Thursday, December 20, 2012

అందమైన రకరకాల ఇంద్రధనుస్సులు.....ఫోటోలు

ఇంద్ర ధనుస్సు అని చెప్పినవెంటనే అందరూ చూసేము అనే చెబుతారు. నిజమే.సాధారణమైన ఇంద్ర ధనుస్సు ను మనమందరమూ చూసే ఉంటాము.సాధారణమైన ఇంద్ర ధనుస్సులు కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఇంద్ర ధనుస్సులు చాలా రంగులలో, చాలా రకాలుగా కనబడతాయి. వాటిని మనం చూసుండకపోవచ్చు. అవేమిటో ఇక్కడ చూద్దాం

సాధారణమైన ఇంద్ర ధనుస్సు
దీనిని అందరూ చూసే ఉంటారు

రెండవ రకం ఇంద్ర ధనుస్సు
దీనిని కూడా చాలామంది చూసేఉంటారు. ఇందులో రెండు సాధారణమైన ఇంద్ర ధనుస్సులు, ఒక దానికి పైన ఇంకోకటి ఉంటుంది

Alexander’s Dark Band ఇంద్ర ధనుస్సు
ఇందులోనూ రెందు ఇంద్ర ధనుస్సులు ఉంటాయి. కానీ ఒకటవ ఇంద్ర ధనుస్సు కూ రెండవ ఇంద్ర ధనుస్సు కూ మధ్య చీకటిగా ఉంటుంది

Supernumerary ఇంద్ర ధనుస్సు
ఇందులో ఒకదానిలో మరికొన్ని ఇంద్ర ధనుస్సులు కనబడతాయి. అయితే ఇది చాలా అరుదుగా కనబడుతుంది

ఎర్రటి ఇంద్ర ధనుస్సు
ఇది సూర్యోదయం లేక సూర్యాస్తమయం సమయంలో వర్షం పడినప్పుడు ఏర్పడుతుందట

మబ్బుల ఇంద్ర ధనుస్సు
ఇవి వాన మబ్బులు ఎక్కువలేకుండా చిన్న చిన్న వాన మబ్బులలోనూడి పడే జల్లు లాంటి నీటివలన ఏర్పడుతుందట. ఇవి మామూలు ఇంద్ర ధనుస్సుల కంటే పెద్దవిగా కనబడతాయి

Twinned ఇంద్ర ధనుస్సు
ఇవి రెండు ఇంద్ర ధనుస్సులే. కానీ ఒకే చోటనుండి వెలువడి వేరుగా కనబడటమే ఈ ఇంద్ర ధనుస్సు యొక్క గొప్పతనం. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది

ప్రతిబింబిత మరియూ పరావర్తన ఇంద్ర ధనుస్సు
నీటిపైన పడి, తిరిగి నీటి ప్రతిభింబంవలన ఏరపడేది. ఇవిగూడా చాలా అరుదుగా ఏర్పడతాయట

చక్రాల ఇంద్ర ధనుస్సు
ఎక్కువ వర్షమూ, ఎక్కువ మబ్బులూ ఉన్నప్పుడు ఏరపడేది

చంద్ర ఇంద్ర ధనుస్సు
ఇది రాత్రిపూట చంద్రుని వెన్నలలో ఏరపడేది. ఇది ఏర్పడటం చాలా చాలా అరుదు

No comments:

Post a Comment