Tuesday, December 18, 2012

విచిత్రమైన భయాలు: భూమి అంతం కానుందా?!....వీడియో

ప్రపంచం 21/12/2012 తేదిన అంతం కానుందని తెలిపేదే డూమ్స్ డే (DOOMS DAY). దీనిని నమ్మి విపరీతంగా భయపడుతున్నవారు ఉన్నారని గ్రహించేరు. వీరికి ఎంతచెప్పినా వీరిలో ఆ భయం పోదు. ఎందుకంటే ఎన్నో రకాల ఫొబియాలతో(భీతి)భయపడే వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఈ డూమ్స్ డే అనేదికూడా ఒక ఫోభియా(భీతి)గా తయారయ్యింది. దీనికి కారణాలున్నాయి.

డిసెంబర్ 21, 2012, డూమ్స్ డే లేదా యుగాంతం గా పిలువ బడే ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి. అందువలన వివిధ గ్రహాల ఆకర్షణ, వికర్షణ ల ఫలితంగా భూగోళం అల్లకల్లొలం అవుతుందని పరిశోధకుల కధనం. ఈ పరిణామంతో భూమి మీద ఏ ప్రాణీ బ్రతికి ఉండే అవకాశం ఉండదని ఒక కధనం. అంతే కాకుండా అదే రొజున "పోలార్ షిప్మెంట్" అనగా ధ్రువాల మార్పిడి కూడా జరుగుతుంది అని నాసా శాస్త్రజ్ఞులు ధ్రువీకరించారు. దీని పరిణామం తో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం గాను, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం గాను మారుతాయి. ఫలితంగా అరా కొరాగా మిగిలిన ఏ ప్రాణీ కూడా మనుగడ సాగించే అవకాశం కూడా ఉండదు. మనిషి నిటారుగా (రెండు కాళ్ళ మీద) నిలబడ లేడు. మరలా నాలుగు కాళ్ళ మీద నిలబడవలసిన పరిస్థితి. అంతేగాక మనుషుల వెన్నెముక కూడ నిలువుగా ఉండలేదు. అది కూడా వాలిపోతుంది.


ఇంతే కాకుండా

1. దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు.

2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.

3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ ( LHC) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి , విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.

4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది. మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు supramental స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.

5. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది. యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి , అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.

7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే ,అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.

... ఐతే నిజంగా డిసెంబర్ 21,2012 నాడు ప్రళయం రాబోతోందా!?

“రాదు”అని ఖచ్చితంగా చెబుతున్నారు నాసా శాస్త్రవేత్తలూ మరియూ మరెందరో శాస్త్రవేత్తలు.

ఏది ఏమైనా ఈ డూమ్స్ డే చాలామంది ప్రజలలో ఆసక్తి పెంచింది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి అనే ఆసక్తితో చాలామంది ఎదురుచూస్తున్నారట.

1 comment:

  1. ఉత్తర దక్షిణ దృవాలు క్షణంలో మారిపోతాయని 'పరిశోధకులు' తేల్చారా?! నేను అంతకన్నా మాగ్నెట్ జేబులో పెట్టుకుంటాగా.

    మీకోసం బ్లాగు వుండదేమో అనే నా ఏకైక వర్రీ. :P :)

    ReplyDelete