Tuesday, January 1, 2013

చమురే జీవితము అనేట్లు చెబుతున్న రోజూ వాడే వస్తువులు ....ఫోటోలు

2011 లో ముడి చమురు మరియూ నాచురల్ గ్యాస్ ఉత్పత్తి రోజుకు 83.6 మిల్లియన్ బ్యారల్స్ కు చేరుకుంది. ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్ది దీని ఉత్పత్తి కూడా పెరుగుతోంది. పెట్రోలియం అధికముగా వాడబడుతున్న ద్రవ్యము కాబట్టి దాని ఖరీదు నిలకడలేనిదిగా ఉంటూ అందరినీ బాధిస్తోంది. ఏంతగా బాధిస్తోందనేది మనం ఊహించలేము. చమురుతో తయారుచేయబడే కొన్ని సాధారణ వస్తువులు.

Cosmetics
దీనిలో కలిపేదినిసులలో 80 శాతం పెట్రోలియం ద్రవ్యము తో తయారుచేయబడినవే. దీనికే మనం ఎక్కువ డబ్బులు ఇస్తున్నాము. షాంపూలూ,కండిషనర్లూ మరియూ హైర్ డైలూ కూడా పెట్రోలియం ద్రవ్యముతో చేయబడినవే.

Synthetic Rubber
సింతటిక్ రబ్బర్ వేడిని తట్టుకునే శక్తి కలిగినది కనుక లేటక్స్(latex) కు బదులు దీనినే వాడుతున్నారు. టయర్లూ, ఆటవస్తువులూ, షూలూ వీటితోనే తయారౌతున్నాయి. ఒక టయరు తయారుచేయడానికి 8 గాలన్ల చమురు అవసరమట. సాధారణంగా మనం వాడుతున్న వైర్లూ మరియూ ఇన్సులేషన్ టేపుల తయారులో కూడా చమురు వాడుతున్నారట.

Lubricants
ఇది ఒక పెట్రోలియం బై ప్రాడక్టే నని అందరికీ తెలిసినదే.

Medicines
ఈ రోజు మనం వాడుతున్న మందులు బెంజేన్(benzene)లో నుండి ఉద్భవించినవే. బెంజేన్ పెట్రోలియం నుండి ఉద్భవించినదే. మనం ఎక్కువగా మందుల షాపులనుండి మందు చీటీ లేకుండా నొప్పులకు కొనుక్కునే మందులు, ఉదాహరణకు ఆస్ప్రిన్ (aspirin) పెట్రోకెమికల్ తో తయారుచేయబడినదే. హోమియోపతి మందులలో కూడా చాలా మందులు పెట్రోలియం ప్రాడక్టులతోనే తయారవుతున్నాయట.

Cleaning Products
వీటిలో ఏమేమి కలుపుతున్నారో తెలుసుకుందామని వాటి కాంపోజిషన్ చదవటానికి ప్రయత్నిస్తే మనం ఇంతకు ముందు విని వుండని పేర్లూ లేక మనం చదవడానికే కష్టపడే పేర్లో కనబడతాయి. ఈ కలయుకలో సహజంగా అత్యంత హానికరమైన సింతటిక్ కెమికల్ ఉంటుంది. అందుకనే వాటిపై విషపూరితం అనే హెచ్చరిక ఉంటుంది.ఇవన్నీ కూడా పెట్రోకెమికల్ ప్రాడక్టులనుండే తయారుచేయబడుతున్నవి.

Asphalt
బిటుమెన్ (bitumen) అనికూడా పిలువబడే ఈ సెమి సాలిడ్ పధార్ధముతో ఈ ప్రపంచములో 11 మిల్లియన్ మైళ్ల రోడ్లు వేయబడి ఉన్నాయి. ఇది చూడటానికి తారు లాగానే ఉంటుంది. అయితే దీనికి ఎక్కువ చమురు అవసరమౌతుంది.

Synthetic Fabrics
పెట్రోలియం ద్రవ్యంతో తయారుచేయబడే గుడ్డలు ఎక్కువ మన్నిక గలిగినవిగా ఉంటాయి కనుక దీని తయారు ఎక్కువగా ఉంటుంది. కాటన్ కంటే చవుక గనుక ఇవి ఎక్కువ ప్రసిద్ది చెందినై. rayon, nylon, spandex, acrylic, and polyester ఇలా ఎన్నో రకాల గుడ్డలు తయారౌతున్నాయి.

Food
సహజమైన ఆహార పధార్ధం కావాలని కోరుకున్నా దానిలో ఎంతోకొంత పెట్రోలియం ప్రాడక్టు కలిసే ఉంటుంది. క్రుతిమంగా తయారుచేయబడే ఎరువులూ మరియూ పంటలకు పురుగు పట్టకుండా ఉండేందుకు వాడే పురుగుల మందులు పెట్రోలియం బై ప్రాడక్టులతో తయారుచేయబడినవే. ఎక్కువగా వాడబడుతున్న food preservatives, flavorings, and colorings కూడా పెట్రోలియం ప్రాడక్టులతోనే తయారౌతోంది. పిల్లలు ఎక్కువగా నమిలే చూయింగ్ గమ్ము (చెవింగ్ గుం)పెట్రోలియం బేస్ బై ప్రాడక్ట్ పోలీమార్ (polymers) ఉన్నాయనేది మింగలేని నిజం.

Plastic
ప్లాస్టిక్ పూర్తిగా పెట్రొకెమికల్ తో తయారుచేయబడినదే. ఇది ప్రతిచోటా ఉన్నదనేది చెప్పనక్కరలేదు. మనం వాడుతున్న ప్రతి వస్తువులో ఎంతో కొంత ప్లాస్టిక్ ఉంటుంది. ఐ పాడ్ దగ్గర నుండి మనం తాగుతున్న పెప్సీ దాకా.

Fuel
ఇది లేనిదే జీవించడం ఇప్పుడు కష్టం అనిపిస్తుంది.

No comments:

Post a Comment