Monday, February 11, 2013

శామ్సంగ్ చరిత్ర: ఎండుచేపలను ఎగుమతిచేసే వ్యాపార సంస్థగా పుట్టి ఈ రోజు టెక్నాలజీ మరియూ బహుళజాతి సమ్మేళన సంస్థగా పెరిగింది...ఫోటోలు

1938 లో బయుంగ్-చుల్ లీ అనే ఆయన కొరియాదేశంలో టెగూ అనే పట్టణం లో శామ్సంగ్ పేరుతో ఒక సంస్థ నిర్మించి, ఆహార ఎగుమతులు మొదలుపెట్టేరు. చైనాకు ఎండు చేపలూ మరియూ పిండి పధార్ధాలూ నౌకల మూలంగా ఎగుమతిచేసేరు.

1950 మరియూ 1960 లలో బట్టలూ మరియూ జీవితభీమా పధకాలు అమ్మడం మొదలుపెట్టేరు.

1969 లో శామ్సంగ్ ఎలెక్ట్రానిక్స్ మొదలుపెట్టి బ్లాక్ అండ్ వయిట్ టీవీ లు తయారుచేసేరు. మొదటి టీవీ 1970 లో అమ్మకానికి పెట్టేరు.

1970 లో పెట్రో కెమికల్స్ మొదలుపెట్టి అదే సంవత్సరం వాషింగ్ మిషెన్లూ, రిఫ్రెజిరేటర్లూ మరియూ మైక్రోవేవ్ ఓవెన్లు తయారుచేసేరు.

1980 లో వారి చూపు ఎలెక్ట్రానిక్స్ రంగంపై పడింది. కలర్ టీవీ లు,పర్సనల్ కంప్యూటర్లూ, వీ.సి.ఆర్ లూ, టేప్ రికార్డర్లూ తయారుచేసి అదే సంవత్సరం అమెరికాకు ఎగుమతులు మొదలుపెట్టేరు.

1989 లో BP కంపెనీతో కలిసి కెమికల్ కంపెనీ పెట్టేరు.

1990 మధ్యలో మెమొరీ కార్డులూ మరియూ హార్ద్ డిస్క్ లూ తయారుచేయడం మొదలుపెట్టేరు. అది ఈ రోజుకీ అతి పెద్ద వ్యాపారం అందిస్తోంది.

1995 లో వారు తయారుచేసిన మొబైల్ ఫోను పనిచేయలేదు. అప్పుడు కంపనీకి చైర్ మ్యాన్ గా ఉన్న కున్-హీ లీ కంపెనీలో అప్పటికే తాయరుచేయబడ్డ వేలది ఫోన్లల్ను ద్వంసం చేయించేరు.

1990 లో మొబైల్ ఫోన్ల టెక్నాలజీ ని సీరియస్ గా తీసుకుని, 1999 లో ఇంటర్ నెట్ రెడీ ఫోన్లను తయారుచేసేరు. అది ఇప్పటికీ అత్యధిక వ్యాపారం ఇస్తోంది.

1990 నుండి టీవీ ల మీద శ్రద్ద చూపించి 1998 లో మొదటి డిజిటల్ టీవీ ని తయ్యరుచేసేరు.1999 లో మాస్ ప్రొడక్షన్ చేయగలిగేరు.

2000 లో HD టీవీలు తయారుచేసేరు. హోం ధియేటర్ సిస్టంస్ తయారుచేసేరు.

మొదటి ఆండ్రాయడ్ ఫోనును, గాలక్సీ-S ను, 2010 లో మొబైల్ ప్రపంచ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేరు.

2010 లో 7 ఇంచ్ల గాలక్సీ ట్యాబ్ ను పరిచయంచేసేరు.

2013 లో స్మార్ట్ టీవీలను పరిచయంచేసేరు.

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల మార్కెట్తో పాటూ ఎలెక్ట్రానిక్స్ లో లీడర్ అయ్యేరు.

No comments:

Post a Comment