Monday, December 24, 2012

ఆధునిక ప్రపంచాన్ని భ్రష్ఠుచేసిన మీసాలు....ఫోటోలు

చరిత్ర అంతటా మీసాలను పురుషత్వమునకూ మరియూ జ్ఞానమునకూ గానూ వర్ణించేరు. కానీ తెలియని కారణాలవలన పురాతణ కాలం నుండి, అంటే 433 – 493 AD లోని మొదటి నాగరికతలేని ఇటాలీకి చెందిన క్రూరుఁడు ఓడోసర్(Odoacer) నుండి ప్రస్తుతం బెలారస్(Belarus)ను సర్వాధికారం తో పాలనచేస్తున్న ప్రెశిడెంట్ అలాగ్జాండర్ ల్యూకాసెంకో(Alexander Lukashenko) వరకూ డిక్టేటర్లు అని పిలువబడ్డ వారందరూ మీసాలున్నవారే.క్రూరపాలకులందరూ ఎందుకు మీసాలు పెంచుకున్నారు? అని ప్రస్నించుకుంటే అది మర్మముగానే ఉన్నది.

మీసాలున్న ఆ డిక్టేటర్లు ఎవరెవరో చూద్దాం

Alexander Lukashenko...Born 30 August 1954
ఈయన ప్రస్తుతం బెలూరస్ కి ప్రెశిడెంట్ గా ఉన్నారు. యూరప్‌లో ఈయనే చివరి నిరంకుశత్వ పరిపాలకుడుగా చెప్పవచ్చు. 1994 జూలై 20 న ప్రజలచే ఎన్నుకోబడ్డ ఈయన తన పదవిని అంటిపెట్టుకునే ఉన్నారు. దీనికోసం ఎన్నో నేరాలకు పాల్పడ్డారు.

Paul Kagame...Born 28 October 1957
ఈయన కూడా ప్రస్తుత ప్రెశిడెంట్ గానే ఉన్నారు. రిపబ్లిక్ ఆఫ్ రవాండా కు. రవాండా పేట్రియాటిక్ ఫ్రంట్ అనే విప్లవ కూటమికి నాయకుడిగా ఉండి, అంతకుముందు జాతి సంహారం(8,00,000 మందిని సమూహ హత్య)కు పాల్పడిన ప్రభుత్వాన్ని పడగొట్టేడు. రవాండా సంక్షోభం ను కాపాడిన ఘనత ఈయన కున్నా 2006 లో మానవహక్కుల సంఘం ఆయన్ను తప్పు పట్టింది. ఈయనకు ఎవరు ఎదురు చెప్పినా, ఎదురుతిరుగుతున్నారని అనుమాన పడినా, ఈయన గురించి తప్పుగా మాట్లాడినా, వారిని హతమారుస్తున్నారని తెలిపింది. ఎటువంటి పరిస్తుతులలోనూ పత్రికా స్వాతంత్రమును సహించలేని ఈయన పత్రికలపై కట్టుబాట్లు విధించేరు.

Augusto Pinochet....25 November 1915 – 10 December 2006
ఈయన 1973 నుండి 1990 వరకు చిలీ దేశానికి ఆర్మీ జెనెరల్ మరియూ ప్రెశిడెంట్ గా ఉన్నారు. ఈయన పరిపాలన 1973 లో మొదలయ్యింది. ఒక నెలకు ముందు అప్పుడున్న ప్రజాసామ్య ప్రెశిడెంట్ శల్వదొర్ ఆల్లెందె ఈయనను ఆర్మీ జెనెరల్ గా నియమించేరు. ఈయన ఆయనమీదే మిలటరీ దాడిచేసి ప్రభుత్వాన్ని దక్కించుకున్నారు. ఎన్నో సంస్కరణలు అమలుచేసి చిలీ దేశ ఆర్ధీక పురోగతికి పాటుపడినా ఈయన మానవహక్కుల చరిత్ర మాత్రం దారుణంగా ఉండేది.అత్యవసర పేరుతో కఠిన చర్యల చట్టం పెట్టి తన ప్రత్యర్ధులను హతమార్చేరు. ఈయన పాలనలో సుమారు 3,000 మంది హతమార్చబడ్డారని, 80,000 మంది జైలుపాలయ్యేరని, 30,000 మంది చిత్రవధలకు గురైయ్యేరని తెలుపబడింది. ప్రత్యర్ధులకూ, ప్రజలకూ పాఠాలు నేర్పించాల్సిందే. దానికోసం హత్యలూ, చిత్రవధలు చేయాల్సిందే నని ఆయన చెప్పేవారు.

Rafael Trujillo...24 October 1891 – 30 May 1961
Dominican Republic కు 1930 నుండి 1961 వరకు నిరంకుశ పరిపాలకుడుగా ఉన్న ఈయన 1961 లో రహస్య హత్యకు గురైయ్యేరు.అమెరికా చరిత్రలో ఈయన పరిపాలనలో జరిగిన జాతి విధ్వంసం, ప్రత్యర్ధులపై రక్తపాత దాడులూ చేదు అనుభవాలుగానే ఉండిపోయినై. Trujilloఅనే తన జాతికి చెందిన వారిని గౌరవిస్తూ తమ దేశంలోని సరిహద్దులలో నివసిస్తున్న హైతి జాతికి చెందిన వారిని హతమార్చేరు.

