Wednesday, January 9, 2013

ఆశ్చర్యపరిచే విచిత్రమైన దొంగతనాలు....ఫోటోలు

దొంగతనం అనేది నేరమే. దీనిని నేను క్షమించటంలేదు. ఇక్కడ మీకు చెబుతున్న దొంగతనాలు మనం నమ్మలేనివి. కానీ నిజంగా జరిగినవి.

Two Mini Trains
మినీ రైళ్ళు అంటే తక్కువగా చెప్పటమే. ఎందుకంటే ఈ రెండు రైళ్ళ బరువు ఒక టన్నుకు పైగా ఉంటుందట. ఈ దొంగతనం ఎందుకు విచిత్రంగా కనబడుతోందంటే ఈ దొంగతనం చేయడానికి ఎలాంటి కారణమూ కనబడుటలేదు. రైళ్ళను ఎలా దొంగతనం చేసుంటారు. ఎత్తుకుపోవటానికి వీలులేదు. రైలు పట్టాల మీదనుండే తీసుకు వెల్లుండాలి. కానీ ఎంత వెదికినా కనబడలేదు.

Whole ATMs ATM మిషెన్లలో నుండి డబ్బు దొంగలించవచ్చునేమోగానీ, ఏకంగా ATM మిషెన్నే దొంగలించడం కష్టం. ఎందుకంటే ATM మిషెన్లను నేల క్రింద మరియూ కొన్ని చోట్ల గోడలకూ కాంక్రీట్ ఊచలతో అమర్చుతారట. కాబట్టి ATM మిషెన్లను దొంగలించడం చాలా కష్టం. కానీ ఈ వీడియోలో దొంగలు ఉపయోగించిన టెక్నిక్ అందరినీ ఆశ్చర్య పరిచింది.

A NASA Rocket Engine
నాసా ఏప్పుడూ తాము తయారుచేసేవాటిని అతి రహస్యంగా ఉంచుతారు. ఎందుకంటే అవి మిగిలిన దేశాలకు తెలియకూడదు. టెక్నాలజీలో ఎప్పుడూ ముందుడాలి అనే తాపత్రయం. కానీ వారందరూ ఆశ్చర్యపడేవిధంగా వారు తయారుచేసీన Saturn RL-10 రాకెట్ ఇంజెన్ ఈ-బే వెబ్ సైట్లో అమ్మకానికి ఉంచేరు ఎవరో. అప్పుడుగాని తెలియలేదు అది దొంగలించబడిందని. అంతకంటే వారిని ఆశ్చర్య పరిచింది ఏమిటంటే ఏంతో రహస్యమైన ప్రదేశంలో దాచిపెట్టబడిన ఆ రాకెట్ ఎలా దొంగలించబడింది అనే విషయమే.

A Glacier
మంచు దిబ్బలు కరిగిపోతున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక కొండ పొలిమేర గుర్తుగా ఉండే మంచుదిబ్బ (సుమారు 5 టన్నుల బరువుకలిగినది) ను ఒక దొంగ తీసుకునిపోతూండగా పట్టుబడ్డాడు. అది ఎక్కడదని అడిగితెలుసుకున్న తరువాత ఆశ్చర్యపోయేరు. ఎక్కడికి తీసుకువెడుతున్నాడో తెలుసుకున్న తరువాత మరింత ఆశ్చర్యపోయేరు. ఆ మంచు దిబ్బను పరిశుభ్రమైన, తాజా ఐసుగా బార్లకు అమ్మడానకని చెప్పడు.

Guard Dogs
దొంగతనాలను అరికట్టాలనే కాపలా కుక్కలను పెంచుకుంటారు. కానీ ఈ కాపలా కుక్కలనే దొంగతనం చేసే ఒక దొంగల ముఠాను పట్టుకున్నారు. పట్టుకున్నవారు చెప్పిన విషయం విని అధికారులు ఆశ్చర్యపోయేరు. మొదటి విషయం, వాటిని దొంగలిస్తే, అవి కాపలా కాస్తున్న చోట ఈజీగా దొంగతనంచేయవచ్చు. రెండవ విషయం, కాపలా కుక్కలను ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి మంచి గిరాకీ ఉంది.

