Wednesday, December 26, 2012

ఎత్తైన భవనం(Skyscraper)నుండి బయటకుతోసుకువస్తున్న రెండు గుర్రాల అద్భుత విగ్రహం....ఫోటోలు

ఇలాంటి వాటిని మనం రోజూ చూడలేము. కానీ చైనాలోని సెంజెహన్(Shenzhen) నగరంలోని హన్షాన్(Hanshan) సిటీ వీధిలో నడిచివెడితే రోజూ ఆశ్చర్యపరిచే ఈ విగ్రహాన్ని ఎత్తైన భవనం నుండి విస్ఫోటించుకొని వచ్చే విధంగా చూడవచ్చు. రెండు సముద్రపు గుర్రాలు దౌడుతీస్తూ బయటకు వస్తున్నట్లు కనబడుతుంది. కంచుతో చేయబడ్డ ఈ విగ్రహం దేనినో బయటకు లాక్కువస్తున్నట్లు ఉంటుంది.చూడటానికి రోమన్ సముద్ర దేవత నెప్ ట్యూన్(Neptune)లాగా కనబడుతుంది.

చైనాలో, అంటే కమ్యూనిస్ట్ దేశంలో ఇలాంటి పురాణ సంబంధమైన విగ్రహమా? అనిపిస్తుంది. ఇది చైనాలోని అతిపెద్ద ఎకనామిక్ ఫ్రీ జోన్ లో(అంటే ఏ దేశం వారైనా ఇక్కడ తమ వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు)అమర్చబడ్డ ఒక కంపెనీ వారి లోగో. ఆ కంపానీ పేరు నెప్ ట్యూనస్(Neptunus).అయితే ఈ కంపనీ ఎవరొ విదేశీయులది కాదు. చైనా ప్రభుత్వం నడుపుతున్న అతిపెద్ద అర్ధీక 512 కంపెనీలలో ఇది ఒకటి. చైనాలో ఇలా రోమన్ పురాణ సంబంధమైన విగ్రహాన్ని అమర్చడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నా, చైనా 21 వ శతాబ్ధములో తమ అర్ధీక పెరుగుదలకు ప్రపంచదేశాలతో వ్యాపార సంబంధాలు పెంచుకోవాలనే సిద్దంతంలొ భాగమే ఇది అని అంటున్నారు.


No comments:

Post a Comment