Monday, January 28, 2013

నిజాలైన సైన్స్ ఫిక్షన్ మరియూ మానవ ఊహాభావనలు....ఫోటోలు

ఇందులో మనం చూడబోతున్న/తెలుసుకోబోతున్న కొన్ని టెక్నాలజీలు ఇంతకుముందు సైన్స్ ఫిక్షన్ మరియూ ఊహాభావకల్పిత సినిమాలకు మాత్రమే పరిమితమైనాయి. కానీ వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం నిజజీవితంలో చూడగలుగుతున్నాము.

ఇనుము కంటే గట్టిదైన పట్టు
ఇనుము కంటే గట్టిదైన పట్టు......వంశానుగత మార్పిడి చేయబడ్డ పట్టుపురుగుల నుండి ఉత్పత్తి అవుతున్న పట్టు ఇనుము కంటే గట్టిగా ఉంటుంది. అమెరికా శాస్త్రవేత్తలచే అభివృద్ధి చేయబడ్డ ఈ పట్టును ఎన్నో ముఖ్యమైన వాటిలో దారముగా వాడుతున్నారు. శస్త్రచికిత్స దారముగా,మిలటరీ మరియూ పోలీసుల బుల్లెట్ ప్రూఫ్ బట్టలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఇనుములాంటి దారము తోనే స్పైడర్ మ్యాన్ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఒక చోటు నుండి మరోచోటుకు ఎగురుకుంటూ వెళ్ళడం చూపించేరు.

రహస్య ఉత్తరీయము
రహస్య ఉత్తరీయము... .HyperStealth Biotechnology అనే కంపెనీవారిచే తయారుచేయబడ్డ ఈ ఉత్తరీయము/దుప్పటి/గుడ్డ 2012 లో కెనడా మరియూ అమెరికా సైన్యాధికారులకు చూపబడింది. పరిమాణ రహస్యం అనే పేరుతో తయారుచేయబడ్డ ఈ ఉత్తరీయం వేసుకున్న వారిని/గుంపును అవతలివారికి కనబడనీయకుండా చేస్తుంది. ఇన్ ఫ్రా రెడ్ లైట్లను కూడా లోనికి పోనీయదు. ఎటువంటి పరికరాన్ని ఉపయోగించినా ఈ దుప్పటిక్రింద ఉన్నవారు కనబడరు.

వెదజల్లుకోగలిగే చర్మం
వెదజల్లుకోగలిగే చర్మం....ఎక్కువగా కాలిన చర్మం ను బాగుచేయుడానికి, కాలిన గాయములను తగ్గించడానికి, త్వరగా కోలుకోవడానికి ఈ వెదజల్లుకోగలిగే చర్మం ఉపయోగపడుతుంది. దీనిని (వెదజల్లుకోగలిగే చర్మం) తయారుచేయడం ఎంతో సులువు. రోగి శరీరంలోని కాలిపోని చర్మమును కొంతగా తీసీ ప్రత్యేక రాసాయనికామ్లద్రవములో వేయాలి. ఆ చర్మము ఆ రాసాయనికామ్లద్రవములో చూర్ణముగా మారి కరిగిపోతుంది. అలా కరిగిన ద్రవమును పిచికారిమూలముగా కాలిన చోట విరజిమ్మాలి. వారం రోజులలో కాలినచోట చర్మము తిరిగివస్తుంది.

మనుష్యులను ఎక్కువరోజులు బ్రతికించ గలిగే (జీవ)కణం
మనుష్యులను ఎక్కువరోజులు బ్రతికించ గలిగే (జీవ)కణం....చిన్న వయస్సు కలిగినవారిలోని వంశమూల/ఎదురాడు కణాలను(STEM CELL)తీసి మరణించబోతున్న వారికి 4 రోజుల ముందుగా సూదిమందుగా ఎక్కిస్తే, మరణించబోతున్న వారు ఎక్కువకాలం బ్రతక వచ్చు. జంతువులలో దీని ప్రయోగం విజయవంతమవడంతో, మానవులమీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగంకూడా విజయవంతమౌతుందని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు.

3D house building printer
3D house building printer... .. Enrico Dini అనే కంపెనీ తయారుచేస్తున్న ఈ యంత్రం విశేషమైన నారతో కూడిన కాంక్రీట్ ను తయారుచేస్తుంది. ఈ కాంక్రీట్ తో భవనాలను వేగంగా కట్టవచ్చు.

తానుగా తోలుకోగలిగే కారు(Self-driven cars)
తానుగా తోలుకోగలిగే కారు(Self-driven cars).....2012 లో విజయవంతముగా ప్రయోగించబడి, ప్రభుత్వ అనుమతి పొంది అమెరికాలోని నెవేడా, ఫ్లోరీడా మరియూ కాలిఫోర్నియాలలో ఉపయోగించబడి ఎంతటి ట్రాఫిక్లో నైన ప్రమాదాలకు గురికాకుండా వెళ్లగలుగుతోంది.

మెదడు ఉపదేశాలతో పనిచేసే చేతులు
మెదడు ఉపదేశాలతో పనిచేసే చేతులు......అమెరికన్ శాస్త్రవేత్తలు మెదడు లోపలి భాగాలలొ తగిలేటట్లుగా మైక్రోఎలెక్ట్రొడ్ లను తయారుచేసేరు. వీటిని మెదడులోని కార్టెక్స్ భాగానికి తగిలించినట్లయితే, మెదడు చేసే సంకేతాల మూలంగా ఆ చేతులు పనిచేస్తాయి. ఇవి పక్షవాతం, కదలలేని మనుష్యులలొ అమర్చితే వారు కావలసిన విధంగా ఉపయోగించుకోవచ్చు.

Earth space vessel reached the edge of the Solar System
Earth space vessel reached the edge of the Solar System.....1977 లో పంపిన ఈ వాయేజర్ సూర్యునికి దగ్గరగా ఉన్నది. సూర్యుని చుట్టూ ఏమి జరుగుతున్నదో క్షుణ్ణంగా తెలియపరుస్తుంది. దీని వలన సూర్య మండలం వలన భూమికి జరగబోయే వాటి గురించి ముందే తెలుసుకోవచ్చు.

టెలిపోర్టేషన్
టెలిపోర్టేషన్....మే 2012 లో శాస్త్రవేత్తలు ఫొటాన్స్ ను విజయవంతముగా పంపించగలిగేరు. ఇదే పద్దతిలో మనుష్యుల లోని శక్తిని శరీరం నుండి బయటకు పంపి పనులు చేయవచ్చును. ఇది విజయవంతమైతే మానవ ఆరొగ్య, వైద్య రీతులలో అత్యంత ముందడుగువేయవచ్చు.

No comments:

Post a Comment