప్రజలకు తెలుపలేదు. దీని వలనే ప్రజలు ఇంకా నన్ను, నా కుటుంబాన్నీ నేరస్తులుగానే చూస్తున్నారు. ఇది అన్యాయం, దారుణం. కాబట్టి సంఘంలో నా హోదను ఈ కోర్టు నిలబెట్టాలి. నేను 4 సంవత్సరాలు జైలులో గడిపిన కాలం నా శిక్షా కాలం కాదని, నేను నిర్ధోషినని ప్రజలకు తెలియజేయలి. అని తన పిటీషన్లో కోరేడు.

నిరంజన్ కుమార్ పిటీషన్లో చెప్పిన విషయాలు చాలా న్యాయమైనదని సుప్రీం కోర్టు నిర్ణయించుకుని, అతిని పిటీషన్ విచారణకు తీసుకుని, మీడియావారికి నోటీసులు పంపించింది.

2 comments:

  1. అతనికి నా ప్రగాఢ సానుభూతి. అతసి దర్మాగ్రహం సరైందే. అతను దానితో పాటు అతను కోల్పోయిన నాలుగు సంవత్సరాల కాలానికి నష్టపరిహారం కూడా కోరవచ్చు.

    ReplyDelete
  2. మీడియా అత్యుత్సాహం, తనే విచారణ చేపడుతున్న సంఘటనలు చాలా కనపడుతున్నాయి. కోర్ట్ తీర్పుకై వేచి చూదాం

    ReplyDelete