Saturday, December 15, 2012

అమెరికాలో పాఠశాలలో నరమేధం... తుపాకీ సంస్కృతిని వెంటనే నియంత్రించాలి...... ఫోటోలు మరియూ వీడియో

అమెరికాలో పాఠశాలలో అభం శుభం ఎరుగని పసిమొగ్గలపై కాల్పులకు పాల్పడిన దుండగుడు అదే పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడు. చేతుల్లో రెండు పిస్టళ్లు, కారులో మరో రైఫిల్ విచ్చలవిడిగా కాల్పులు.. అనంతరం ఆత్మహత్య. అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన తల్లి ఇంటి వద్ద చంపేసి, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. 20 మంది పిల్లలతో పాటు ఆరుగురు పెద్దలను హతమార్చారు. మృతుల్లో పాఠశాల ప్రిన్సిపల్ కూడా ఉన్నారు..మొత్తం 28 మంది ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

తల్లి పేరు మీద నాలుగు ఆయుధాలు, తండ్రికి రెండు ఆయుధాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. హెన్రీ రిపీటింగ్ రైఫిల్ను, మరో ఎన్ఫీల్డ్ రైఫిల్ను, ఇంకో షాట్గన్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నా.. వాటిని ఎక్కడ పట్టుకున్నారనే విషయం మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కాగా గతంలో 1999లో కొలంబైన్ హైస్కూల్లో ఇలాగే కాల్పులు జరగ్గా అప్పట్లో 15 మంది మరణించారు. కొలరాడోలోని అరోరా ప్రాంతంలో ఓ థియేటర్లో జరిగిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

తుపాకీ సంస్కృతిని వెంటనే నియంత్రించండి.

అమెరికాలో వెంటనే తుపాకీ నియంత్రణకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు వేలాది మంది విజ్ఞప్తిచేశారు. వైట్ హౌస్ కు అందిన ఓ ఆన్లైన్ పిటిషన్లో ఈ మేరకు 43 వేల మంది సంతకాలు చేశారు. సాధారణంగా ఓ ఆన్లైన్ పిటిషన్ను వైట్ హౌస్ వర్గాలు పరిశీలించాలంటే కనీసం 25 వేల సంతకాలు అవసరం. అయితే, తాజా పిటిషన్ను ఆన్లైన్లో ఉంచిన కొద్దిసేపటిలోనే 25 వేలకుపైగా సంతకాలు చేశారు. అలాగే, దీనితోసహా వైట్ హౌస్ కు మొత్తం ఎనిమిది ఆన్లైన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. కొత్త చట్టాల ద్వారా వెంటనే తుపాకుల వాడకాన్ని నియంత్రించాలంటూ అన్ని పిటిషన్లలోనూ పేర్కొన్నారు.


2 comments:



  1. ఇది అత్యంత బాధాకరము ,విషాదభరితం.కాని అమెరికాలో గన్ లాబీ చాలా శక్తివంతమూ, పలుకుబడి ఉన్నదీ.అందుచేత ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు ఎన్నో జరిగినా చర్యలు తీసుకో లేదు.ఈ సారైనా అధ్యక్షుడు ఒబామా తగిన కట్టుదిట్టాలు చేస్తాడో లేదో చూడాలి.

    ReplyDelete
  2. లాబీయింగ్ చేసుకుని మిలియన్ డాలర్లు సంపాదించటమే లక్ష్యమన్న మాట...ఆ ఆయుదాలు ఎన్ని విపరీతాలు సృష్టించినా వీళ్ళకు కను విప్పు కలుగదన్న మాట!విలాస వంతమయిన జీవితాలు గడపడానికి ఇలాంటి వ్యాపారాలు చెయ్యాలా??మనిషి ఇంత స్వార్ధపరుడయ్యాడా??

    ReplyDelete