Friday, January 4, 2013

చారిత్మాతక(Historical)సంఘటనలు.... అరుదైన ఫోటోలు

Looking Down Sacramento Street [San Francisco, 1906]
ఏప్రిల్ 18, 1906 న ఏర్పడిన అతిపెద్ద భూకంపం మరియూ మంటలూ సాన్ ఫ్రాన్సిస్కో ను ధ్వంసం చేసిన ద్రుశ్యం. Arnold Genthe అనే ఆయన తీసిన ఫోటో.

Breaker Boys [Pennsylvania, 1910]
ఈ ఫోటో చూసిన తరువతే అమెరికాలో చైల్డ్ లేబర్ నిషేధించేరు. Lewis Hine అనే ఆయన ఈ ఫోటోను తీసేరు. Migrant Mother [Oklahoma, 1936]

Florence Owens Thompson అనే ఈమె అప్పుడు దేశంలో ఏర్పడిన గ్రేట్ డిప్రెషన్ వలన తన పిల్లల తిండికోసం తన గుడారాన్ని అమ్ముకొన్నది. ఈ ఫోటోను Dorothea Lange తీసేరు.

Hitler in Paris [Paris, 1940]
జూన్ 23,1940 హిట్లర్ సైన్యాలు ఫ్రాన్స్ ను జయించి చేజిక్కించుకున్న తరువాత హిట్లర్ స్వయంగా సైన్యాధికారిని ప్రశంసించుటకు వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో.

The Last Jew in Vinnitsa [Ukraine, 1941]
Einsatzgruppen అనే సైనికుని ఫోటో ఆల్బంలో ఉన్న ఈ ఫోటో వెనుక “The last Jew of Vinnitsa” అని రాసున్నది. ఆక్కడ నివసిస్తున్న 28,000 మంది జ్యూలనూ చంపేసేరట.

Soviet Flag raised above the Reichstag [Berlin, 1945]
1945 జెర్మనీలోని బెర్లిన్ నగరంలోని Reichstag భవనం పై సోవియట్ రష్యా సైనికులు Raqymzhan Qoshqarbaev మరియూ Georgij Bulatov సోవియట్ రష్యా జెండాను ఎగరవేస్తున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటోను Yevgeny Khaldei తీసేరు.

Vatican II Begins [Vatican City, 1960]
రెండో వాటికన్ కౌన్సిల్ ప్రారంభమౌతోందని సంతంకం పెడుతున్న Pope John XXIII.

The Body of Che Guevara [Bolivia, 1967]
మార్క్ సిస్ట్ విప్లవ నాయకుడు Guevara ను బోలివియా ఆర్మీ చంపేసిందని చెప్పినప్పుడు లాటిన్ అమెరికా మరియూ తర్డ్ వరల్డ్ నమ్మలేదు. అప్పుడు ప్రపంచానికి చూపడానికి ఈ ఫోటోను తీసేరు.

Phan Th? Kim Phúc [Vietnam, 1972]
పై ఫోటోలో మధ్యలో ఉన్న 9 సంవత్సరాల అమ్మాయి పేరు Kim Phúc. నపాలం(Napalm) బాంబు వేసినప్పుడు ఈ అమ్మాయి వెనుక భాగం సీరియస్ గా కాలిపోయింది. ముందు పరిగెత్తుతున్న బాలుడు ఆ అమ్మాయి అన్నయ్య. ఇద్దరూ బ్రతికేరు. ఈ ఫోటో ప్రపంచాన్ని కదిలించింది. నపాలం బాంబులను యుద్దాలలో వాడకూడదనే నిసేధానికి నాంధి పలికింది. ఈ ఫోటోను Huynh Cong Ut తీసేరు.

Churchill
యుద్ద సమయంలో గ్రేట్ బ్రిటన్ ప్రధాన మంత్రి Winston Churchil. ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈ ఫోటోను తీసిన Yousuf Karsh కూడా ప్రసిద్ది చెందేరు. ఎక్కువ సార్లు ముద్రించబడ్డ ఫోటో ఈదే.

No comments:

Post a Comment