Tuesday, January 8, 2013

యూ.ఎఫ్.ఓ(UFO)లను చూడాలనుకుంటే మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళాలి....ఫోటోలు

ELK RIVER, MINNESOTA
1990 లో మొదటి సారిగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు UFO లను చూసేరు. అప్పటి నుండి రకరకాల రూపాలలో అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారట. 2008 లో జెల్లీ ఫిష్ లాగా కనబడిన UFO నే వాల్లను ఎక్కువ కలత పరిచిందట.

WARMINSTER, ENGLAND
ఈ ప్రదేశము మర్మమైన స్టోన్ హెంజ్ దగ్గర ఉన్నది. 1960 వ సంవత్సరం నుండి ఇక్కడ వివరించలేని మరియూ వింతకరమైన శబ్ధాలు వినబడుతున్నాయట. అప్పటి నుండి ఎన్నో UFO లు అక్కడికి వచ్చినైయట. సుమారు 5000 కు పైగా UFO లు అక్కడకి వచ్చినట్లు, అందులో కొన్ని ఇంకా అక్కడే ఉన్నట్లు చెబుతారు.

COLARES ISLAND, BRAZIL
UFO ల ను చూడటానికి వెళ్ళే ప్రదేశాలలో ఇది అత్యంత హానికరమైనదట. 1977 లో అక్కడకు వచ్చిన UFOలు అక్కడున్న ప్రజలపై లేజర్ కాల్పులు జరిపినై. 2 చనిపోయేరు మరో 100 మంది గాయపడ్డారు. భ్రెజిల్ మిలటరీ పరిశోధనలు జరిపింది కానీ ఎటువంటి సమాచారమూ అందించలేదు. ఆ రోజు అక్కడి ప్రజలు ఎలా చనిపోయేరో, ఎలా గాయపడ్డారో తెలుపలేదు.

CALIFORNIA
ఇక్కడున్న పసిఫిక్ సముద్రతీరాన UFO లు ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయట. 1942 లో లాస్ ఏంజల్స్ లో కనబడ్డ UFO ను అమెరికన్ ఆంటీ-ఏర్ క్రాఫ్ట్ తుపాకులతొ కాల్చడం సుమారు ఒక మిల్లియన్ మంది చూసేరట. తుపాకుల తూటాలకు చిక్కని ఆ UFO కొద్దిసేపట్లో మాయమైనదట.

NULLABOR PLAIN, AUSTRALIA
1950 లో ఈ చోట్లో బ్రిటీష్ వారు ఆటంబాంబులను ప్రశొధన చేస్తున్నప్పుడు UFO లు వచ్చి వెళ్ళేవని చెప్పేవారు. ఆ తరువాత బ్రిటీష్ వారు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయేరు. ఆ ప్రదేశమంతా కాళీ చెయబడింది. ఆ తరువాత ఆ ప్రదేశం ఒక ఎడారి ప్రాంతమైయ్యింది. కొన్ని రోజుల తరువాత ఆ ఎడారిని దాటి వెళ్ళిన చాలామంది ఆ ఎడారి ప్రాంతంలో నుండి వెళ్లేటప్పుడు తమకు UFO లు కనబడేవని, అవి తమ కార్లను కొంతదూరం తరుముకొచ్చేవని తెలిపేరు. తాము భయంతో వేగంగా వెళ్లేవారమని చెప్పేరు. ఆ ఎడారి ప్రదేశం నుండి వెళ్ళిన వారు తిరిగి రాలేదని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు రావడంతో ఆ ఎడారి ప్రదేశనికి వెళ్లే రహదారిలో హెచ్చరిక బోర్డ్ పెట్టేరు.

THE WELSH TRIANGLE
1977 Dyfed, Wales లో UFO లు వచ్చి అక్కడ నివసిస్తున్న వారిని భయపెట్టేవట. విపరీతమైన ద్వనితో ఇళ్ళ కిటీకల దగ్గరకు వచ్చేవిట. ఆ సమయములో అక్కడున్న రేడియోలూ, టెలిఫోన్లూ, టీవీ లు పనిచేసి కావుట.

RACHEL, NEVADA
ఇక్కడికి వెడితే UFO లను ఖచ్చితంగా చూడవచ్చుట. ఎందుకంటే, ఈ చిన్న టౌన్(pop. 80) లో అమ్మేవాటిని Little A'Le'Inn అంటారు. అంతే కాకుండా ఈ ప్రదేశం నవేడా రాష్ట్ర అధికారులచే "The Extraterrestrial Highway" (speed limit: "Warp 7") అనే రహదారికి దగ్గరగా ఉన్నదట. మరో కారణం, మరో పక్క "Shangri-La:" అమెరికన్ ప్రభుత్వ రహస్య ప్రదేశమైన ఏరియా-51 ఉండటమే.

THE M-TRIANGLE, RUSSIA
మాస్కో నగరానికి తూర్పు దిశగా 600 మైళ్ళు దూరంలో ఉన్న ఎత్తైన కొండ ప్రాంతంలో UFO లే కాక, ఆకాశంలో అనేక రంగులూ, అనేక అర్ధంకాని అక్షరాలూ, గుర్తులూ కనబడుతూ శబ్ధాలూ వినబడతాయట. రష్యన్ ఇంటెల్లిజన్స్ ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని పర్యవేక్చిస్తూ ఉంటుందట.

SAN LUIS VALLEY, COLORADO
ఈ ప్రదేశంలో UFO లు చాలాసార్లు కనబడ్డాయట. ఈ అతి ఎత్తైన ప్రదేశంలో కుళ్ళిపోయిన జంతువులూ, ఎవరూ ఇంతకుముందెప్పుడూ చూడనటువంటి జంతువులూ కనబడతాయట. ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఇక్కడున్న యూరేనియం ఖనిజాలే UFO లు రావడానికి ఒక కారణమని అక్కడివారు చెబుతారు.

EARTH'S ORBIT... AND BEYOND
అంతరిక్ష నౌకలలో వెళ్ళిన అమెరికా మరియూ రష్యా దేశాలకు చెందిన ఆస్ట్రోనాట్స్ వారు ఎదుర్కొన్న, చూసిన UFO ల గురించి బహిరంగంగా తెలిపేరు. చంద్రమండలం వెళ్ళే నౌకలలోని వారు కూడా ఇదే మాట చెప్పేరు. అయినా నాసావారు దీనిని ఎందుకు బయటపెట్టంలేదు? వారు భయపడుతున్నారా లేక ప్రజలకు చెప్పకూడదనా? అని అనేక మంది అడుగుతున్నారు.

CHILE'S UFO TRAIL
చిలీ దేశంలో UFO లు ఎక్కువగా కనబడతాయనేది ప్రపంచానికే తెలిసిన విషయమే. అందుకే ఆ దేశ ప్రభుత్వం పర్యాటక శాఖ లో “UFO ట్రైల్” అనే పేరుతో ఒక పర్యాటక వసతి పెట్టింది. ఈ పర్యాటక వసతిని చూడాలనుకుని సాహసం చేసేవారికి అన్య మనుష్యులు కనబడవచ్చు. 19 మైళ్ల ఎత్తుకు కొండను ఎక్కాలి, అక్కడ నుండి 10,000 అడుగులు గుర్రపు సవారి చేసి ఎక్కాలి. అలా వెళ్ళిన వారు అక్కడ 200 గ్రానైట్ దుక్కలు చూడవచ్చు. అవి పురాతనకాలం లోని రోదసీయాత్రికులు దిగే చోటులాగా కనబడుతుంది.

No comments:

Post a Comment