Thursday, December 27, 2012

ప్రపంచాన్ని కాపాడుతున్న కొన్ని ఆలోచనలు (PART-2)....ఫోటోలు

Human-powered Washing Machine and Dryer....Giradora
కొన్ని దేశాలలో(పెరూ లాంటి దేశాలలో)చక్కటి బట్టలు వేసుకోవడమే చాలా కష్టం.చక్కటి అంటే కొత్త బట్టలు కావు. ఉన్న బట్టలనే ఉతుక్కుని వేసుకోవటం వారికి చాలా కష్టం.దీనికి ముఖ్య కారణం ఈ దేశాలలో కరెంటు వసతి లేదు. కాబట్టి బట్టలను ఉతుక్కుని వేసుకోవలసిందే. దీనికే చాలా టైము పడుతుంది. ఆ దేశాలలో ఆడ,మగా పనిచేస్తేనే ఒక పూటైన కడుపునిండుగా తినగలరు. బట్టలు ఉతకడానికే టైము సరిపోతే ఆ ఇంటి ఆడవారు పనులకు వెళ్ళలేరు. దానితో వారి పేదరికం ఎక్కువౌతోంది. తప్పదు కనుక కొన్ని రోజులు పనులుమానేసి బట్టలు ఉతుక్కొవడానికే కేటాయిస్తారు. అలా బట్టలు ఉతుకుతున్నందువలన అక్కడి ఆడవారికి నడుము నొప్పి, చెతుల నొప్పులూ, గుండె జబ్బులూ, మోకాళ్ళ నొప్పులూ వచ్చి అవస్తలకు గురౌతున్నారట.

గిరోడరా అనే అతను మనిషిచే కదల్చగలిగే మిషెన్ కనిపెట్టేడు. డ్రమ్ము లాంటి దానిమీద కూర్చుని దానికున్న పెడల్ ని తొక్కితే అది వాషింగ్ మిషెన్లా పనిచేస్తుంది. ఎక్కువ సేపు చేస్తే అందులో వేసిన బట్టలు అరిపోతాయి.కూర్చుని చేసుకునే పనివలన అక్కడ ఆడవారికి వస్తున్న రోగాలు కూడా తగ్గుతున్నాయట.

Solar Bottle Bulb
మొట్టమొదట మనిషి నిప్పును ఎందుకు కనుగొన్నాడు. వంటలకోసం కాదట. వెలుతురుకోసమట. ఎందుకంటే రాత్రిళ్ళు మనిషి జైలు ఖైదీలాగా ఉండటం ఇష్టంలేక. వెలుతురు ఉండటం వలన మనిషి మేలుకుని పనిచేసే టైము ఎక్కువ అవుతుంది.

కానీ ఈ రోజుకూ మనీలా లాంటి కరెంటే లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. ఈ కష్టాలు చూడలేక అమీ స్మిత్ మరియూ మరికొందరు ఎం.ఐ.టి విధ్యార్ధులు సోలార్ బాటిల్ బల్బ్ టెక్నాలజీని కనుగొన్నారు. ఈ టెక్నాలజీ చాలా సింపుల్. ఒక ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు మరియూ కొన్ని టీ స్పూన్ల బ్లీచ్. సూర్య రస్మి వెలుతురు నేరుగా ఒక చోటులోనే పడుతుంది. కానీ ఇంటి పై కప్పులలో ఈ బాటిల్లు పెడితే దాని పైన పడిన సూర్య రస్మి వెలుతురు(కాంతి)360 డిగ్రీల కోణం లో విరజిల్లుతుంది.

eRanger Ambulance
ఎన్నో ఆఫ్రికా దేశాలకూ, మరికొన్ని దేశాలకు ఆంబులాన్స్ లను దానంగా ఇస్తున్నారు. కానీ ఇవి అక్కడ ప్రజలకు పెద్దగా ఉపయోగపడటంలేదట. ఎందుకంటే అక్కడ రోడ్లలో ఈ ఆంబులన్స్ వ్యాన్లు త్వరగా వెల్లలేకపోతున్నాయి. కారణం రోడ్లు అతి చిన్నవిగానో లేక, రోడ్ల వసతి సరిగ్గాలేకనో. దీనివలన అక్కడ ప్రజలకు ఎమర్జెన్సీ మెడికల్ వైద్యం త్వరగా దొరకడంలేక భాధపడుతున్నారు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు.

