Sunday, February 24, 2013

చైనాలో కొనుక్కోగలిగే ఆశ్చర్యపరిచే కొన్ని వింత వస్తువులు ....ఫోటోలు

బ్రతికున్న ఎండ్రకాయ వెండింగ్ మిషెన్ Twin Lakes Crab Co అనే పీత/ఎండ్రకాయ లను సప్లై చేసే ఒక కెంపెనీ 2010 లో ప్రజల వసతి కొరకు ఈ పీతల వెండింగ్ మిషెన్లను పబ్లిక్ ప్రదేశాలలొ ఉంచింది.అంటే రైల్వే స్టేషన్లూ, బస్ స్టాండ్లూ, పెద్ద పెద్ద మార్కెట్లూ లాంటి చోట్ల ఈ మిషెన్లను అమర్చింది. ఎందుకంటే చైనా ప్రజలు ప్రీతిగా తినే పీతలను కొనుక్కొటానికి ప్రతిసారీ పచారీకొట్లకు వెల్లనవసరంలేకుండా.

పాండా టీ టీ అనే పేరు వినడంతో ఇదేదో కొత్తం రకం టీ ఆకులతో తయారుచేసింది అనుకునేరు. కాదు. ఈ టీ పాండా మలము నుండి తయారుచేసిన టీ. ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఇదే. ఈ టీ పొడి ఒక కిలో 40 లక్షల రూపాయలు. ఈ టీ ను ఎందుకు తాగాలనుకుంటున్నారు? వాదం ఇదే: పాండాలు వెదురు బొంగులు తింటాయి. అవితినే వెదురు బొంగులలో 30 శాతం మాత్రమే అరిగి జీర్ణించుకుంటాయి. మిగిలిన 70 శాతం మలంలో వచ్చేస్తుంది. అరగకుండా పాండా మలములో వచ్చే వెదురు బొంగులలో యాంటీ ఆక్సిడంట్లు ఎక్కువగా ఉంటాయని, క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని దానితో తయారుచేసిన టీ ని యాంటీ-క్యాన్సర్ టానిక్ మరియూ బరువు తగ్గే పానీయంగా మార్కెట్ చేస్తున్నారు.

రోబోట్లు తయారుచేసి,అవే స్వయంగా అందించే ఆహారం నూడుల్స్ నుండి చిల్లీ చికెన్ వరకు రోబోట్లు తయారుచేసే ఆహారం చాలా రుచిగా ఉంటుందట. రోబోట్ చేతులకున్న మెటాలిక్ వేల్లు ఆహారాని కి కొత్త రుచిని ఏర్పరుస్తాయట. 2011 లో Cui Runquan అనే అతను Cui అనే రోబో వంటమనిషిని తయారుచేసేడు. ఈ వంటచేసే రోబోలకు డిమాండ్ పెరగటంతో ఎక్కువ మొత్తంలో ఈ రోబోలను తయారుచేసేడు. ఒక్కొక్క రోబోను ఒక లక్షా 50 వేల రూపాయలకు అమ్మేడు. ఇప్పుడు చైనాలో రోబో వంట వారిగా ఉండే హోటల్లు మరియూ రెస్టారెంట్లకు జనం ఎక్కువగా వెడుతున్నారట.

డబ్బాల గాలి చైనాలో వాతావరణ కాలుష్యం అక్కడి ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచాలని చైనా ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. అయితే ఇప్పుడున్న సెటిలైట్ టెక్నాలజీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపేసింది. చైనా ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కావలసిన పధకాలు రూపొందించేమని, దానివలన కాలుష్యం తగ్గిందని చెబుతోంది. అది నిజంకాదని తెలిపేటట్లు ఇప్పుడు పరిసుద్దమైన గాలిని డబ్బాలలో నింపి అమ్ముతున్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు ఈ గాలికోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నారు.