Saddam Hussein...28 April 1937 – 30 December 2006
అరబ్ సొషలిస్ట్ బాత్ పార్టీ నాయకుడిగా ఉంటూ, 1968 లో ఇరాక్ ను పరిపాలిస్తున్న రాజుల మీద తిరుగుబాటుచేసి ఇరాక్ ను ప్రజాపరిపాలనకు తీసుకు వచ్చేరు. 1979 లో తానే ఇరాక్ కు ప్రెశిడెంట్ అయ్యేరు. 1980 లో ఇరాన్ మీద యుద్దానికి దిగేరు. 1980 నుండి 1988 వరకు జరిగిన ఈ యుద్దంలో అమెరికా, బ్రిటన్ వారి సం యుక్త సేనలను ఎదుర్కున్నారు. తన పదవిని, పరిపాలననూ నిలబెట్టుకోవడానికి ఈయన తన సొంత ప్రజలనే దారుణ రీతిలో చంపేరని చెబుతారు.

Mouammar Gaddafi...June 1942 – 20 October 2011
1969 నుండి 2011 వరకు లిబియా దేశానికి ఎదురులేని పరిపాలకుడుగా జీవించేరు.“Third Universal Theory” ని ప్రవేశపెట్టేడు. కానీ ఏ ఒక్క ప్రబుత్వ అధినేత ఆయన చెప్పిన తియరీకి మద్దత్తు తెలుపలేదు. తన పరిపాలనలో ఈయన చేయని నేరం అనేది ఏదీలేదు.

Benito Mussolini....29 July 1883 – 28 April 1945
1922 నుండి 1943 వరకు ఇటాలీ సర్వాధికారుడుగా ఉన్నాడు. 1925 నుండి 1927 లోపు ఇటాలీ పాత రాజ్యాంగ చట్టాలను మార్చి తనకు అనుకూలంగా తిరిగి రాసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌కు సహాయపడి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకోవాలని ఆశపడటమే కాకుండా దానిని బహిరంగంగా చెబుతూ అవసరమైతే ఎంతమందినైనా చంపుతానని ఒక ప్రసంగంలో తెలిపేడు. ఇతను యుక్త వయసులో మీసాలు తీసేసేవాడట. అయితే అతనిలో రోము సామ్రాజ్యానికి అధిపతి కావాలనే కోరికి పుట్టినప్పటి నుండి బహుశ మీసాలను పెంచుకున్నాడని అంటారు.

Fidel Castro...Born August 1926
1959 లో అప్పటి ప్రభుత్వంపై జరిగిన ఒక సైనిక తిరుగుబాటులో Fulgenico Batista ను తరిమికొట్టి క్యూబాకు నాయకుడయ్యేరు. 2006 లో తన ఆరోగ్యపరిస్తితి కారణంగా తన తమ్మునికి క్యూబా నాయకత్వం అందించేరు. ఈయనను అతని దేశ ప్రజలు ఉత్తమ నాయకుడని చెబుతున్నా,ప్రపంచదేశాలలో కొందరు నాయకులు ఈయనను సర్వాధికారిగనే చెబుతున్నారు. ఎన్నో నేరాలకు పాల్పడ్డాడని చెబుతారు. ఈయన క్యూబా నాయకుడిగా ఎదిగిన కొన్ని సంవత్సరాల తరువాత తన మీసాలను తీసేసేరు. గడ్డం మాత్రం పెంచుకున్నారు.

Joseph Stalin....18 December 1878 – 5 March 1953
1941 నుండి 1953 వరకు అప్పటి సోవియట్ యూనియన్ కు సర్వాధికారిగా ఉండేవారు. హిట్లర్ తరువాత ఈయనే ఎవరికీ లొంగని సర్వాధికారిగా పేరుతెచ్చుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దం లో ముఖ్యమైన వ్యక్తి.ఈయన అధికారంలో సుమారు 10 మిల్లియన్ల మంది చనిపోయుంటారట.ఈయన తననితానే ఆరాధించుకునే వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఏన్నో గ్రామాలకూ, నగరాలకూ తన పేరు పెట్టుకున్నాడు. ఎన్నో బిరుదులు ఇప్పించుకున్నాడు. చరిత్ర పుస్తకాలలో తన పేరును బలవంతంగా రాయించుకున్నాడు.

Adolf Hitler...20 April 1889 – 30 April 1945
ఈయన అత్యంత క్రూరమైన సర్వాధికారిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన మీసాలు ఈయనలోని వాంఛిత వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. 1933 నుండి 1945 వరకు నాజీ జెర్మనీకి సర్వాధికారిగా ఉంటూ యూరప్‌లో తాను కొత్త అధిపతిగా ఉంటూ జెర్మన్ ఆర్య అధికారం కోనసాగించాలనే తన లక్ష్యమును నిర్భయంగా బయటపెట్టేరు. ఇదే రెండవ ప్రపంచ యుద్దానికి దారి తీసి 50 మిల్లియన్ ప్రజల చావుకు కారణమయ్యింది. పై అధికారులకు వారి క్రింది అధికారులు ఎదురుచెప్పకూడదూ అనే ఆజ్ఞాపాలనను సమర్ధవంతంగా అమలుచేసేరు.

No comments:

Post a Comment