Monday, January 14, 2013

ఏడుపు పెళ్ళి....చైనాలోని ఒక జాతి ప్రజలలో ఇది ఒక సాంప్రదాయం....ఫోటోలు

పెళ్ళి అంటేనే ఒక ఆనందమైన సందడి. అందులోనూ ఆ పెళ్ళికి సంబంధించినవారిలో అదొక ఆనందమైన అనుభూతిని కలిగిస్తుంది. అప్పగింతల సమయములో పెళ్ళికూతురు తరపు వారు ఏడవటం మనలో చాలామంది చూసే ఉంటాము.కానీ చైనాలో 17 వ శతాబ్ధములో ఈ ఏడుపును ఒక సాంప్రదాయంగా తీసుకున్నారు ఒక జాతికి చెందిన వారు. ఇప్పటికీ ఆ జాతి ప్రజలలో కొంతమంది పెళ్ళిలో ఏడవటం ను సాంప్రదాయంగా పెట్టుకుంటున్నారట. అంటే పెళ్ళిలో పెళ్ళికివచ్చినవారు అందరూ తమకు ఏడుపు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఏడవాల్సిందేనట.


No comments:

Post a Comment