Monday, January 21, 2013

ఇస్త్రీ (ఇస్త్రీ పెట్టెలు) యొక్క చరిత్ర....ఫోటోలు

మనం ఎక్కడికైనా బయటికి వెళ్లాలనగానే ఇస్త్రీ బట్టల కోసం చూస్తాం. ఇస్త్రీ అనేది.. ఒకటో శతాబ్దంలోనే పెద్దపెద్ద ఇనుప గిన్నెలాంటి పరికరంలో మండేబొగ్గును వేసి బట్ట ను సాఫీచేయడానికి వాడేవారట! ఆ తర్వాతికాలంలో ఇనుపపెట్టెలాంటిది వాడుకలోకి వచ్చింది. 5 వ శతాబ్ధములో గ్రీకులు ఇస్త్రీ పెట్టెలను మొదటిసారిగా ఉపయోగించేరు. మనదేశంలో కేరళీయులు ఆ కాలంలో బొగ్గుకు బదులు కొబ్బరిచిప్పల్ని వాడేవారు. ఆ తర్వాత కిరోసిన్, గ్యాస్ లాంటి వివిధ ఇంధనాలతో ఇనుపపెట్టెను వేడెక్కేలా చేసి ఇస్త్రీకి ఉపయోగించారు. క్రమేణా విద్యుత్తుతో పనిచేసేవి వాడుకలోకి వచ్చాయి.

అవసరమైన ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఇస్త్రీపెట్టెను 1882లో హెన్రీసీలె కనుగొన్నాడు. 1920ల్లో థర్మోస్టాట్తో పనిచేసేవి, ఆ తర్వాత థామస్ సియర్స్ ఆవిరితో ఇస్త్రీ చేసే సౌకర్యాన్ని కనుగొన్నాడు.


2 comments:

  1. మన చెంబు కనపడకపోవడం అన్యాయం.

    ReplyDelete