Thursday, February 21, 2013

తక్కువగా చదువుకున్నా నమ్మలేని విజయం సాధించినవారు.....ఫోటోలు

చదువు చాలా ముఖ్యం.ఈ నిజాన్ని ఎవరూ కాదనరు. ఇందులోనూ ముఖ్యమైనదేమిటంటే ఎంత ఎక్కువగా చదువుకుంటే, మీరు ఎంచుకున్న దారిలో మీరు అంత ఘనవిజయం సాధిస్తారు. చదువు తక్కువగా ఉన్నవారు జీవితంలో ఎంతో కష్టపడి,అతిబాధాకరమైన అనుభవాలను దాటి చివరికి విజయం చెందేరని మామూలుగా చెబుతూంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నవారు ఇందులో మినహాయింపు వ్యక్తులేనని చెప్పాలి.

John D. Rockefeller...Billionaire ఈయన అత్యంత డబ్బుగల వ్యక్తిగా ఎదిగేందుకు ముందు ఒక పేద కళాకారుని కుమారుడిగా ఉండేవారు. తనకు 17 సంవత్సరాల వయస్సులో హై స్కూల్ చదువు మానేసేడు. అయితే జీవితంలో ఒక లక్ష డాలర్లు సంపాదించాలనే కోరికతొ తన దగ్గరున్న కొద్ది డబ్బుతో స్టాండర్డ్ ఆయిల్ అనే చిన్న బిజినస్ పెట్టి కొద్ది సంవత్సరాలలో ఆయిల్ పరిశ్రమలో ఏకాధిపతిగా ఎదిగేరు. 1902 లో ఈయన ఆస్తి 200 మిల్లియన్ డాలర్లుగా ఉంటే ఈయన చనిపోయేటప్పుడు ఈయన ఒక బిల్లియనర్. ఈయన హై స్కూల్ చదువు ఈయనకు ఎంతో ఉపయోగపడింది.

Horace Greeley...Journalist and Congressman పత్రికా పరిశ్రమలో లేనివారికి ఈయన పేరు తెలిసుండడం కష్టం. ఈయన తన 15 వ యేట చదువు మానేసి ఒక ప్రింటింగ్ ప్రెస్సులో అపరంటీస్ గా చేరేరు. కొద్దికాలం తరువాత న్యూయార్క్ నగరానికి వెళ్ళి అక్కడ న్యూయార్క్ ట్రిబ్యూన్ పేపర్లో చేరేరు. అక్కడే ఆయన విలేకరిగా పనిచేసి పేరు సంపాదించుకున్నారు. ఆ పేరుతోనే ఆయన రిపబ్లికన్ పార్టీ స్థాపించేరు.

John Glenn...Astronaut 1950-1960 మధ్యలో అంతరిక్షయానంలో అమెరికాకూ, సోవియట్ రష్యాకూ మధ్య జరుగుతున్న పోటీలలో అమెరికాకు గెలుపు అందించినది ఈయనే. మొట్టమొదట చంద్రమండల యాత్రకు వెళ్ళిన మనిషి కూడా ఈయనే. అంతరిక్ష యాత్ర చరిత్రలో ప్రసిద్దిపొందడమే కాకుండా, ఒక యుద్ద హీరోగా కూడా పేరు సంపాదించేరు. ఈయన కాలేజీ చదువుతున్నప్పుడు జపాన్ వారు పెరల్ హార్బర్ మీద దాడి జరిపినప్పుడు రెండవ ప్రపంచ యుద్దనికిగానూ చదువుమానేసి అమెరికా సైన్యంలో చేరేరు.

Steve Jobs...Apple Co-Founder 20 మరియూ 21 శతాబ్ధములో గొప్పగా యోచనలు చేసేవారు ఉండేవారు. అందులోనూ కొందరు కాలేజీ చదువులు పూర్తిచేయకుండానే మనం నమ్మలేని, అద్భుతమైన విషయాలను యోచించగలిగేరు.ఇలా అనుకున్నవెంటనే అందరికీ గుర్తుకు వచ్చే వారు బిల్ గేట్స్ మరియూ మార్క్ జకర్ బర్గ్. కానీ పోయిన శతాబ్ధములో అత్యంత టెక్నాలజీ యోచన శక్తి కలిగిన మేదస్సు కలిగినవారు స్టీవ్ జాబ్స్. ఆపిల్ కంపెనీ సహ సంస్థాపకుడు. జాబ్స్ మరియూ స్టీవ్ వోజినియాక్ కలిసి పర్సనల కంప్యూటర్, ఆ తరువాత ఐ పోడ్,ఐ ఫోన్ మరియూ ఐప్యాడ్ లను అందించేరు.

