Sunday, December 2, 2012

అమెజాన్.కాం గిడ్డంగి...ఫోటోలు

అమెజాన్.కామ్. అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రామాణికమైన (US మూల స్థావరంగా ఉన్న ) ఒక బహుళజాతి ఆన్లైన్ రిటైల్ వ్యాపార సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఉన్నది. అమెరికాలో ఇది అతి పెద్ద ఆన్ లైన్ వ్యాపార సంస్థ.2010 జనవరి వరకు దీని ఆన్ లైన్ వ్యాపార లాభాలు,దీని తర్వాత స్థానంలో ఉన్న స్టేపుల్స్ ,ఇంక్., అమ్మకాలకన్నా మూడురెట్లు అధికం.

1994 లో అమెజాన్.కామ్ ను జెఫ్ బెజోస్ అనే అతను స్థాపించి,1995 లో ఆన్ లైన్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించారు.

మొదట ఈ సంస్థను కదబ్ర ఇంక్.,అని పిలిచేవారు,కానీ కొన్నిసార్లు ప్రజలు కడవేర్ అని పొరబడుతున్నట్లు గ్రహించి ఆ పేరును మార్చారు. ప్రపంచంలోని అతి పెద్ద నదులలో అమెజాన్ నది ఒకటి,ఈ విధంగా అతిపెద్దది అని సూచించునట్లుగా ఈ సంస్థ పేరును అమెజాన్ .కామ్ గా మార్చటం జరిగింది.అంతేకాక ఈ పేరు ఇంగ్లీష్ మొదటి అక్షరం ఎ(A ) తో మొదలవుతుంది,కాబట్టి అక్షరాల జాబితా లో ముందు వస్తుంది కనుక ఈ పేరును పెట్టటం జరిగింది. అమెజాన్.కామ్ మొదట ఆన్ లైన్ లో పుస్తకవిక్రయశాల గా ప్రారంభించబడింది,కానీ తొందరలోనే వివిధరకాల వస్తువులైన,డీవీడీలు,సీడీలు,ఎంపి 3 డౌన్ లోడ్లు,కంప్యూటర్ సాఫ్ట్ వేర్లు,వీడియో గేమ్ లు ,ఎలెక్ట్రానిక్ వస్తువులు,దుస్తులు,ఫర్నిచర్,ఆహారం,మరియు బొమ్మలు మొదలగు రకాల వస్తువులను కూడా విక్రయించటం ప్రారంభించినది. అమెజాన్ కెనెడా,యునైటెడ్ కింగ్డమ్,జర్మనీ,ఫ్రాన్స్,ఇటలీ,జపాన్ మరియు చైనా దేశాలకు ప్రత్యేకంగా వేరువేరు వెబ్ సైట్ లను ఏర్పాటుచేసింది. ఈ సంస్థ కొన్ని దేశాలకు కొన్ని ఉత్పత్తులను అంతర్జాతీయంగా నౌకాయానం సహాయంతో సరఫరా చేస్తుంది.


1 comment: