Tuesday, December 31, 2013

అద్భుతమైన టాక్సీ లు....ఫోటోలు

Prague Design Taxi

Tokyo Taxi Bike

Taxi VW Beetle, Mexico

Buenos Aires, Argentina Taxi

Coco Taxis in Cuba

Nissan NV200 Taxi New York

Muscat Enzo Taxi Oman

Taxis in Catarina, Nicaragua

Tuk-Tuk Taxi, Chiang Mai, Thailand

Venice Boat Taxi

The Swiss delegation with the solar taxi and its inventor, Louis Palmer

Mumbai Taxi India

Shikara, Kashmir

Havana, Cuba

Future Taxi of New York

మనుష్యులు కారు, విగ్రహాలు....ఫోటోలు


పోయిన సంవత్సరం వెలువడిన అద్భుత టెక్నాలజీ వస్తువులు.....ఫోటోలు

Apple iPhone 5s Touch ID: ఫింగర్ ప్రింట్ ఈడ్ కలిగినది. మీరు తప్ప ఇంకెవరూ వాడలేనిది.

Google Chromecast: ఏ టీవీనైనా స్మార్ట్ టీవీ గా మార్చుకునే డ్రైవ్.

Google Glass: కళ్లలోనే కంప్యూటర్ మరియూ అంతర్జాలం.

Pebble smart watch : అద్భుతమైన స్మార్ట్ వాచ్.

Pogoplug Safeplug: అంతర్జాలంలో మీ ఉనికిని తెలియకుండా చేసేందుకు మరియూ మీ డాటాలను దాచుకునేందుకూ. ముఖ్యముగా మీ మీద ఎవరూ గూఢచారం చేయకుండా ఉండేందుకు. అంటే మీ ప్రైవసీ ని కాపాడుతుంది.

అందరికీ 2014 నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
బ్లాగ్ మిత్రులకి, పాటకులకి, అందరికీ నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.అందరికీ ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యఐశ్వర్యాలు కలగాలని ఆ దేవుని కోరుకొంటున్నాను.

భారతదేశానికి 2013 లో అత్యధిక సంపదను చేకూర్చిన వారు....వీడియో


ది ఎక్ సార్ సిస్ట్ (THE EXORCIST) సినిమా గురించిన నిజాలు....ఫోటోలు

1973 లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెట్టింది. భూతోచ్చాటన అమలులో ఉండేదా? దెయ్యాలూ,భూతాలూ మనుష్యులను ఇలాగే పట్టిపీడిస్తాయా? అని నెవ్వరపోయేరు. ఆ రోజుల్లో అడిగిన ఈ ప్రశ్నలకు సినిమా తీసిన వార్నర్ బ్రదర్స్ అప్పుడు ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. పీటర్ బ్లట్టీ రాసిన నవల ఆధారంగా మాత్రమే సినిమా తీయబడింది అని తెలిపేరు. కానీ సినిమా రిలీజైన 40 వ సంవత్సర వేడుకలో భాగంగా వారు కొన్ని నిజాలను తెలిపేరు.

నిజమైన, జరిగిన సంఘటన ఆధారంగానే పీటర్ బ్లట్టీ ఆ నవల రాసేరు. 1949 లో మిస్సోరి నగరములో 14 సంవత్సరాల బాలుడికి పట్టిన దయ్యమును తోలాడానికి మిస్సోరీ నగర్ చర్చ్ మత గురువులు కొన్ని నెలలపాటూ కష్టపడి ఆ బాలుడిని పట్టిపీడించిన దయ్యమును తరిమేరు. ఆ బాలుని పేరు(నిజమైన పేరు తెలియకూడదని)రోలాండ్ డియో అని తెలిపేరు. మత గురువుల పెద్దగా అప్పటి చర్చ్ ఫాదర్ జేస్యూట్ దయ్యమును తరిమే పనిచేపట్టేరు. నవలను రాసేటప్పుడు పీటర్ బ్లట్టీ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఈ నవల ప్రసిద్దిచెందిన తరువాత ఆ నవలను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాము. దయ్యము తన పేరును "పజజూ" అని తెలిపింది. కానీ సినిమాలో ఆ పేరును మేము ఉపయోగించలేదు అని వార్నర్ బ్రదర్స్ తెలిపేరు.

కానీ ఆ బాలుడి నిజమైన పేరు రీగన్ మెక్ నైల్ అని, మతమును, మత పద్దతులను ఇష్టపడక ఆ బాలుడు మతవిరుద్ద కార్యాకలాపలలో ఈడుపడ్డాడని, అతనికి మతం గురించి, మతము, దైవ బక్తి గురించి తెలుపాలనే అతనిలో దయ్యం ప్రవేసించిందని మరో కధనం ఉన్నదని తెలిపేరు.

దయ్యం పట్టిందని చెప్పిన బాలుడుని ఈ ఇంట్లో ఉంచే మత గురువులు దయ్యమును తరిమేరట

దయ్యం పట్టినప్పుడు బాలుడు నివసించిన ఇల్లు

బాలుడికి దయ్యం పట్టిందని, దానిని మత గురువులు తరిమేరని వాషింగ్టన్ పోస్ట్ న్యూస్ పేపర్లో వచ్చిన వార్త తరువాతే పీటర్ బ్లట్టీ నవల ప్రసిద్దికెక్కింది

సైంట్ లూయిస్ లైబ్రరీలో కొన్ని పుస్తకాలలో ఈ బాలుని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. దీని ఆధారంతోనే నవల రాయబడింది. సినిమా తీయబడింది

మిస్సోరి లోని కావ్లరీ శ్మశానంలో బాలుడిలోని దయ్యమును తరమడానికి సాహసించిన మత గురువు ఫాదర్ విల్లియం బౌడన్ యొక్క మార్బల్ విగ్రహం. ఇక్కడే దయ్యం పట్టిందని చెప్పిన బాలుని శవం(అతను పెద్దై చనిపోయిన తరువాత) కూడా పూడ్చబడిందట

పెద్ద అయిన తరువాత బాలుని శవం పూడ్చిపెట్టిన చోటు

సినిమాలోని సీన్లు

Monday, December 30, 2013

నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్న చైనా......ఫోటోలు

స్వాంగువా నది నుండి 1800 చదరపు మీటర్ల ఐస్ ను తీసుకువచ్చి, 10,000 మంది పనివారితో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ఐస్ నగరాన్ని రెడిచేస్తున్నారు చైనావారు.


పువ్వు ఆకారంలో కీటకాలను తినే గొల్లభామ.....ఫోటోలు మరియూ వీడియో

గొల్లభామ అనగా ఒక కీటకం. ఈ కీటకాలు 2400 పైన రకాలు మరియు 430 జాతులు, 15 కుటుంబాలతో ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ మరియు ఉష్ణమండల ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కువ రకాలు మాంటీడై (Mantidae) కుటుంబంలో ఉన్నాయి. దీనిని ఆంగ్లంలో ప్రెయింగ్ "మాంటిస్" అంటారు, ఎందుకంటే ఇవి తన కాళ్ళు ప్రార్థిస్తున్నట్లుగా మడతపెట్టిన భంగిమలో ఉంటుంది, అయితే ఇవి ఇతర జీవులపై దాడి చేసేందుకు సన్నద్ధంగా తన కాళ్ళను ఉంచుకుంటుదనే సూచనగా గ్రామీణ శబ్దవ్యుత్పత్తిలో ఉపయోగిస్తారు. కొన్నిసార్లు గొల్లభామ మరియు మిడుతల విషయంలో కొంచెం తికమక పడతారు. మిడుత ఎగురునప్పుడు తన కాళ్ళను అదిమి తన్నటం ద్వారా అత్యంత వేగంగా ఎగురుతుంది. మిడుతలా కాక గొల్లభామ నిదానంగా ఎగురుతుంది.


