Tuesday, February 19, 2013

ఇంతకుముందు(పూర్వము)భూమిని ఢీ కొన్న ఉల్క ప్రదేశాలు....ఫోటోలు

మొదటిసారిగా మనమందరమూ ఈ నెల 15 న రష్యా దేశంపై ఉల్క పేలి ముక్కలుగా విరిగి భూమి మీద పడటం విన్నాము, వీడియోలలో చూసేము. అది ఏర్పరచిన నష్టం గురించి కూడా తెలుసుకున్నాము. అదే ఉల్క పేలకుండా భూమిని ఢీ కొంటే ఏం జరిగేదో, ఎంత నష్టం వాటిల్లేదో ఊహించుకోవచ్చు. ఎలాగంటే రష్యా దేశంపై భూమికి పైన 15 మైళ్ల ఎత్తులో పేలిన ఆ ఉల్క యొక్క అడ్డుకొలత 17 మీటర్లుగానూ, బరువు 10,000 టన్నులుగానూ ఉన్నదని నాసా వారు తెలియజేసేరు.

ఇంతకు ముందు భూమి ని ఢీ కొని(ఏర్పరచిన నష్టం ఎంతో తెలియదు కానీ)ఢీ కొన్న ప్రదేశాలలో అక్కడ ఉల్కలు ఏర్పరచిన గుర్తులు ఇంకా అలాగే ఉన్నాయి. అతిపెద్ద ఉల్కలు భూమిని ఢీ కొన్న ఆ ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం.

Puchezh-Katunki Crater...Nizhny Novgorod Oblast, Russia...అడ్డుకొలత 80 కిలోమీటర్లు...167 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Chesapeake Bay Crater...Virginia, United States...అడ్డుకొలత 85 కిలోమీటర్లు...35.5 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Acraman Crater...South Australia, Australia...అడ్డుకొలత 85-90 కిలోమీటర్లు...580 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Popigai Crater...Siberia, Russia...అడ్డుకొలత 100 కిలోమీటర్లు...35.7 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Manicouagan Crater...Quebec, Canada...అడ్డుకొలత 100 కిలోమీటర్లు...215 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Kara Crater...Nenetsia, Russia...అడ్డుకొలత 120 కిలోమీటర్లు...70.3 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Woodleigh Crater...Western Australia, Australia...అడ్డుకొలత 60-160 కిలోమీటర్లు...364 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Chicxulub Crater...Yucatán, Mexico...అడ్డుకొలత 180 కిలోమీటర్లు...65 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Sudbury Basin...Ontario, Canada...అడ్డుకొలత 250 కిలోమీటర్లు...1849 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

Vredefort Crater...Free State, South Africa...అడ్డుకొలత 300 కిలోమీటర్లు...2023 మిల్లియన్ల సంవత్సరాలకు పూర్వం

No comments:

Post a Comment