Tuesday, February 12, 2013

ఈ కాలపు(దొంగ) దేవుళ్ళు....ఫోటోలు

మనమందరమూ స్వాములమని చెప్పుకునే ఎంతోమంది దొంగ స్వామీజీలను గురించి విన్నాము, వింటునే ఉన్నాము. ఇలా తమల్ని స్వాములము(దేవుళ్ళు) అని చెప్పుకునే(మనం వినుండని,చూసుండని) మరికొందరిగురించి తెలుసుకుందాము.

Prince Phillip, Duke of Edinburgh (1921-present)
తనని తాను కాపాడుకోవటంకోసం తనకు తానుగా తాను దేవుడిని అని చెప్పుకోడు. కానీ వనూతు ద్వీపంలో ఈయనను దేవుడనే చెబుతారు. తనకు అతీత శక్తులున్నాయని ఈయన చెప్పుకోరు గానీ ఈయనను దేవునిగా కొలిచేవారిని ఈయన కాదనడు.

A woman currently in prison in Indonesia with the birth initials of L. A
ఈమె ప్రస్తుతం ఇండోనేషియా జైలులో ఉంటోంది. తాను ఒక దేవత నని చెప్పుకునీ, ప్రచారం చేసుకుని ప్రజలను పూగుచేసి, వారికి ఇతర మతాల గురించి చెడుగా చెప్పేది.

David Shayler (1965-present)
ఇతను పత్రికా విలేకరి మరియూ బ్రిటీష్ మిలటరీఇంటెలిజన్స్ లో పనిచేసేడు. 15 సంవత్సరాల పనిలో ఇతను ఎక్కువగా అర్ధంలేని వాఘుడు వాగేవాడట. జూలై 7,2007(7/7/7) లో తననితాను దేవునిగా చాటించుకున్నాడు. బ్రిటీష్ దేశాన్ని తీవ్రవాదుల నుంది కాపాడుతున్నాని చెపుతున్నాడు.

Warren Jeffs (1955-present)
Fundamentalist Church of Jesus Christ of Latter-Day Saints అనే చర్చ్ కు ప్రెశిడెంట్ గా ఉండేవాడు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. తాను దేవునినని చెప్పుకుంటూ చర్చ్ లో తనమీద నమ్మకం ఉంచినవారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు.

Mitsuo Matayoshi (1944-present)
ఈయన World Economic Community Party కి లీడర్. ఇది ఈయన పెట్టుకున్న పార్టీయే. తాను దేవుడినని, తనకే అందరూ ఓటువేసి గెలిపించాలని చెబుతూ ప్రత్యర్ధులను ఆత్మహత్య చేసుకోమని చెబుతాడు.

Alan John Miller (1962-present)
Divine Truth religious movement అనే పేరుతో ఒక గ్రూపును ఏర్పరచి తనని తాను ఏసు ప్రభువుగా ప్రకటించుకుని, తానే క్రిందటి జన్మలో ఏసు ప్రభువునని తెలుపుతూ అంతర్జాలంలో ఒక బ్లాగు పెట్టేడు. Mary Magdalene (ఈమెకుకూడా అంతర్జాలంలో ఒక బ్లాగు ఉన్నది) అనే ఆమెను పెళ్ళిచేసుకుని ఆమే పూర్వజన్మలో దేవతగా ఉండేదని తెలిపేడు. తరువాత తాను దవుడుని కాదని దేవ దూతనని రాసుకున్నాడు.

Rabbi Menachem Mendel Schneerson (1902-1994)
చాలామంది ఈయన్ను దేవునిగా కొలిచేరు. ఆయన 1994 లో చనిపోయినా, ఆయన శిష్యులు ఆయన తిరిగి వస్తారని చెబుతున్నారు.

Jim Jones (1931-1978)
సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న Peoples Temple సంస్థాపకుడు. అతనూ అతని శిష్యులూ సౌత్ ఆఫ్రికాకు తరలించబడ్డారు. ఈయన తనను ఏసు ప్రభువుగా, గౌతమ బుద్దునిగా మరియూ దేవతల తండ్రిగా చెప్పుకున్నాడు. ఎన్నో అవినీతి, హత్యలూ, ఆత్మహత్యలలో ఈయన బాగముందని చెబుతారు.

David Koresh (1959-1993)
ఇతను అమెరికాలో ఒక సంస్థను ఏర్పాటుచేసి తానే దేవునినని చెప్పుకునేవాడు. ఇతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. ఇతను తానున్న చోటునుండి ఎన్నో చట్టవిరుద్ద చర్యలు చేస్తున్నడని తెలుసుకున్న అమెరికన్ పోలీసులు ఒక దాడిలో ఇతన్ని, ఇతని శిష్యులనూ ఎదుర్కొన్నారు. కాల్పులలో ఇతనూ ఇతని శిష్యులూ చనిపోయేరు.

Vissarion (1961-present)
సైబీరియా అడవులలో తిరుగుతున్న ఇతను తానే దైవమని చెప్పుకుంటాడు. త్వరలోనే ప్రపంచం అంతరించిపోతుందనే విషయాన్నీ ఎక్కువగా చెబుతాడు.

No comments:

Post a Comment