Wednesday, December 26, 2012

ప్రపంచాన్ని కాపాడుతున్న కొన్ని ఆలోచనలు (PART-1)....ఫోటోలు

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం అభివ్రుద్ది చెందుతున్న దేశాలకు అందిస్తున్న దానాలలో 75 శాతం ఉపయోగించ కుండానే పోతోంది...ఎందుకని?

సాదారణంగా దానం చేయబడే వస్తువులు చెడిపోయినదిగానో,పోషించుటకు ఏక్కువగా ఖర్చు చేయవలసిన కారణంగానో, వారి వాతావరణానికి తగినదికాకపోవటంవలనో లేక వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకో ఉపయోగపడకుండా పోతున్నాయట. ఆఫ్రికాలో సహాయపనులుచేసే ఒక కార్మీకుడు ఆశాభంగం చెందేడు.కారణం ఆఫ్రికా దేశాలకు వచ్చిన హియరింగ్ ఏయిడ్ మిషెన్లు అక్కడి వారికి తగినవి కావుట.

కాబట్టి ఇలాంటి వాటిని దానంగా పంపే బదులు ఏ ఏ దేశాలకు ఏమికావాలో, అది వారి అభివ్రుద్దికి తోడ్పడుతుందా అని ఆలోచించి దానం చేయాలికాని, దానం చేస్తున్నామనే పేరుకోసం ఏదో ఒకటి దానం చేయకూడదు.

చేసే దానాలు ఎలా ఉండాలో, దేశ అభివ్రుద్దికి ఏమిచేయాలో వీరు చెబుతున్నారు.

Medical Kits Distributed with Coca Cola...Colalife.org
జాంబియాలో పనిచేస్తున్న సైమన్ బెర్రీ అనే స్వయంసేవకుడు ఇది గ్రహించేడు. అతను ఎక్కడికివెల్లినా ఆయనకు ఎవరో ఒకరు కోకోకోలా ఉచితంగా అందిస్తారు. కానీ అక్కడి ప్రజలకు కావలసిన వ్యాధి నిరోధక వాక్సిన్ లూ,మందులూ మాత్రం ఉండేవి కావుట. ఇది అతన్ని ఆలొచింపచేసింది. కోకోకోలా పంపుతున్న పెట్టెలలో ఎక్కువ చోటు ఉంటోందట. కోకోకోలా పెట్టెలలో మందులు ఉంచితే అవి అందరికీ చేరతాయి అనే ఆలొచన వచ్చింది. కోకోకోలాను ప్రతి గ్రామానికీ, ప్రతి పల్లెకూ చేరవేసే ట్రాన్స్ పోర్టర్లు ఎక్కువ డబ్బుకోసం మారుమూలున్న ప్రతిచోటుకూ వెడుతున్నారని గమనించేడు. కొంతమందితో కలిసి Colalife.org అనే పేరుతో ఉచితంగా మందులూ, ఎలెక్ట్రొలైట్ పౌడర్ ప్యాకెట్లూ కలిసిన ఒక ప్యాకెట్ ను కోకోకోలా బాటిల్ల పెట్టెలలో పెట్టి పంపిస్తున్నాడు.

Give a Man a Cow....Heifer International
మనిషికి చేపనివ్వండి, అతను ఒకరోజులోనే దాన్ని తినేస్తాడు. చేపలు పట్టటం నేర్పించండి,జీవితాంతం తింటూనే ఉంటాడు. అతనికి అంతర్జాతీయ పంటను ఇవ్వండి, అతను చేపలను పట్టడూ, తినడూ. హైఫర్ ఇంటర్నేషనల్ వారు రోజుకో చేప సిద్దంతాన్నీ మార్చి, దానికి బదులుగా జీవధనం దానంగా ఇచ్చేరు. 1944 నుండి సుమారు 125 దేశాలలో 12 మిల్లియన్ కుటుంబాలకు ఆహారం అందించే జంతువులను ఉచితంగా ఇచ్చేరు. అంతే కాదు. దానం ఇచ్చే వారికి వాటిని ఎలా పెంచాలో చెబుతూ, వాటి పిల్లలను మరొకరికి దానం చేయాలనీ, దానంచేస్తూ వారికి మీరునేర్చుకున్న పెంపకం గురించి తెలియజేయాలని చెబుతారు. దీని వలన ఒక దానం మరొక దానంగా విస్తారమౌతుంది.

