Saturday, December 22, 2012

ఢిల్లీలో వైద్యవిద్యార్ధిని మానభంగం: నిరసనతో ఈరోజు ఢిల్లీ దద్దరిల్లింది…. ఫోటోలు మరియూ వీడియో

సామూహిక అత్యాచార సంఘటనపై విద్యార్థుల నిరసనతో ఈరోజు ఢిల్లీ దద్దరిల్లింది. విద్యార్థులు పార్లమెంటుపైకి దూసుకు వెళ్లారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఉదయం నుంచి ఆందోళన కొనసాగుతోంది. పోలీసులు రెండు సార్లు లాఠీ ఛార్జి చేసినా ఫలితంలేదు. ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. లాఠీ చార్జ్,టియర్ గ్యాస్ మరియూ వాటర్ కానన్లు ఉపయోగించినా ఆందోళనాకారులు భయపడటంలేదు. న్యాయంకోసం పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.

మన దేశంలో చట్టానికి కళ్లులేవని, కోర్టులంటే భయంలేదని, నేరాలు నిరభ్యంతరంగా చేసుకోచ్చునని ఒక వర్గానికి చెందినవారు బలంగా నమ్ముతున్నారు.

కేంద్రంలో, ఢిల్లీ మహానగరంలో అధికా రం చలాయిస్తున్న ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకులు త్వరగా నేర విచారణ పూర్తవుతుందని హామీ ఇవ్వలేకపోతోంది.

దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా మన ప్రతిష్టను దెబ్బతీసింది.


No comments:

Post a Comment