విచిత్రమైన ఆంగ్ల నూతన సంవత్సర సాంప్రదాయాలు.....ఫోటోలు

జనవరి-1 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైనా, ప్రపంచములోని ప్రజలందరూ మానసికంగా ఆ రోజుని నూతన సంవత్సర మొదటి రోజుగా భావిస్తూ వేడుకలలో పాల్గొంటారు. మనదేశములో కూడా చాలామంది అలాగే భావించి డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలవరకు మేలుకుని, 12 దాటగానే కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. జనవరి-1 న చాలామంది ఆలయాలకు వెళ్లి నూతన సంవత్సరమలో ఎలాంటి ఒడిదుడుకులూ లేకుండా జీవితం హాయిగా జరిగిపోవాలని ప్రార్ధణలు చేస్తారు.....ఇక జనవరి-1 ని సాంప్రదాయకంగా నూతన సంవత్సరంగా చేసుకునేవారి సంగతి చెప్పక్కర్లేదు. ఎన్నో విధాలుగా సంబరాలు చేసుకుంటారు. కానీ అలా జనవరి-1 నే నూతన సంవత్సరముగా వేడుకలు చేసుకునే వారిలో కూడా వేడుకలు చేసుకునే విధములో విచిత్రమైన సాంప్రదాయలు ఉన్నాయి. అవే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

స్పైన్ దేశం: స్పైన్ దేశములో డిసెంబర్-31 అర్ధరాత్రి 12 దాటగానే అక్కడి ప్రజలు 12 ద్రాక్ష పళ్లు తింటారట. రాబోవు 12 నెలలూ సంతోషం మాత్రమే తీసుకు రావలని వారి కోరిక.

జర్మనీ: సరిగ్గా డిసంబర్-31 అర్ధరాత్రి 12 గంటలైన తరువాత అక్కడి ప్రజలందరూ "డిన్నర్ ఫర్ ఒన్" అనే టీవీ ప్రొగ్రాం తప్పక చూస్తారట. దేశంలో ఎక్కడున్నా అక్కడున్న టీవీ స్క్రీన్లలో ఈ ప్రొగ్రాం వేస్తారట.

నెదర్లాండ్: రెండవ ప్రపంచ యుద్దం తరువాత నెదర్లాండ్లో లక్షల కొలది పేలుడు పధార్ధాలు మిగిలిపోయినైయట. దాని గుర్తుగా పాల డబ్బాలలో కార్బైడ్ మరియూ నీరు కలిపి ఒక చోట ఉంచి, డిసెంబర్-31 అర్ధరాత్రి 12 తరువాత, ఆ డబ్బాలను వేడిచేసి గాలిలోకి(ఆకాశంలోకి) ఎగరవేస్తారట.

ఫిలిపైన్స్: గుండ్రని పధార్ధాలు అర్ధీక బలం తెచ్చిపెడతాయని, గుండ్రంగా ఉండే పండ్లను(12)తింటారు.

తాయ్లాండ్: నీటితో దేముని విగ్రహాలనూ, తల్లితండ్రులనూ, పెద్దలనూ శుభ్రపరిస్తే ఆ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో ఉంటారనే నమ్మకంతో ఒకరి మీద ఒకరు నీరు జిమ్ముకునే సంబరం చేసుకుంటారట.

స్కాట్లాండ్: ఈ దేశములో డిసెంబర్-31 అర్ధరాత్రి 12 దాటగానే కాగడాలతో తలమీద మరియూ శరీరంచుట్టూ నిప్పును తిప్పుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

ఈక్వడార్: ద్రిస్టి బొమ్మలను తగలబెడతారు.

చిలి: ఇక్కడి ప్రజలు శ్మశానాలలో చనిపోయిన తమ సన్నిహితులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారట.

సౌత్ ఆఫ్రికా: ఇక్కడి ప్రజలు పాత వస్తువులను ఇళ్లల్లో నుండి బయట పారేస్తారట. అంటే ఇంటిని శుబ్రం చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.