Monday, January 7, 2013

ప్రపంచవ్యాప్తంగ జరుపుకుంటున్న నూతన సంవత్సరాలు....ఫోటోలు

కొన్ని రోజులకు ముందే ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం చూసేము. మనమంతా ఇంకో 3 నెలలో మన నూతన సంవత్సరమైన ఉగాది ని వేడుకగా జరుపుకుంటాము. ఇవి రెండూ మనకు తెలుసు. కానీ ఇలాగే తమ తమ నూతన సంవత్సరాలను జరుపుకునే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారెవరొ, ఆ నూతన సంవత్సరాలు ఏవో, వాటి పేర్లు ఏమిటో,ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆ వేడుకలను జరుపుకుంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Rosh Hashanah – Jewish New Year ( సుమారు 14 million ప్రజలు )
సెప్టంబర్ నెలలో వస్తుంది

Tet Nguyen Dan – Vietnamese New Year ( సుమారు 87 million ప్రజలు )
చైనావారి లూనార్ క్యాలండర్ ప్రకరమే వస్తుంది. అంటే జనవరి నెల చివర్లోగానీ లేక ఫిబ్రవరి నెల మొదట్లోగాని వస్తుంది.

Songkran (సుమారు 115 million ప్రజలు )
ఏప్రిల్ నెల 13 లేక 15 లోపు తాయ్లాండ్లో జరుపుకుంటారు. ఇక్కడే కాకుండా సౌత్ ఈస్ట్ మరియూ సౌత్ ఆసియా దేశాలోని కొంతమంది,కంబోడియా, లావోస్, బర్మా దేశాలో కూడా జరుపుకుంటారు. కానీ తాయ్లాండ్ దేశం జనవరి-1 నే నూతన సంవత్సరంగా ప్రకటించింది

Japanese New Year ( సుమారు 127 million ప్రజలు)
జపానీయులు అధికార పూర్వంగ జనవరి-1 నే నూతన సంవత్సరం జరుపుకుంతున్నా, సాప్రదాయంగా వీరుకూడా కొరియా, వియత్నాం లలాగా చినీయుల నూతన సంవత్సరం రోజునే నూతన సంవత్సర వేడుకులు జరుపుకుంటారు.

Noviy God – Russian New Year ( సుమారు 143 million ప్రజలు )
కొన్ని సంవత్సరాలుగా క్రిస్మస్ చెట్లూ, సాంతా డ్రెస్సులూ రష్యాలో నిషేధించేరు. మరికొన్ని సంవత్సరాల తరువాత నోవీ దేవుని పేరుతో నూతన సంవత్సర వేడుకలకు అనుమతిచ్చింది. జనవరి 1 నుండి 7 వరకు వారం రోజులు జరుపుకుంటారు.

Nowruz ( సుమారు 300 million ప్రజలు )
ఈ నూతన సంవత్సరాన్ని సిరియా ప్రజలే కాకుండా, కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలూ, ఇరాన్, ఇరాక్, టర్కీ మరియూ ఆఫ్ గనిస్తాన్ దేశాలలో జరుపుకుంటారు. 2 వ శత్తబ్ధము నుండే పెరిషియన్లు జరుపుకునే వారని చరిత్రలో రాయబడింది. ఈ నూతన సమవత్సరం జరుపుకునే విధంలో కొంచం మార్పు ఉన్నది. ఏ రోజైతే పగలూ-రాత్రి సరిసమానంగా ఉంటాయో ఆ రోజు జరుపుకుంటారు

Hindu/Indian New Year ( సుమారు .9-1.2 billion ప్రజలు )
ఇండియాలో రాష్ట్ర ప్రజలు నూతన సంవత్సరాన్ని వేరువేరుగా జరుపుకుంటారు. అలా జరుపుకున్నా, సాధారణంగా అది ఏప్రిల్ నెలలోనే ఉంటుంది

Chinese New Year ( సుమారు 1.3 billion ప్రజలు )
వీరి నూతన సంవత్సరం కూడా ఎప్పుడూ ఒకే నెలలోగానీ, ఒకే రోజున గానీ రాదు. జనవరి నుండి- ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా వస్తుంది

Hijri New Year – Islamic New Year ( సుమారు 2.4 billion ప్రజలు )
ఇస్లామీయుల ప్రకారం మొదటి సంవత్సరం 610 ఆడ్. ఎప్పుడైతే మొహమ్మద్ మెక్కా నుండి మదీనాకు వెళ్లేరో ఆ రోజే హిజ్రా. ఇస్లామిక్ సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికంటే 11-12 రోజులు తక్కువ వుంటుంది.నవంబర్ 14-15 తేదీలలో ఉంటుంది

Gregorian New Year (Most Of The World)
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 న జరుపుకునే ఆంగ్ల నూతన సంవత్సరం.

No comments:

Post a Comment