A Website That Roots Out Corrupt Officials...Ipaidabribe.com
లంచం.లంచం.లంచం.ఏక్కడచూసినా లంచం. అభివ్రుద్ది చెందుతున్న దేశాలలో అవినీతి ఒక చేదు నిజం. దీనిని సాదారణ ప్రజలు మార్చలేరు. అవినీతి దేశ అభివ్రుద్దినే అడ్డుకుంటుంది. అవినీతిని ఎలాగైన అడ్డుకోవాలనుకున్నారు స్వాతి రామనాధన్ గారు. ఏలా? వెంటనే తనకొచ్చిన ఆలొచనను అమలుచేసేరు. ipaidabribe.com మొదలుపెట్టేరు.ఎవరెవరు ఎవరెవరికి ఏ ఏ డిపార్ట్ మెంట్లో లంచాలు ఇచ్చేరో, లంచాలు అడిగేరో అనే సమాచారాన్ని పేర్లతో సహా ఈ వెబ్ సైట్ కు పంపవచ్చు. పంపినవారి పేరు, లంచం తీసుకున్న వారి పేరు, ఎంత లంచంతీసుకున్నారో అన్న విషయాలను ప్రచురించకుండా ఏ ఏ డిపార్ట్ మెంట్లో ఏ ఏ పనులకు ఎంత లంచం తీసుకుంటున్నారో ప్రచురిస్తారు. ఇప్పటిదాకా ఈ వెబ్ సైటుకు 4,00,000 రిపోర్టులు వచ్చినాయట. నిజాయితీగా ఉండే కొంతమంది ప్రభుత్వ అధికారులు ఈ వెబ్ సైట్ మూలంగా తమ డిపార్ట్ మెంట్లలో జరుగుతున్న అవినీతి గురించి తెలుసుకుని అక్కడ పనిచేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారట. 17 దేశాలలో ఈ వెబ్ సైట్ కావాలని(వారు నడుపుకోవటానికి)అడుగుతున్నారట.

Bamboo Tumbleweed That Clears Landmines...Mine Kafon
లాండ్ మైన్లు. దొంగతనంగా మనుష్యులనూ, శత్రువులనూ చెంపే ఒక ఆయుధం. Massoud Hassaani. డచ్ దేశానికి చెందిన ఆఫ్ గనిస్తాన్ పిల్లాడు. కాబూల్లో పెరిగేడు. అక్కడ తన తోటి పిల్లలతో గాలితో నేలమీద వెళ్ళే వస్తువులతో ఆడుకునేవాడు. ఆ వస్తువులు విమానాశ్రయం దగ్గరకు వెళ్ళినప్పుడు పేలిపోయేవి. అప్పుడు అతనికి అది ఎలా జరిగిందో తెలియలేదు. సోవియట్ రష్యా ఆఫ్ గనిస్తాన్ యుద్దంలో వాటిని ఎక్కువగా ఉపయోగించేరు.హస్సానీ తండ్రి 1993 లో హత్య చేయబడటంతో, తల్లిని తీసుకుని నెదర్లాండుకు వెళ్ళిపోయేడు. అక్కడ డిజైనింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. కానీ తాను చూసిన లాండ్ మైన్ల గురించి అతను మరిచిపోలేదు. దాని గురించి అంతా తెలుసుకుని తన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లో Mine Kafon పేరుతో చెక్కలనూ, రబ్బరు నూ ఉపయోగించి లాండ్ మైన్లు కనుగునే పరికరాన్ని తయారుచేసేడు. దానిని ఇంప్రూవ్ చేసి మోటార్తొ వెళ్లే విధంగా తయారుచేసేడు. దానిని ఎక్కడ అనుమానమున్నదో అక్కడ పెడితే అది మోటర్తో వెడుతుంది. లాండ్ మైన్ ఉన్నచోట్ల అది పేలుతుంది.అలా లాండ్ మైన్లు క్లియర్ అవుతాయి. ఇది నాటో వారి యంత్రం కంటే చాలా చవుక ధరకు వస్తుంది.

Donate Rice While You Learn....Freerice.com
ఆకలి. దేనినైన భరించగలరేమో కానీ ఆకలిని భరించటం కష్టం. నేర్చు(చదువు)కుంటూ దానం చేయండి అనే కాన్సెప్ట్ తో John Breen అనే ఆయన 2007 లో FreeRice.com అనే వెబ్ సైట్ ను మొదలుపెట్టేరు. ఆ వెబ్ సైట్ ను యూనైటడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రొగ్రాం కు విరాళంగా ఇచ్చేరు. ఈ వెబ్ సైట్ మూలంగా పిల్లలూ, పెద్దలూ ఉచితంగా చదువుకోవచ్చు. అలా చదువుకుంటూనే ఆ వెబ్ సైట్ లో ఆంగ్ల పదాలను బాగా నేర్చుకునేందుకు క్విజ్ ప్రొగ్రాం ఉంటుంది. ఆ క్విజ్లో సరైన జవాబులు రాస్తే, ప్రతి సరైన జవాబుకూ కొంత బియ్యం దానంగా ఇవ్వబడే కూపన్ వస్తుంది. ఈ కూపన్లకు ఆ వెబ్ సైట్లో ప్రకటన చేసినవారు డబ్బుకు బదులు ధాన్యాలు ఇస్తారు. అలా సేకరించిన ధాన్యాలను పోగుచేసి వెనుకబడిన దేశాలకు దానంగా ఇస్తారు. FreeRice.com మూలంగా వచ్చిన ధాన్యాలను(ఆహార పధార్ధాలు) Haiti, Bangladesh, Cambodia, Uganda, Nepal, Bhutan, and Myanmar లలో దానం చేసేరు.

No comments:

Post a Comment