Sunday, January 6, 2013

సిడ్నీ హార్బర్ లో బ్రహ్మాండమైన రబ్బర్ బాతు....ఫోటోలు

ఆస్త్రేలియాలోని సిడ్నీ హార్బర్ సంబారాలు సందర్భం గా ఈ బ్రహ్మాండమైన రబ్బర్ బాతును తెప్పించేరు. వేసవికాలంలో(కొంచం వేసవికే) అక్కడి ప్రజలు బయటకు రావడానికే బద్దకిస్తారట. వారిలోని బద్దకాన్ని పోగొట్టటానికి 1977 లో ఈ ఫెస్టివల్ మొదలు పెట్టేరు. వేసవికాలంలో పనిచేసి అలసిపోయినవారు ఈ సిడ్నీ హర్ర్బర్ లోని నీటిలో ఈతకొట్టి సేద తీర్చుకోమని చెప్పేవిధముగా ఈ సంబరాలు ఏర్పరిచేరు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వేసివికాలం వచ్చేముందు ఈ సంబరాలు జరుపుతారు. ఈ సంవత్సరం ఆ సంబరాలలో భాగంగా ఈ బ్రహ్మాండమైన రబ్బర్ బాతును ప్రవేశపెట్టేరు. "మనమంతా ఒక గ్రహంలో నివసిస్తున్నాము. మనమందరమూ ఒకే కుటుంబం. ప్రపంచనీరు మనందరికీ సొంతం. కాబట్టే నేను ఇక్కడున్నాను" అనే భావం కలిగించే ప్రయత్నంతో డచ్చ్ కళాకారుడు Florentijn Hofman తయారుచేసిన ఈ బ్రహ్మాండమైన రబ్బర్ బాతు ఈ సంబరాలలో అతిపెద్ద ప్రజా ఆకర్షణీయాయగా ఉంచేరు.


No comments:

Post a Comment