Tuesday, December 4, 2012

సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించే ఆయుధాలు నిజజీవితంలో ముందునుంచే ఉన్నాయి....ఫోటోలు

XM-25 grenade launcher..... దూరంగా ఏమున్నాయో కనబడటానికి కంప్యూటర్ టెలిస్కోప్ కలిగి, టార్గెట్ కనబడగానే తనకుతానే గ్రేనేడ్లను నింపుకుని దాడిచేస్తుంది.

The Maars system...4 గ్రేనేడ్లను లోడుచేసుకోగలగి, 400 రౌండ్ల బుల్లెట్లను ఫైర్ చేయగలిగే యంత్రం. రిమోట్ కంట్రోలర్తో పనిచేస్తుంది.

The Active Denial System.....ఇది మిల్లీమీటర్ల రేడియేషన్ తరంగాలను పంపి శత్రువులను కదలలేకుండా చేస్తుంది.

Long Range Acoustic Device.....ఇది సన్నటి శబ్ధ తరంగాలను పంపుతుంది. అయితే ఈ తరంగాల నుండి వెలువడే శబ్ధం చెవులను స్థంభింపచేస్తుంది. వెంటనే శత్రువులు చెవులు మూసేసుకుంటారు. ఏ పనులూ చేయలేరు.

Drones....మనుష్యులు లేని యుద్ద విమానం. టార్గెట్లు వాటికి కనబడగానే కరెక్టుగా కాల్చివేస్తాయి.

Taser Shockwave barrier......ఇందులోనుండి షాక్ తరంగాలు వెలువడతాయి. ఇవి శత్రువులను కదలకుండా చేస్తాయి.

LA-9/P.....ఇది శత్రువుల మీద కాల్పులు జరిపే ముందు వారి మీద పచ్చ రంగు వెలుతురు చుక్కలను నమోదు చేస్తుంది. శత్రువు కావాలంటే లొంగిపోవడానికి అవకాశం ఇస్తుంది.

Hummer-mounted laser....లేజర్ సహాయంతో యుద్ద విమానాలను పడగొట్టగలదు.

No comments:

Post a Comment