ట్రాఫిక్ జాం ల నుండి తప్పించుట 1.3 బిల్లియన్ల జనాభాతో నిండిపోయిన చైనాలో ట్రాఫిక్ జాములు సర్వ సాధారనమైపోయింది. ఈ ట్రాఫిక్ జాములు క్లియర్ అవడానికి కొన్ని గంటలు పట్టవచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు లేక కొన్ని వారాలు కూడా పట్టవచ్చు. అలాంటి ట్రాఫిక్ జాములలో ఇరుక్కుపోయిన వారిని తప్పించడానికి ఒక కంపెనీవారు ఒక సర్వీసు పెట్టేరు. ఇరుకున్నవారు ఈ సర్వీస్ కంపెనీకి ఫోనుచెయ్యాలి. వెంటనే ఆ కంపెనీవారు ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దర్ని పంపిస్తారు. ఒకరు వాహనంలో ఉన్నవారిని ఎక్కించుకుని సందులలో నుండి తీసుకువేడతారు. ఇంకొకరు ట్రాఫిక్ క్లియర్ అయిన తరువాత వాహనాన్ని తీసుకువస్తారు. ఈ సర్వీసుకు డబ్బులు కట్టాలి.

మరుగుజ్జు పర్యటనలు చైనా దేశంలో ఉన్న మరుగుజ్జు వారందరినీ ఒక చోటికి తరలించేరు. 13,000 ఎకరాలలో వారికి వసతులు కల్పించి వారున్న చోటును ఒక తీం పార్కుగా మార్చేరు. విదేశీ పర్యాటకులూ మరియూ దేశ పర్యాటకులూ వీరున్న చోటికి వచ్చి, అక్కడ కాటేజీలు తీసుకుని మరుగుజ్జులతో కాలం గడపవచ్చు.

బ్రతికున్న తాబేలు కీ చైన్లు ఒక ప్లాస్టిక్ కవరులో కావలసిన ఆక్సిజన్ తోనూ, కావలసిన విటమిన్లతోనూ ఉన్న నీటిని నింపి దానిలో చిన్న చిన్న జంతువులను ఉంచి వాటిని కీ చైన్లుగా అమ్ముతున్నారు.కొందరు వీటిని అద్రుష్టంగా భావించి కొంటుంటే కొంతమంది ఆ అమాయక జంతువులను వదిలి పెట్టడానికి కొంటున్నారు.

తెల్ల మనుష్యులు తెల్లవారిని కొనుక్కోలేరుగానీ, వారిని అద్దెకు తీసుకుంటారు. పాశ్చ్యాత దేశాలలో వ్యాపార అభివ్రుద్దికి కారణం తెల్లవారేనని చైనాలోని పెద్ద కంపెనీలు నమ్ముతున్నాయి. అందువలన పెద్ద పెద్ద మీటింగులూ, సెమినార్లలో తెల్లవారిని అద్దెకు తీసుకుని వారిని పక్కన ఉంచుకుని సాధ్యమైనంత వరకూ చైనా భాష మాట్లాడకుండా ఆంగ్ల బాషే మట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఇది వారి వ్యాపార అభివ్రుద్దికి ఎంతగానో మేలు చేసిందని, ఇప్పుడు ప్రతి చిన్న కంపెనీ కూడా తెల్లవారిని అద్దెకు తెచ్చుకుంటున్నారట.

పెళ్ళికాని ఆడపిల్లలు నోటితో తీసిన టీ ఇది చాలా వింత విషయంగా ఉన్నది కదూ. కాని ఇది అక్కడ ఒక టీ కంపెనీ వారు అవలంబిస్తున్న ఒక అతి పెద్ద టెక్నిక్. ఈ టీ కంపెనీ వారు పెళ్ళి కాని అమ్మాయలను మాత్రమే పనికి తీసుకుంటారు. ఆ అమ్మాయలు టీ ఆకులను చేతితో కోయరు. తమ నోటితో కోసి తీస్తారు. ఆకులు వేసుకునే బుట్టను కూడా మెడలో వేసుకుంటారు. ఈ కంపెనీ తయారుచేసే టీ చాలా ప్రసిద్ది చెందింది.

No comments:

Post a Comment