Thursday, February 21, 2013

వీటిగురించికూడా తెలుసుకుందాం:మిల్లియన్ డాలర్ల పెన్ను, రెండు కాళ్ళ పిల్లి, మిల్లియన్ స్ఫటికలు పొందుపరచిన కారు...ఫోటోలు

మిల్లియన్ డాలర్ల పెన్ను ఖరీదైన పెన్నులు తయారుచేసే మాంటేగ్రపా అనే పెన్నుల తయారీ కంపెనీ తమ 100 వ సంవత్సరం గుర్తుగా ఈ ఒక మిల్లియన్ డాలర్లు ఖరీదుచేసే పెన్నును తయారుచేసింది. వీరు తయారుచేసే ఖరీదైన పెన్నులను అనేక ప్రభుత్వాలు తమ ఒడంబడికల సంతకాలకు ఉపయోగిస్తారట.ఇప్పుడు ఈ పెన్నును దుబాయ్ ఎక్జిబిషన్లో ఉంచేరు.

రెండు కాళ్ళ పిల్లి చూసిన వెంటనే ఈ పిల్లికి రెండు కాళ్ళే ఉన్నాయని చెప్పటం కష్టం. కానీ నిజం. ఈ పిల్లి ఒక విపత్తులో రెండు కాళ్ళు పోగొట్టుకుంది. డాక్టర్లు బ్రతకదని చెప్పి, బ్రతికినా ఒక మూల కూర్చుంటుందని చెప్పేరు. అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఈ పిల్లి రెండు కాళ్ళతోనే ఆక్టివ్ గా ఉంటోంది.

మిల్లియన్ స్ఫటికలు పొందుపరచిన కారు Rolls-Royce కార్లు అంటేనే ఖరీదైనవనే అర్ధం. ఈ మధ్య వారు హనీమూన్ ఎక్స్ ప్రెస్ అనే పేరుతో అత్యంత ఖరీదైన కారును తయారుచేసేరు. ఆ కారుపై ఒక మిల్లియన్ స్ఫటికలు పొదిగేరు.

No comments:

Post a Comment