Monday, January 21, 2013

మరణించినవారిని గౌరవించే పండుగలు...ఫోటోలు

ఒక మర్యాదగా కానివ్వండి లేక దయ్యమై ప్రతీకారం తీర్చుకుంటారేమోననే భయంతో కానివ్వండి ప్రతి నాగరికతలోనూ మరణించినవారిని గౌరవించాలనే అనే నమ్మకం ఉన్నది. కొన్ని నాగరికతలలో మరణించినవారిని గుర్తుంచుకొనుటకు ప్రత్యేకంగా సెలవు రోజులు కేటాయించేరు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరణించినవారికోసం చేసుకునే పండుగలూ లేక సెలవు రోజుల గురించి తెలుసుకుందాము.

All Souls’ Day and All Saints’ Day
క్యాతలిక్ చర్చ్ మతస్తులు ఈ All Souls’ Day and All Saints’ Day రోజును మొదట్లో తమ ఆలయాలలోనే జరుపుకునే వారు. నవంబర్ నెల 1 లేక 2 వ తారీఖులలో జరుపుకునేవారు. ఇప్పుడు కొన్ని దేశాలు ఈ రోజులను జాతీయ సెలవు దినాలుగా ప్రకటించేరు. మొదట్లో ఈ All Saints’ Day ను మత గురువులూ మరియూ మత వీరుల జ్ఞాపకార్ధం జరుపుకుని ఆ మరుసటిరోజును All Souls’ Day గా పితృలోక జీవాత్మల రోజుగా ఉంచుకుని ఆ రోజు ప్రాయశ్చిత్త దినముగా జరుపుకుంటే స్వర్గానికి వెళ్లవచ్చునని నమ్ముతారు.

Bon Festival
జపాన్ దేశములో గత 500 సంవత్సరాలుగా తమ పూర్వీకుల జ్ఞాపకార్ధం ఈ వేడుకను జరుపుకుంటారు. బౌద్దమత సంబంధమైన ఈ వేడుకను 3 రోజులు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ నెల 15 వ తారీఖున మొదలై 18 వరకు జరుపుకుంటారు. ఈ వేడుకలలో ముఖ్యమైనది బాన్ ఓడోరి అనే నృత్యం.ఈ నృత్యం చేస్తే వారివారి పూర్వీకుల ఆత్మలు దిగివచ్చి వారితోపాటు వేడుకలో పాల్గొంటాయనేది వారి నమ్మకం. .... ఒక బౌద్ద మతస్తుడు ధ్యానం చేస్తున్నప్పుడు తన తల్లి ఆత్మ ఆకలిగొన్న కొన్ని దయ్యాల మధ్య ఇరుకున్ని కష్టపడుతోందని తెలుసుకొని, ఎలాగైన తన తల్లి ఆత్మను కాపాడమని గౌతమ బుద్దుదిని కోరుకొనగా, ఆయన మత గురువులకోస శ్రద్ధాంజలి జరుపుకోమని చెప్పేరట. ఆయన చెప్పినట్టే చేసిన అతనికి తన తల్లి ని దయ్యాలు వదిలేసినట్లు కనబడటంతో ఆనందంతో నృత్యం చేసేడట. ఆ నృత్యమే బాన్ ఓడోరి అనే నృత్యంగా ప్రసిద్దిచెందింది.

Chuseok
సౌత్ కొరియాలో జరుపుకునే ఈ పండుగకు ఈ దేశంలో 3 రోజులు సెలవు. తమ పూర్వీకులకు ఇది అంతా మీ పుణ్యామే, ఇది అంతా మీ దయే, ఇది అంతా మీ కటాక్షమే అని దండాలు పెట్టుకుంటారు. మొదటి రోజు "Songpyeon" అనే భోజనం తయారుచేసి మొత్త భోజనాన్ని పూర్వీకులకు సమర్పిస్తారు. వారు తినరు. మిగిలిన రెండు రోజులూ తమ పూర్వీకుల సమాధులకు వెళ్ళి ప్రాధనలూ చేస్తూ నృత్యాలుచేస్తారు.

Gaijatra
నేపాల్ దేశంలో ఆగస్ట్ మరియూ సెప్టంబర్ నెలలలో ఈ పండుగను 8 రోజులు జరుపుకుంటారు. ఆవులు తమ ఆత్మీయుల ఆత్మలను స్వర్గానికి తీసుకువెడతాయని వారు నమ్ముతారు. అందుకని ఆ సంవత్సరం వారి కుటుంబాలలో చనిపోయిన వారికోసం ఆవులను ఊరేగింపుగా ఆ ఇంటి పెద్ద తీసుకువెడతాడు. ఆవులు దొరకని వారు వారి ఇళ్లలోని పిల్లలను ఆవులాగా అలంకరించి తీసుకువెడతారు. మరణం ప్రక్రుతిగా వచ్చేదేనని చెప్పే విధముగా పాటలు పాడుతారు. దీనివలన మనుష్యులలో మరణ భయం పోతుందని వారి నమ్మకం.

