Sunday, December 23, 2012

సముద్రయానం: పరస్పర కాంతి నిర్మాణాలు....ఫోటోలు

లండన్లోని Canary Wharf దివ్యమైన 300 పడవల గుంపుకు నిలయమయ్యింది. ఈ పడవలను చూడటానికి వచ్చే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లతో ఈ పడవలలోని కాంతిని వారికి కావలసిన రంగులోకి మార్చుకోవచ్చు. చూడటానికి కాగితపు పడవులలాగా ఉండే ఇవి కాగితపు పడవులుకావు. ఒక వైర్ లెస్ నెట్వర్క్ తో లైట్ల రంగులను మార్చుకునే టెక్నాలజీతో తయారుచేయబడినవి. పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లతో ఈ లైట్ల రంగులను మార్చుకోవచ్చు. Aether & Hemera అనే ఇద్దరు టెక్నాలజిస్టులు ఈ సముద్రయానం ను నిర్మించేరు. పర్యాటకులు తామే సొంతంగా పడవలను నడుపుకుని ఆనందపడటానికోసమే నిర్మాణమైన ఈ పడవల గుంపు ఫిబ్రవరి 13 వరకు ఉంటుందట.


ఫోటో క్రెడిట్:.JulesFoto,Aether & Hemera

No comments:

Post a Comment