Monday, January 7, 2013

మానవశరీరం నుండి తయారుచేయబడుతున్న క్షోభపెట్టే కొన్ని ఉత్పాదికాలు....ఫోటోలు

మానవ శరీరం ఒక అద్భుతం, అనుగ్రహం మరియూ ముడిపదార్ధం.అవయవ మరియూ కణజాల మార్పిడి సాంప్రదాయకంగా మారిందనేది ఒక పక్కగా పెడితే, మానవ ముడిపదార్ధాలు కూడా మనకు ఊహకందని కొన్నీ వస్తువులలో ఉపయోగిస్తున్నారు. ఫైట్ క్లబ్ వారు చెప్పినట్లు మనం కూడా ప్రాణులమే. నిజమే?. పరిశోధకులు మనం విసర్జించు పధార్ధాలోతో కూడా ఉపయోగమున్నదని చెబుతున్నారు. ఈ క్రింది వస్తువులు చూస్తే మీకే అర్ధమౌతుంది.

Hair Sunglasses
రెసిన్ మరియూ మనిషి జుట్టుతో డిజైనర్లు ఆలెక్ష్ అండ్ ఆజుక అనే ఇరువరు ఈ అందమైన కళ్లజోళ్ళను తయారుచేస్తున్నారు. ఈ కళ్ళ్జోడు పెట్టుకుంటే చెవి వెనుక వెంట్రుకలూ, కంటిపైన ఉన్న కనుబొమ్మల జుట్టుతో ఈ కళ్ళద్దాలు కలిసిపోయి మనిషి మొహానికి కొత్త అందం తెస్తుందట. వీటిని గ్రీన్ స్టాండర్డ్ రీతిలో తయారుచేసేరట.

Tooth Knuckles
దంతాలు. వీటిని సహజంగా మనం చూసే ఉంటాము. బంగారు ఆభరణాలలో జంతువల యొక్క దంతాలను పొదిగించుకుని వేసుకున్న వారు చాలామందే ఉన్నారు. మనం గట్టిగా కొరికి తినలేక పోయినట్లైతే దానికోసం మనం మానవ దంతాలనే పెట్టుకోవచ్చు. అలాంటి మానవ దంతాలతో(knuckle dusters made from human molars)కూడిన పల్ల సెట్టును Polly van der Glas అనే అతను రూపొందించేడు. ఇష్టపడి ఇచ్చే వ్యక్తి యొక్క కొరుకుడు దంతాలను వెండి రేకులతో అమర్చి పెట్టుకునేటట్లు అమర్చేరు. అయితే ఈ దంతాలను బయటకు తీసి బ్రష్ చేసేసుకోవాలా అనేది మాత్రం చెప్పలేదు.

Blood sculpture
మీకు ఎప్పుడైనా ఐస్ క్రీం తో మీ తలను రూపొందించుకోవాలని ఆశపుట్టిందా.అలా మీరు ఆశపడుంటే మీరు Marc Quinn తో స్నేహం చేయాలి. ఈ కళాకారుడు 5 సంవత్సరాలకు ఒకసారి 5 నెలల వ్యవధిలో ఒక పాత్రలో తన శరీరం నుండి 9 పింట్ల రక్తం(శరీరంలో తిరుగుతున్న మొత్త రక్తం కొలత)ను సేకరించి ఉంచి, దానితో తన తల రూపం తయారుచేస్తాడు.లండన్లో ఉన్న ఒక నేషనల్ గాలరీ 2006 లో అతను తన సొంత రక్తంతో తయరుచేసిన తలను కొన్ని బిల్లియన్ల రూపాయలకు కొనుకున్నారు. ఎవరైనా ఇష్టపడితే వారికి ఇలాగే వారి సొంత రక్తంతో వారి తలను రూపొందించి ఇస్తారట. దీనికోసం ఆయన ఎంతో డబ్బు తీసుకుంటారో ఆయన్నే అడగాలి.

Human leather
అన్నీ ఉన్న వారికి మీరు ఏమిస్తారు?...మానవ చర్మం! ఇంగ్లాండ్లోని ఒక కంపెనీ దానంగా ఇవ్వబడిన మానవ శరీర చర్మం తో మనీ పర్స్, బెల్ట్ మరియూ షూ లు తయారుచేస్తున్నారట. "మానవ చర్మం ఎంతో మ్రుదువైనదీ మరియూ బలమైనది. జంతువుల చర్మంలాగా ఎటువంటి పారిశ్రామక మరమత్తులకూ వెళ్ళకర్లేదు" అని ఆ కంపెనీ చెబుతోంది. వీతిని కొన్న వారి పేర్లూ కూడా బైట పెట్టరు. అంతా రహస్యంగా జరుపుతారు.

