Wednesday, February 20, 2013

1960 కు ముందు ఈ నగరాలు లేవు....ఫోటోలు

50 సంవత్సరాలకు క్రితం ఈ నగరాలు లేవు. కేవలం 2-3 తరాలలో ఏమీలేని ఈ నగరాలు అతిపెద్ద జనాభాగల నగరాలుగానూ, ఆర్ధీక అభివ్రుద్దిలోనూ తమ ఉనికిని చాటిచెబుతున్నాయి.

Incheon, South Korea నార్త్ కొరియా సరిహద్దుకు కొద్ది మైళ్ల దూరంలో ఉన్నది ఈ నగరం. 3 మిల్లియన్ల జనభాతో ఇప్పుడు సౌత్ కొరియాలోనే 3 వ అతిపెద్ద నగరంగా ఎదిగింది. 1994 లో సౌత్ కొరియా ప్రభుత్వం భవిష్యత్తును గుర్తించి సాహస పథకముతో సముద్రంలోని కొంత భాగమును నేలగా మార్చుకుని అక్కడ ప్రపంచములోనే అతిపెద్ద టెక్నాలజీ నగరాన్ని నిర్మాణిస్తోంది. 2020 లోపు వేసుకున్న పథకము ప్రకారం అతిపెద్ద నగరాన్ని నిర్మించుకుంటుంది.

King Abdullah Economic City, Saudi Arabia 1960 ముందుదాకా ఎందుకు, ఇప్పటికీ ఈ నగరం లేదనే చెప్పాలి. కింగ్ అబ్దుల్లా గారికి రెడ్ సీ ప్రాంతంలో అతి నవీన నగరాన్ని నిర్మించాలనే ఆశ ఈ నగరానికి శ్రీకారం చుట్టింది. కానీ అనుకున్న ప్రకారం ఈ నగరం నిర్మించబడాలంటే 100 బిల్లియన్ డాలర్లు ఖర్చౌతుంది. 2020 లోపు ఈ నగరం పూర్తౌతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అక్కడక్కడ తలుక్కుమని మెరిసే భవనాలు కనబడుతున్నాయి.

Iqaluit, Nunavut, Canada 1971 లో Frobisher Bay అధికారపూర్వకంగా కెనడా యొక్క నార్త్-వెస్ట్ సరిహద్దు ప్రాంతంగా ప్రకటించబడింది. 2000 మంది జనభాతో ఉన్న ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు తమకంటూ తమ సొంత ప్రదేశంకావాలని 1999 లో నార్త్-వెస్ట్ సరిహద్దు నుండి విడిపోయింది. పేరు కూడా Nunavut గా మార్చుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత Iqaluit Nunavut రాజధాణిగా ప్రకటించుకుని ప్రత్యేక ప్రదేశముగా మారింది.

Sandouping, China 1984 వరకు ఈ నగరాన్ని Huangniupu గ్రామంగా పిలువబడేది. Three Gorges Dam (ప్రపంచములోనే అత్యధికమైన కరెంటు ఉత్పత్తిచేసే డాం)ను కట్టడానికి 40,000 మంది పనివారిని ఇక్కడకు తీసుకువచ్చి వారికి ఉండటానికి వసతులు చేసింది. ఇక్కడకి కొద్ది మైళ్ల దూరంలోనే 30 మిల్లియన్ల జనాభాగల Chongqing నగరం ఉన్నది. డాం పూర్తైనాక ఇక్కడున్న పనివారు కూడా అక్కడికి వచ్చేస్తారని ఈ ప్రాంతాన్ని నగరంగా మార్చి కావలసిన వసతులు కల్పించింది.

Putrajaya, Malaysia మలేషియా రాజధాణి కులాలంపూర్. ఇక్కడ 1.5 మిల్లియన్ల జనాభా ఉన్నది. ఇప్పటికే కులాలంపూర్ లో ఎక్కువ జనాభా అనే చెప్పాలి. అది ఇంకా పెరగకుండా ఉండటానికి 15 నిమిషాల ప్రయాణ దూరంలో 1995 లో పరిపాలనా కేంద్రంగా ఈ నగరం నిర్మించబడింది. ఇప్పటికే ఇక్కడ 60,000 మందికిపైగా నివాసమేర్పరుచుకున్నారు.

