Tuesday, January 1, 2013

"మాంట్ సెర్రాట్"(Montserrat)బూడిదలో కూరుకుపోయిన నగరం....ఫోటోలు

బ్రిటీష్ వారికి సొంతమైన కరీబియన్ ద్వీపం. ఈ ద్వీపములోని ఇక అగ్నిపర్వతం 1995 లో పేలి బూడిదను విరజిమ్మటం మొదలుపెట్టింది. ఈ రోజు వరకూ ఈ అగ్ని పర్వతం అలా భూడిదను కక్కుతూనే ఉన్నది. అంతకు ముందు, అంటే 1994 వరకు వైభవంగా ఉన్న ఈ నగరం 1995 లో బూడిదతో మూసుకుపోయింది. 1997 లో ఈ అగ్నిపర్వతంలోని మరో వైపు కూడా పేలడతో బూడిద ఆ నగరాన్ని కొంచంకొంచంగా బూడిదతో నింపడంతో, అక్కడ నివసిస్తున్న మనుష్యులు వేరు ప్రాంతాలకు వలస వెళ్లేరు. శాత్రవేత్తలూ, నిపుణులూ ఆ అగ్నిపర్వతపు తాకిడి ఎక్కువరోజులు ఉంటుందని తెలియపరచడంతో, అక్కడున్న విమానాశ్రయం, రైల్వే స్టేషన్లనూ మూసేసేరు. ప్రజలు కూడా తమ తం ఇళ్లనూ, వ్యాపార సంస్థలనూ వదిలి వెళ్ళిపోయేరు.బ్రిటీష్ ప్రభుత్వం ఆ ద్వీపం ను నిశేధిత ప్రదేశంగా ప్రకటించి, అక్కడ నివసిస్తున్న ప్రజలకు బ్రిటీష్ జాతీయ పౌరల గుర్తింపును ఇచ్చింది.


No comments:

Post a Comment