Tuesday, March 12, 2013

8 సంవత్సరాల బాలుడు 61 సంవత్సరాల ఆమెను పెళ్ళిచేసుకున్నడు: కారణం భయం....న్యూస్

60 సంవత్సరాలు వయసు గల అతను 12 ఏళ్ళ పిల్లను పెళ్ళిచేసుకున్నాడు. ఇలా మనం చాలాసార్లు వినే ఉంటాము. కానీ 8 సంవత్సరాల బాలుడు 61 సంవత్సరాల వయసుగలిన ఆమెను పెళ్ళిచేసుకున్నాడు అనేది వినడం నాకైతే ఇదే మొదటిసారి. ఇది నిజం. సౌత్ ఆఫ్రికాలో ఇది జరిగింది. ఆ 8 సంవత్సరాల బాలుని తాత చనిపోతూ ఆ బాలుడు 61 సంవత్సరాల ఆమెను పెళ్ళిచేసుకోవాలని చెప్పి చనిపోయేడట. ఆమె ఆ కుటుంభీకులకు తెలిసినామే. మొదట హా. ఏదో ముసలోడు వాగి చనిపోయేడు అని అందరూ అనుకున్నారు. కానీ అలా గనుక జరపకపోతే చనిపోయిన ముసలి తాత దెయ్యమై తమ కుటుంభాన్ని వేధించుకు తింటాడని భయపడ్డారు. అందుకని ఆయన చెప్పినట్లే పెళ్ళిచేసేరు. అయితే పెళ్ళి చేసుకున్న దంపతులు కలిసి జీవించరట.


No comments:

Post a Comment