Astana, Kazakhstan 1991 లో సోవియట్ యూనియన్ పతనమైన తరువాత కజకస్తాన్ స్వాతంత్రయం ప్రకటించుకుంది. విపరీతమైన ఆయిల్ డబ్బుతో ప్రకాసిస్తున్న కజకస్తాన్ Almaty నుండి తమ రాజధాణిని Tselinograd కు మార్చుకుంది. అదే ఇప్పుడు మరో పేరుమార్పిడితో Astana గా మారింది. 1961 వరకు ఇక్కడ అనేకమంది జీవించేవారు. అయితే వారందరూ పాత సోవియట్ యూనియన్ కు చెందిన కిరాతకులు. వారంతా తిరిగి వెల్లిపోవడంతో Tselinograd అనే పేరును Astana గా మార్చేరు. ఇప్పుడు ఈ నగరం అత్యంత ఆధునిక నగరంగా పిలువబడుతోంది.

Abuja, Nigeria 1960లో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్రం సంపాదించుకుంది నైజీరియా. కానీ ఆ తరువాత 10 సంవత్సరాలూ అంతర్ కలహాలలో మునిగిపోయింది. 1970 లో పలు పక్షాల నాయకులూ కలిసి నైజీరియాకు కొత్త రాజధాణి కావాలని ఒప్పుకున్నారు. నైజీరియాలో ఆయిల్ ఉన్నదని తెలుసుకోవడంతో డబ్బు ప్రవాహం పెరిగింది. 1991 లో అబూజా నగరం పూర్తి అయ్యింది. ఇప్పటికే అక్కడ ఒక మిల్లియన్ ప్రజల నివసిస్తున్నారు.

Doha, Qatar 1971 లో కతార్ బ్రిటీష్ పరిపాలన నుండి స్వాతంత్రం సంపాదించుకున్నది. ఎక్కువ మొత్తంలో ఆయిల్ మరియూ గ్యాస్ నిలువలు ఉండటంతో కతార్ ఆర్ధీకంగా బలం పొందింది. అప్పటివరకూ మునిసిపాలిటీగా ఉన్న దోహా నగరంగా మారింది. ఇప్పుడు వారి దగ్గర ఎంత డబ్బు ఉన్నదంటే 2022 లో జరుగబోయే ఫీఫా ప్రపంచ కప్ ఆటలను డబ్బుతో కొనగలిగేరంటే మీకే అర్ధమౌతుంది.

Navi Mumbai, India ముంబై జనాభా 12 మిల్లియన్లను దాటడంతో 1972లోనే ముంబై నగరంలో చోటు పూర్తిగా తగ్గిపోయింది. అందువలన ఈ నవీ ముంబై ను నిర్మించడానికి పూనుకున్నారు. 40 సంవత్సరాలలో ఇది ఒక మరో పెద్ద నగరంగా పెరిగింది. ఇప్పటికే ఇక్కడ 1.2 మిల్లియన్ల జనభా నివసిస్తోంది.

Dubai, United Arab Emirates 1971లోనే దుబాయ్ కి కూడా బ్రిటీష్ పరిపాలననుండి స్వాతంత్రయం వచ్చింది. యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగంగా ఉన్న దుబాయ్ లో అత్యంత ఎక్కువ ఆయిల్ నిలువలు ఉన్నాయని తెలుసుకున్నారు. డబ్బు ప్రవాహం ఎక్కువవడంతో దుబాయ్ నగర రూపురేకలే మారిపోయింది. అంతకు ముందు కొన్ని వేల మంది జనాభానే ఉన్న దుబాయ్ లో ఇప్పుడు 1.5 మిల్లియన్ ప్రజలు నివసిస్తున్నారు. నగరం భూమిలో చోటులేకపోవడంతో సముద్ర తీరాలనూ, సముద్రాన్నీ భూమిగా మార్చుకుంటున్నారు.

No comments:

Post a Comment