Tuesday, February 19, 2013

రాత్రిపూటకూడా సౌర విద్యుత్ ను తయారుచేయగల సోలార్ పవర్ ప్లాంట్ స్పైన్ దేశంలో ఉత్పత్తి మొదలుపెట్టింది.....ఫోటోలు

భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షం లోకి తిరిగివెళ్ళి పోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి.

సౌర విద్యుత్తును హీట్ ఇంజన్(ఉష్ణోగ్రతా బేధాన్ని యంత్ర శక్తి గా మార్చేది) ల నుంచి కానీ ఫోటో వోల్టాయిక్ ఘటాలనుంచి కానీ ఉత్పత్తి చేస్తారు.

స్పైన్ దేశంలోనే ఎక్కువ సూర్య కాంతి లభించే ప్రదేశం సెవిల్లే(Seville).అందుకనే ఇక్కడ జెమోసోలార్ పేరుతో సౌరవిద్యుత్ కేంద్రం నిర్మించేరు. 2600 అద్దాలను ఏకకేంద్ర రీతిలో అమర్చి వీటి మధ్యలో నైట్రేట్ సాల్ట్ ట్యాంకు కు అద్దలనుండి గ్రహించుకోబడ్డ సూర్యరస్మి వేడిని తరలించి నిలువచేస్తారు. సూరరస్మి నుండి వెలువడిన వేడి మోల్టన్ నైట్రేట్ సాల్టు ను 900C దాక వేడిచేస్తుంది. అప్పుడు ఆ ట్యాంకు చుట్టూ ఉన్న రసాయనం వేడెక్కి ఆవిరై టర్బైన్లలొ నిలువలో అదే వేడితో ఉంటుంది. ఆ రసాయనం నుండి వేడిని కరెంటుగా మార్చి ప్రజలకు అందిస్తారు.


No comments:

Post a Comment