Wednesday, February 13, 2013

అతిపెద్ద ఆహార బద్రత నిర్లక్ష్యాలు ..... ఫోటోలు

ఆరోగ్యం మరియు మానవ సేవల కోసం ఎన్నో ఆహారపధార్ధాలను అమ్ముతున్నారు. వీటివలన ప్రజలు ఆరోగ్య లాభం పొందాలి. కానీ ఆహార బద్రత విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంతో ప్రజలు ఎన్నో ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేరు. అలా ఆహార బద్రతలో నిర్లక్ష్యంగా ఉన్నందువలన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలకు జరిగిన నష్టాల గురించి తెలుసుకుందాము.

మెలమైన్ పిల్లల పాలు నిర్లక్ష్యం...2008...చైనా ప్రపంచాన్నే దిగ్భ్రాంతి పరచిన దుర్ఘటన....పిల్లల పాల పొడిలో మరియూ తినుపధార్ధలలో అత్యధిక శాతం పారిశ్రామిక కెమికల్ మెలమైన్ కలిసుండటమె. 3,00,000 పిల్లలు ఆరొగ్య ఇబ్బందులు ఎదొర్కొన్నారు.

ఈ-కోలీ వ్యాపించడం...2011...జెర్మనీ జర్మనీలో 2011 న టొమేటో,దోసకాయ, బీన్స్ మరియూ పచ్చి కూరగాయలను తినవద్దని హెచ్చరించేరు. కారణం ఈ-కోలి చెలరేగటం. అప్పటికే 17 మంది చనిపోయేరు. ఎంతోమంది అనారోగ్యం పాలయ్యేరు.

కర్ణాటకా మధ్యం చావులు...1991-2008....ఇండియా మెతిల్ కలుషిత మధ్యం చవుకగా అమ్మడం. 308 మంది చనిపోయిన తరువాత విచారణ మొదలుపెట్టేరు. ఎలా జరుగుతున్నది అనేది తెలియలేదు. 2008 లో ఎలెక్షన్ల ఓట్లకొసం రాజకీయనాయాకులు పంపినీచేసిన మధ్యం అని తెలుసుకున్నారు. ఈ లోపు చాలామంది చనిపోయేరు.

సాల్మొనెల్లా మరియూ పీనట్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా...2008....అమెరికా 2008-2009 లో పీనట్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా తయారుచేసిన ఆహారంలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉండటంతో వారు తయారుచేసిన ఆహార పధార్ధలను వెనక్కితీసుకున్నారు. అప్పటికే చాలామంది, ముఖ్యంగా పిల్లలో ఆరోగ్యం దెబ్బతిన్నది.

డైయాతిలిన్ గ్లైకాల్ వైన్ పాయిజనింగ్...1985.... ఆస్ట్రియా ఎక్కువ రుచిగా ఉండటంకోసం ఈ విష పధార్ధాన్ని కలిపేరు. జర్మనీలో ఈ వైన్ పట్టుబడింది. ఆమ్మిన వారికి జైలు శిఖ్చలూ మరియూ జరిమానాలు విధించేరు. ఆస్ట్రియాలో తాయారైన వైన్ కొనడానికి ప్రజలు భయపడ్డారు.

జలిస్కో మెక్సికన్ చీస్ లిస్టేరియా ఇన్సిడంట్...1985.... అమెరికా ఈ చీస్ తిన్నందువలన ఎంతోమంది ఆనారోగ్యానికి గురయ్యేరు. ఎంతో అన్వేషణ తరువాత జలిస్కన్ మెక్సికన్ ప్రాడక్ట్స్ ఇంకార్పొరేషన్ అనే సంస్థ తయారుచేసే చీస్ వలనే అని తెలుసుకున్నారు. 100 మిల్లియన్ డాలర్లు నివారణగా ఇచ్చి ఆ కంపెనీ తమ కార్యకలాపాలను ఆపేసింది.

మెతెనాల్ పాయిజనింగ్....2001....జెక్ రిపబ్లిక్......2012 మధ్యపానాల వలన ప్రజలు ఆరొగ్య ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జెక్ ప్రభుత్వం మధ్యపాన నిషేధం అమలుపరిచింది. ఎవరి వలన ఇలా జరుగుతోందో తెలుసుకున్నారు. విషయాలు బయటపెట్టలేదు. తమదేశంలో తయారుచేస్తున్నవారే దీనికి కారణమని తెలుసుకుని వారిని నిర్భందించేరు.

జాక్ ఇన్ ది బాక్స్ ఈ-కోలీ పరిణామం...1993...అమెరికా జాక్ ఇన్ ది బాక్స్ అనేది ప్రసిద్ది చెందిన ఒక పెద్ద ఆహార ఉత్పత్తి కంపెనీ. వారు తయారుచేసిన మాంశంలో ఈ-కోలీ ఉన్నదని తెలుసుకొని, దాని వలన ఎంతోమంది ఆరోగ్యం దెబ్బతిన్నదని చర్య తీసుకున్నారు. ఫలితం కంపెనీ మూసేసేరు.

చీ చీ హెపటైటీస్-ఏ పరిణామం...2003....అమెరికా చీ చీ అనే ఈ రెస్టారంట్ కూడా ప్రసిద్ది చెందినదే. 2003 లో దేశంలో హెపటైటీస్-ఏ కి కారణం వీరే నని తెలుసుకుని వారి మీద చర్య తీసుకున్నారు. ఇప్పుడు ఆ రెస్టారంట్ అమెరికాలో తమ కార్యకలాపాలను మూసేసేరు.

సుడన్-1 పరిణామం...బ్రిటన్ మరియూ ప్రపంచవ్యాప్తంగా ఆహార పధార్ధాలకు రంగును చేకూర్చే పధార్ధం. దీనివలన కాన్సర్ వస్తోందని తెలుసుకున్నారు. బ్రిటన్లో ఉన్న ప్రీమియర్ ఫుడ్స్ అనే సంస్థను నిషేదించేరు. ఎంతమంది రోగానికి గురయ్యేరో తెలియదు.భారతదేశంలోని కారం పిండి తయారుచేస్తున్న కంపెనీ మూలంగా తెలుసుకున్నారు.

No comments:

Post a Comment