ఇది గమనించిన బ్రిటీష్ ఇంజనీర్ మైక నోర్మాన్ పై ఫోటోలో చూస్తున్న 4కు 4 ఈ-రేంజర్ అంబులాన్స్ తయారుచేసేరు. ఇలాంటివాటిని దానంగా ఇస్తే ఆ దేశ ప్రజలకు సహాయంగా ఉంటుంది.

Jaipur Foot
కాళ్ళు లేనివారికోసం 1969లో రామచంద్ర శర్మ గారు, డాక్టర్. పి.కె. సేతి సలహాతో ప్రోస్తటిక్ కాళ్ళను తయారుచేసేరు. ఎంతో కష్టపడి ఆలోచించి మెరుగైన రబ్బరుతో వీటిని రూపొందించేరు. వీటిని అమర్చుకుంటే మామూలు కాళ్ళు ఉన్నవారిలాగా ఈ కాళ్ళు పెట్టుకున్నవారు పనిచేయవచ్చు. దీనివలన ఎంతోమంది కుంటివారమనే మనోబాధ నుండి తప్పించుకున్నారు. భారత ప్రభుత్వం డాక్టర్.సేథి గారికి పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవిస్తే, టైం పత్రిక వారు 2009లో ప్రచురించిన పత్రికలో 50 గొప్ప ఇన్వెన్షన్లలో దీనిని కూడా అతిగొప్ప ఇన్వెన్షన్ గా ప్రపంచానికి తెలిపేరు.ఎంతోమంది దాతలు ఇప్పుడు వీటినికూడా దానాలు చేస్తున్నారు.

Fluid-filled Eyeglasses
కళ్ల జోడు ఒక రకంగా చవుకగా దొరికే వస్తువే. ఎక్కువగా కూడా దొరుకుతాయి. కానీ అభివ్రుద్ది చెందుతున్న దేశాలలో కళ్ళ డాక్టర్లూ, ఆప్టొమెట్రిస్ట్ లూ అతి తక్కువగా ఉన్నారు.కొన్ని దేశాలలో ఒక మిల్లియన్ ప్రజలకు ఒక కళ్ల వైద్యుడు ఉంటే మరికొన్ని దేశాలలో 8 మిల్లియన్ ప్రజలకు ఒక కళ్ల వైద్యుడు ఉన్నారట. కాబట్టి ఈ దేశాలలో కళ్ల జోడు పంచిపెట్టడం దండగ.

దీన్ని మనసులో ఉంచుకునే జోస్ సిల్వర్ అనే ఆయన ద్రవ్యము నిండిన కళ్ల జోడును కనిపెట్టేరు. ఈ కళ్ళ జోడు ఎవరైనా ఉపయోగించవచ్చు. కళ్ళ వైద్యుడితో పనిలేదు. ద్రవ్యము ను తగ్గించుకుని లేక ఎక్కువగా చేసుకుని తమకు కావలసిన చూపు వరకు మార్చుకోవచ్చు.

ఇంతవరకు ఆయన 40,000 కళ్ల జోడులను దానంగా ఇచ్చేరు. ఈయన తయారుచేస్తున్న ఈ కళ్లజోడు గురించి తెలుసుకుని Dow Corning 3 మిల్లియన్ డాలర్లు ఒక ప్రాజక్ట్ రూపంగా ఇచ్చేరు. ChildVision initiative అనే ప్రాజెక్ట్ తో పిల్లలకు కూడా ఇవ్వవలసినదిగా తెలిపేరు. దీని వలన పిల్లలు బాగా చదువుకోగలుగుతారని తెలిపేరు.

No comments:

Post a Comment