Fat fuel
న్యూజీలాండ్ కు చెందిన పర్యావరణ స్నేహ పూర్వ ఎర్త్ బోట్ ప్రయాణంచేసింది. ఈ బోటు బయొ డీజల్తో నడుస్తుంది. కార్బన్ డ యాక్సైడ్ ను తయారుచేయలేని ఈ బయో డిజ్జల్లో మానవ కొవ్వు కూడా ఉందట. మొదట ఈ బోటు యజమానులు తమ శరీరంలో ఉన్న అవసరంలేని కొవ్వును శస్త్రచికిత్స మూలంగా తీసి ఉపయోగించేరట. తరువాత అవసరంలేని లేక ఎక్కువగా ఉన్న కొవ్వునూ లిపొసక్చన్ మూలంగా తీసేసుకున్న వారి కొవ్వును ఉపయోగించి బయోడీజల్ ను తాయారుచేస్తున్నారట.

Mummy paint
గోడలకు కొడుతున్న రంగులు(పెయింట్లు)హానికరమైనవి అని తెలుసుకోక ముందు మమ్మీ బ్రౌన్ అనే రంగు పెయింటు ను వాడుతూ వచ్చేరట. ఈ పెయింటును ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకునేవారు కాదట. మమ్మీగా చేయబడ్డ శరీరాలలో నుండి తీసిన ఒక ద్రవ్యంతో ఈ పెయింటును తయారుచేసేవారు. 20 వ శతాబ్ధం వరకూ ఈ పెయింట్లు అమ్మకాలలో ఉండేవిట. ఆ తరువాతా మమ్మీ శరీరాలు దొరకక అమ్మకాలు మానేసేరని చుబుతున్నారు.

People gelatin
జన్యుశాస్త్రం చాలా మర్మమైనది. దీనిని ఇప్పుడు కొన్ని చోట్ల(దేశాలలో)స్వచ్ఛమైన మనసుతో వాడటంలేదనే చెప్పాలి. జెలటిన్ ఎక్కువగా వాడబడుతున్నది. కానీ జంతువుల(ఆవులూ, పందులు) నుండి ఉత్పత్తిచేసిన జెలెటిన్ వాడేవారు.కొన్ని ఆహార పధార్ధాలలో కూడా దీనిని వాడే వారు. ఇప్పుడు మనుష్యుల DNA తో జంతువుల ఈస్ట్ ను కలిపి జెలటిన్ తయారుచేస్తున్నారట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నయ్యో మనకెలా తెలుస్తుంది?

Fertility Drugs
లఘుశంక ఫార్మాస్యూటికల్ మండలంలో ఆదరణ పొందింది. ఇందులో నుండి తీయబడే యూరియా కొన్ని మందులలో వాడుతున్నారు. పైన చూపబడిన పుత్ర సౌభాగ్యం కొరకు తయారుచేయబడే మందు పూర్తిగా రుతువిరతి కలిగిన స్త్రీల లఘుశంక నుండి తీయబడిన యూరియా మరియూ కొన్ని హార్మోన్ల తో తయారుచేయబడినదేనట.

Masato
ఇంకొకరు తాగుతున్న పానీయంలో ఉమ్మేయటం సభ్యత కాదు. కానీ అమెజాన్లోని పెరూ లో అక్కడికి వచ్చే అతిధులకు ఉమ్మి వేసిన పానీయం "Masato" ఇసారట. ఆ ప్రదేశంలో దొరికే ఒక దుంప యొక్క తొక్కును అక్కడి స్త్రీలు నములుతూ ఉంటారు. అలా నములుతున్నప్పుడు నోటిలో ఏర్పడే ఉమ్మి నీటిని ఒక పాత్రలో ఉమ్మి దాస్తారట. అలా ఉమ్మేసిన ఉమ్మినీరు సలైవా తో కలిసినందువలన పులియటం చెందుతుంది. కొన్ని గంటల తరువాత అది ఒక తీపి మరియూ చేదు రుచులు కలిగిన పానీయంగా తయారౌతుంది. ఆ పానీయాన్ని కొద్ది రోజులు పులియపెడితే అది మత్తి పానీయంగా మారుతుందట. ఏది ఏమైన అందులో ఉమ్మి ఉంది కదా?

Stool Transplant
Clostridium difficile (or C. diff) అనే వ్యాధితో బాధ పడుతున్నవారికి ఆంటీ బయాటిక్స్ పనిచేయనప్పుడు ఇంకొకరి మలము వారిని రక్షించుటకు ఉపయోగపడుతుందట. మలము దానం చేసేవారి మలము ను పరీక్చించి దానిలో సలైన్ కలిపి రోగులకు ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు. ఇప్పుడు ఈ వ్యాధి యువకులలో ఎక్కువగా కనిపించడంతో కొంతమంది శాస్త్రవేత్తలు మలము బ్యాంకులు పెట్టాలని సలహా ఇస్తున్నారట.

No comments:

Post a Comment