A Full-Size Train
పైన మనం చిన్న రైళ్ళను దొంగతనం చేసేరని తెలుసుకున్నాము. కానీ యూక్రైన్లో మొత్త రైలునే దొంగతనం చేసేరట. నకిలీ డాక్యూమెంట్లతో రైలు యార్డులోకి వెళ్ళి, రైలును నడుపుకుంటూ తీసుకువెళ్ళి దొంగతనంచేసేరు. ఆ నెంబర్ రైలు కనబడకపోతే రైల్వే అధికారులు ఆశ్చర్యపోయేరు. నకిలీ డాక్యూమెంట్లతో వచ్చినవారే దొంగతనం చేసుంటారని ధ్రూవీకరించిన అధికారులకు ఆ రైలును ఎలాంటి యంత్రాలు ఉపయొగించి తీసుకు వెళ్ళుంటారో ఊహించుకుని మరింత ఆశ్చర్యపొయేరు.

A House
మలేసియాలో జరిగిన ఈ సంఘటన ఇంకా రెకార్డులలో చ్చెధించలేని కేసుగానే ఉన్నది. నెలనెలా అద్దె వసూళ్ళూ చేసుకోవడిని వెళ్లే ఆయనకు ఒక సారి అక్కడ తన ఇళ్లే కనబడలేదు. వెంటనే పోలీసు రిపోర్ట్ ఇచ్చేడు. ఇది ఎంతో తమాషాగా ఉన్నదనిపించినా పోలీసులు దొంగలించబడ్డ ఇళ్ళు అనే కేసు నమోదు చేసేరు.(పై ఫోటో నిజమైన ఇళ్ళు కాదు. ఇలా చేయబడి ఉంటుందని కార్టూన్ గీయబడింది).

Thousands Of Litres Of Fuel
ఈ దొంగతనం గురించి చదువుతున్నప్పుడు దొంగలు పెట్రోల్ లారీని దొంగలించుకుని పోయుంటారని మీరు ఊహించుకోనుంటారు. అలా కాదు. దొంగలు పెట్రోల్ ఫిల్లింగ్ స్టెషన్లోకి తమ సొంత పెట్రోల్ ట్యాంక్ ట్రక్కును తీసుకువచ్చి, నిదానంగా ట్రక్కును పెట్రోల్తో నింపుకుని వెళ్ళిపోయేరు. ట్రక్కు నెంబరును తరువాత చెక్ చేసుకున్న అధికారి అది తమ కాంట్రాక్ట్ లోని ట్రక్కే కాదని తెలుసుకున్నాడు. అప్పటికే దొంగలు ఎంతో దూరం వెళ్ళిపోయేరు.

A Bridge
రష్యాలోని కబరోవస్క్ అనే చోట 200 టన్నుల బరువుగల అందమైన వంతెన ఉండేది. రాత్రికిరాత్రి అది కనబడలేదు. దొంగతనం చేయబడింది అని తెలుసుకున్నారు. వంతెనలు దొంగలించబడటం ఇది మొదటి సారి కాదట. రష్యాలో ఇది ఎక్కువగా జరిగే దొంగతనమట. రోజురోజుకూ ఈ వంతెన దొంగతనాలు ఎక్కువౌతున్నాయట. దొంగలేవరో తెలుసుకోవడం కష్టమట. కారణం అయస్కాంతవిద్యుచ్ఛక్తులుగల యంత్రములు ఉపయోగించినందువలన తెలుసుకోవటం కష్టం.

Corn
ఇది బ్రిజిల్లో జరిగిన దొంగతనం. రైలులో తీసుకువెడుతున్న 50 టన్నుల మొక్కజొన్నకండెలను దొంగతనం చేసేరు. రైలు పట్టాలకు గ్రీసు రాసి రైలు వేగమును తగ్గించి మొత్తమున్న 50 టన్నుల మొక్కజొన్నకండెలను దొంగతనం చేసేరట. రైలు చేరవలసినచోటుకు చేరిన తరువాతగానీ ఈ దొంగతనం గురించి తెలియలేదట. ఎంత ప్రయత్నించినా ఎవరు చేసేరో తెలుసుకోలేకపోయేరట.

No comments:

Post a Comment