Tuesday, February 5, 2013

ఒంటె మల్లయుద్ధము...ఫోటోలు

టర్కీ దేశంలోని పశ్చిమ ప్రాంతాలలొ ఈ పోటీలు జరుగుతాయి. ఒంటెలు సహజంగా మల్లయుద్దములు చేయవు. వాటిచే మల్లయుద్దములు చేయించాలంటే అది ఒక అతి పెద్ద కష్టమైన పని. అయితే కొంతమంది వాటిని ప్రేరేపించి యుద్దానికి ఉసిగొలుపుతారు. దీనికి చాలా టైము పడుతుంది. ఈ ఒంటెల మల్లయుద్దములో పెద్దగా రక్తపాతము జరగదు. ఒక దానిమీద ఒకటి పడిపోతాయి. బలమెక్కువున్న ఒంటే మరొక ఒంటెను క్రిందకు తోసేస్తుంది. అంతే. అక్కటితో మల్లయుద్దం ముగిస్తుంది. అయితే ఈ పందేలలో ఎక్కువమంది పాల్గొని జూదమాడుతారట. టర్కీ ప్రభుత్వం ఈ ఒంటెల మల్లయుద్దములను నిషేదించినా పశ్చిమ టర్కీలో ఇంకా జరుగుతూనే ఉన్నదట.


2 comments:

  1. ఒంటెల తో మల్ల యుద్దమా ..విచిత్రంగా ఉంది. ఇటువంటి పోటీలను బహిష్కరించవలసిన అవసరం ఉంది. మూగ జీవులను తమ స్వార్ధానికి ఉపయోగించుకొనే వారిని శిక్షించాలి.

    ReplyDelete