Qingming Festival
చైనీయులు ఏప్రెల్ నెల మధ్యలో జరుపుకునే ఈ పండుగ నాడు వారు తమ పూర్వీకుల సమాధుల దగ్గరకు వెళ్ళి సమాధులను పరిశుద్ధం చేస్తారు. సమాధులకు టీ, భోజనమూ మరియూ వెదురుతో చేసిన పేపరును ప్రసాదముగా ఉంచుతారు. ఈ మూడూ ఆత్మలకు శాంతినిస్తుందని వారు నమ్ముతారు.

Pitru Paksha (Fortnight of the Ancestors)
హిందూ సాంప్రదాయం ప్రకారం ఆశ్వయుజమాసములో 15 రోజులు జరుపుకుంటారు. తమ పిత్రుదేవతలకు ప్రార్థన చేస్తూ భోజనమును ప్రసాదముగా పెడతారు. హిందూ పురాణముల ప్రకారం కర్ణుని ఆత్మ స్వర్గం జేరుకున్నప్పుడు అక్కడ తినడానికి బంగారం తప్ప ఏమీ లేదట. ఆకలితో అవస్తపడుతున్న కర్ణుడు ఇంద్రుడిని కలిసి వంటగది ఎక్కడా అని అడుగగా తాను బంగారమే తింటానని, తన పూర్వీకులకు కూడా తాను బంగారాన్నే ఆహారంగా పెట్టేనని చెప్పేడుట.వారిరువరి మధ్య కొంతసేపు జరిగిన వివాదము తరువాత ఇంద్రుడు పరిహారముగా కర్ణుడిని 15 రోజులు భూమికి పంపించేడట. కర్ణుడు ఆ 15 రోజులూ తన పూర్వీకులకు భోజనమూ మరియూ మంచినీరు ఇచ్చేడట.

El Día de los Muerto (Day of the Dead)
మెక్సికో దేశంలో జరుపుకునే పండుగ. ఇది ఆ దేశంలో అతి ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు. నవంబర్ నేల 1 మరియూ 2 తారీఖులలో జరుపుకునే ఈ పండుగను ఆ దేశ ప్రజలందరూ జరుపుకుంటారూ. ప్రతి చోటునీ బొమికలతో అలంకరిస్తారు. తమ పూర్వీకులకు ప్రార్థనలు చేస్తారు.

Lemuralia
ఇది మిగిలిన దేశాలలో చేసుకున్నట్లు పూర్వీకుల ఆత్మశాంతికోసం చేసేది కాదు. ఇది రోము నగరంలో పూర్వీకుల అత్మలను తమ ఇళ్ళల్లో నుంది తరమడానికి, ఇంటిని పరిశుద్దపరుచుకోవడానికీ చేసుకుంటారు. ఆ ఇంటి పెద్ద మధ్య రాత్రి లేచి, 3 సార్లు చేతులు కడుగుకొని, కాళ్ళకు చెప్పులు లేకుండా తన భుజాలపై నుండి నల్ల నువ్వులను 9 సార్లు ఇళ్ళంతా జల్లుతూ "నన్నూ, నా వారినీ ఈ నల్ల నువ్వులతో ఆత్మల దగ్గరనుండి విడిపిస్తున్నాను" అని చెబుతాడు.

The Hungry Ghost Festival
ఇది చైనాదేశంలో జరుపుకునే పండుగ. ఒక నెల మొత్తం జరుపుకుంటారు. ఆ నెలను ఆత్మల నెలగా చెబుతారు. ఆ నెలలో ఖచ్చితముగా ఒక రోజు వారి పూర్వీకులు వారి ఇంటికి వచ్చి భోజనం చేస్తారని వారు నమ్ముతారు. అందువలన ఏ రోజు వస్తారో తెలియదు కనుక అ నెల మొత్తం వారు భొజనాలు చేసేటప్పుడు అధికముగా ఒక పల్లెం లో ఆహారమును ఉంచి పెడతారు. అలాగే రోజూ రాత్రిపూట వెదురు పేపరుతో చేసిన ఆకులలో చిన్న కొవ్వొత్తులు వెలిగించి చెరువులలో వదులుతారు.

Famadihana (Turning of the Bones)
మడగాస్కర్ దేశంలో జరుపుకునే పండుగ. దీనికని ప్రత్యేకంగా ఏ రోజునూ వారు కేటాయించలేదు. చలికాలంలో సమాధుల దగ్గరకు వెళ్ళి సమాధులలో ఉన్న వారి పూర్వీకుల శవాలను వెలికి తీసి, వాటిని శుభ్రపరిచి మళ్ళీ సమాధులలో ఉంచుతారు. ఇక్కడి వారి నమ్మకమేమిటంటే శవాలు పూర్తిగా మట్టిలో కలిసిపోతేనే మరణించినవారు స్వర్గానికి జేరుకోగలరని, అంతవరకు వారి ఆత్మలు అక్కడే ఉంటాయని వారి నమ్మకం.

No comments:

Post a Comment