Mark Twain...Author and Wit చరిత్రలోనే రచనలలో హాస్యం అందించిన ఘనత ఈయనకే చెందుతుంది. ప్రాకారకవిద్య లేని ఈయన తన 11వ ఏట పత్రికా ఆఫీసులలో అపరెంటీస్ గా పనిచేసేరు. పనిచేస్తూ సాయంత్ర సమయములో లైబ్రరీలకు వెళ్ళి అక్కడి పుస్తకాలు చదివేవారట.అదే ఈయనకు ప్రాకారకవిద్య గా మారింది. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివేవారట. దాని వలనే ఈయనకు ఒక ఓడ పైలట్ గా ఉద్యోగం వచ్చింది.అమెరికాలో అంతర్యుద్దం జరుగుతున్నప్పుడుకూడా అదే పనిలో ఉన్నారు. ఆ తరువాత కాన్ ఫెడరేట్ ఆర్మీలో జేరి దేశమంతా తిరిగేరు. అప్పుడు ఆయన చూసిన విషయాలను హాస్యాంతో కలిపి రాయడం మొదలుపెట్టి అత్యంత ప్రసిద్ద హాస్య రచయతగా పేరుగడించేరు.హాస్యాన్ని ఎవరూ నేర్పలేరు. అది తానుగా రావలసిందేనండానికి ఈయనే ఉదాహరణ.

Henry Ford...Industrialist and Entrepreneur ఆటోమొబైల్ పరిశ్రమను ఒక్క మనిషిగా బయటకు తెచ్చిన ఘనత ఈయనదే. వ్యవసాయ కుటుంభంలో పుట్టిన ఈయన వ్యవసాయ పనులు నేర్చుకుంటూంటే తమ పొలాలను తన తదనంతరం ఇతనే చూసుకుంటాడని అతని తండ్రి అనుకున్నాడు. కానీ తన 11 వ ఏట,వ్యవసాయం మానేసి, ఒక మిషెనిస్ట్ దగ్గర పనిలోకిజేరిన ఈయన తరువాత అతిగొప్ప, విజయవంతమైన ఆటొమొబైల్ వ్యాపారవేత్తగా ఎదిగేరు.

William Shakespeare...Poet and Playwright చరిత్రల అతిగొప్ప పేరున్న ఈయన పేరు వినని వారు ఉండరు. ఈయన గురించిన విషయాలు ఎక్కువగా తెలియకపోయినా ఈయనకు ప్రాధిమిక చదువు కంటే ఎక్కువ చదువులేదని మాత్రం తెలుసుకున్నారు. అలాంటి ఈయన ఆంగ్లంలో 1700 కొత్త మాటలను కనుగొన్నారంటే ఆశ్చర్యపడకుండా ఉండలేము.

Abraham Lincoln...US President అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రజాధరణ పొందిన ప్రెశిడెంట్ ఈయనే. అమెరికాను అత్యంత కష్టాలలోనుండి బయటకు తీసుకువచ్చిన ఘనత, బానిసత్వాన్ని ముగించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఈయన తనకుతానే చదువుకుని పైకెదిగిన వ్యక్తి.

Albert Einstein...Physicist 3000 సైన్స్ పేపర్లను ప్రచురించిన ఈయన పేరు మేధావి అనే మాటకు అర్ధంలాగా నిలబడుతుంది. E=MC2 అనే ఫార్ములా వెనుక ఉన్న ఈయన సాపేక్షతత్త్వసిద్ధాంతము ను తీసుకువచ్చిన ఈ మేధావి ఎంట్రన్స్ పరీక్షలతో ఆగిపోయేరు.

No comments:

Post a Comment