Thursday, January 31, 2013

నిల్వచేసిన తాజాగాలిని కొనుక్కోవడం బీజింగ్ నగరంలో తప్పనిసరైంది...ఫోటోలు

చైనా రాజధాని బీజింగ్ నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యగాలి కలిగిన నగరంగా చెప్పబడుతోంది. అక్కడ నివసిస్తున్న ప్రజలు శ్వాస సంబంధ రోగాలకు గురౌతున్నారు. పీల్చుకుంటున్న గాలి వలన అప్పుడప్పుడు వారికి తలతిరగడం మరియూ తలనొప్పులూ వస్తున్నాయి . ఏమర్జన్సీ గా ఆ నగరంలో నిల్వచేసిన తాజాగాలిని అమ్మకంలో పెట్టేరు. అమ్మకాలు జోరందుకున్నాయి.


నెదర్లాండ్లోని అందమైన రంగురంగుల తులిప్ తోటలు....ఫోటోలు(విమానంలోనుండి తీసినవి)

అందమైన పువ్వులతో అలరించే తులిప్ మొక్కలు తులిప అనే దుంప జాతికి చెందినవి. 1953లో ఈ చెట్లను మొదటిసారిగా నెదర్లాండ్లో నాటేరు. క్రమేపంగా అవి జాతీయ గుర్తుగా మారింది.


ఫోటో క్రెడిట్:Bruxelles5 on Flickr

Wednesday, January 30, 2013

భారతదేశపు రబ్బర్ మనిషిని కలవండి....ఫోటోలు మరియూ వీడియో

27 సంవత్సరాల వయసుకలిగిన విజయశర్మకు "రబ్బర్ మాన్" అనే నిక్ నేం ఉన్నది.


ఈ నెల 28 న 100 అడుగుల ఎత్తుకు లేచిన సముద్రపు అల...ఫోటోలు మరియూ వీడియో

పోర్చుగల్ దేశంలోని నజేరే నగర సంద్రతీరంలో గుండెలు ఝల్లుమనేటట్లు ఏగిసిపడుతున్న అతిపెద్ద సముద్రపు అలను ఊపిరిబిగపెట్టుకుని దాటుతూ, ఆ అలను తన కెమెరాలో భంధించి ఎంతో సాహసం చేసేడు సర్ఫర్ Garrett McNamara. సర్వేలప్రకారం ఇంతకుముందు 99 అడుగుల ఎత్తుకులేచిన సముద్రపు అల కంటే జనవరి 28,2013 లో లేచిన ఈ అల ఒక ఆడుగు పెద్దది కనుక ఇదే ప్రస్తుతం ప్రపంచంలేనే అతి పెద్ద అల అని చెబుతున్నారు.పై వీడియో పనిచేయకపోతే ఈ క్రింది వీడియో చూడండి

క్రెడిట్:http://www.dailymail.co.uk

ఇది ఆకులగల చెట్టుకొమ్మ కాదు...ఇది అలా కనబడే ఒక రకం చేప!....ఫోటోలు

లీఫీ సీ డ్రాగన్(The leafy seadragon) అనే ఈ సముద్రపు చేప శత్రువులు వచ్చినప్పుడు వాటికి కనబడకుండా ఉండేదుకు ఇలా విరుచుకుని ఆకులున్న చెట్టుకొమ్మ లాగా కనబడుతుందట.


Tuesday, January 29, 2013

ఇరాన్ లోని పురాతన ఐస్ హౌస్ లు...ఫోటోలు

రెఫ్రెజిరేటర్ కనిపెట్టక ముందు ఐస్ గడ్డలు/ముక్కలు అత్యంత అమూల్యమైనవి. ఈ ఐస్ ముక్కలూ/గడ్డలూ దొరకడమే కష్టంగా ఉండేది. అందులోనూ ఎండాకాలంలో ఇంకా కష్టంగా ఉండేది. ఐస్ లో పెట్టి దాచుకోవలసిన ఆహారపధార్ధాల కోసం ఐస్ గడ్డలను ఆర్కెటిక్ సర్కిల్ దగ్గరున్న స్కాండినేవియన్ దేశాల నుండి దిగుమతిచేసుకునేవారు. దిగుమతిచేసుకున్న ఐస్ ను కరిగిపోకుండా కాపాడుకోవడానికి అధికమైన పొట్టును వేసి భూమి క్రింద అతిలోతైన ప్రదేశాలలో దాచుకునేవారు. బహుశ ఇలాంటి ఐస్ హౌస్ లను మనం చూసుండము. కానీ ఇరాన్ దేశంలో ఇంకా ఆ ఇళ్లను పాడుచేయకుండా అలాగే ఉంచేరు.