Saturday, March 16, 2013

హీరోషీమాలో ఆటంబాంబు ధాటికి తట్టుకున్న చెట్లు....ఫోటోలు

ఆగస్ట్-6, 1945 న అమెరికా హీరోషీమా మీద వేసిన ఆటంబాబు మూలంగా అక్కడి భూమి రూపురేకలే మారిపోయింది, మట్టి బొగ్గుమసిలాగా అయిపోయింది, ఎటుచూసినా వాతావరణంలో రేడియేషన్ కనబడింది. అమెరికాలోని మాన్ హట్టన్ కు చెందిన శాస్త్రవేత్త డా. హెరాల్డ్ జాకోబ్సెన్ 75 సంవత్సరాల వరకూ అక్కడ(హీరోషీమాలో) పంటలు కాదుకదా, చెట్లూచేమలు కూడా పెరగవని తెలిపేరు. కానీ ప్రక్రుతి వేరేవిధముగా ఆలోచింది. ఆటంబాంబు ధాటికి కొన్ని చెట్లు తట్టుకుని, కొన్ని సంవత్సరాల తౌవాత చిగుర్లు వేయడం మొదలుపెట్టి మానవ ద్వంశానికి ఎదురుతిరిగినై. ఈ రోజు ఆ చెట్లే కాకుండా ఆ తరువాత జపానీయులు నాటిన మొక్కలతో హీరోషీమా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నది.


1 comment:

  1. చాలా బావుంది... మీకు ధన్యవాదాలు...

    సుదీర్
    techwaves4u.blogspot.com (తెలుగు లో టెక్నికల్ బ్లాగు )

    ReplyDelete