Thursday, December 13, 2012

భద్రపరచబడ్డ ప్రసిద్ధమైన మానవ శరీర అవయవాలు....ఫోటోలు

ఎంతోమంది సెలెబ్రటీలు ఐశ్వర్యమూ మరియూ కీర్తి సంపాదించుకోవడానికి కారణం వారి దగ్గర బద్రపరుచుకున్న శరీర అవయవాలే. ఫలానా సెలెబ్రిటీ తన అవయవాన్ని అతి పెద్ద సొమ్ముకు ఇన్ స్యూర్ చేసేరు. ఈ మధ్య ఇలాంటి కధలు ఎన్నో విన్నాము. కొంతమంది శరీర అవయవాలు వారు బ్రతికున్నప్పుడే ప్రిసిద్దిచెందితే, కొంతమంది శరీర అవయవాలు వారు చనిపోయిన తరువాత వారి శరీరం నుండి వేరుచేసిన తరువాత ప్రసిద్ది చెందింది. అలాంటి వాటిలో కొన్నింటి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము.

క్రోంవెల్ తల
ఇది చాలా విచిత్రమైనది. న్యాయాధిపతి ఏదైన నేరంలో బ్రతికున్నవారిని నేరస్తులుగా నిర్ణయించలేకపోతే మృతదేహాలను విచారణకు పిలుస్తారట. King Charles II రాజైనప్పుడు, తన తండ్రిని చంపినందుకుగానూ Oliver Cromwell మృతదేహాన్ని వెలికితీసి విచారణ జరిపించి, అతనే తన తండ్రి King Charles I ను హత్యచేసేడని, కాబట్టి అతనికి మరణ శిక్ష విధించి తీర్పునిచ్చేరు. Oliver Cromwell మృతదేహాంలోని తలను భహిరంగంగా నరికి వెస్ట్ మినిస్టర్ హాలులో వేలాడతీసేరు.ఆ రోజులలో ప్రదర్శనకు ఉంచబడే శరీర అవయవాలు ఎక్కువకాలం ఉండాలని వాటికి తారు పూసి ఉంచేవారట. అలాగే Oliver Cromwell తలకు కూడా తారుపూసి వేలాడతీసేరు. కొంతకాలం తరువాత ఒక తుఫానలో కొట్టుకుపోయి ఒక సెక్యూరిటీ గార్డ్ కు చిక్కింది. ఆ తరువాత ఎన్నో చేతులు మారి చివరికి మ్యూజియంలో పెట్టబడింది.చివరికి 1960 లో కేంబ్రిడ్జ్ లో ఒక రహస్య స్థలంలో ఆ తలను పూడ్చిపెట్టేరు. ఎవరికీ ఆ స్థలం ఎక్కడ అనేది తెలియదట.

ఉపయోగితావాది తత్త్వజ్ఞుఁడు జరిమీ బెంతాం తల
"తెలివైన వారు చనిపోతే వారి దేహాన్ని, వారి అవయవాలనూ బద్రపరుచుకోవాలి" అన్న ఫిలాసఫీని ముందుంచింది ఈయనే. బద్రపరుచుకోవడాని అవసరమైన పద్దతులను కూడా వివరించిన ఈయన మ్రుతదేహాన్ని జ్ఞాపకార్థముగా బద్రపరిచేరు. అయితే బద్రపరచబడ్డ పద్దతులలో వచ్చిన పొరపాట్ల వలన ఆయన తల ఖుల్లిపోవడం మొదలుపెట్టింది. అందుకని ఆయన తలను తీసేసి ఆ తలకు బదులు మైనంతో చేసిన తలను అమర్చి ఉంచేరు. కుళ్ళిపోయిన తలను లండన్ యూనివర్సిటీ కాలేజ్ లాబులో ఉంచేరు. కొందరు విధ్యార్ధులు దుండగ చేష్టల వలన మ్యూజియం కు తరలించేరు. స్పెషల్ పర్మిషన్ తో దానిని చూడనిచ్చేవారు.

ఈయన్ స్టిన్(Einstein) మెదడు
20 వ శతాబ్ధములో మిక్కిలి ప్రశిద్దిచెందిన మానవ అవయము ఇదే.ఆయన చనిపోయిన వెంటనే ఆయన శరీరము నుండి ఆయన మెదడును తీసి బద్రపరిచేరు. పరిశోధనలలో ఆయన మెదడులో ఎన్నో తేడాలు తెలుసుకోగలిగేరు. కొన్ని పరిశోధనల తరువాత బద్రపరచిన ఆయన మెదడు తప్పిపోయింది. ఏమయిందో, ఎటుపోయిందో, ఎవరు తీసుకుపోయేరో ఎవరికీ తెలియలేదు. పరిశోధనలకోసం శాస్త్రవేత్తలు కొంతమంది ఆయన మెదడులోని కొంత బాగాన్నీ తీసుకుపోయేరని, మిగిలినది ఆయన చనిపోయినప్పుడు ఆయన మెదడును తీసిన డాక్టర్ దగ్గర ఉన్నదని చెబుతారు.

ఈయన్ స్టిన్(Einstein)కళ్ళు
సత్పురుషుల మ్రుతదేహాలమీద దోపిడీ జరుగుతుంది.స్మారక/జ్ఞాపక చిహ్నం గా ఉంచుకోవాలనే తపనతో. అలాగే ఈయన్ స్టన్ మెదడును తీసిన డాక్టర్ ఆయన కళ్ళను కూడా తీసేడు. మెదడును పరిశోధనల కోసం తీస్తే, కళ్లను అవి ఏమి చెబుతున్నయో, వాటి నుండి మనం ఏమి నేర్చుకోగలమో తెలుసుకోవడనికని ఆయన తెలిపేరు. ఆయన కళ్ళు ఇప్పటికీ ఉన్నాయట. ఈయన్ స్టిన్ కళ్ళు తీసిన డాక్టర్ సన్నిహితుల దగ్గర ఉన్నాయని, అవి ఇప్పుడు న్యూ యార్క్ లోని ఒక లాకర్లో ఉన్నాయని ఒక రూమర్.

గెలీలియో వేలు
భూమి సూర్యుడు చుట్టు తిరుగుతోందని ప్రపంచానికి చాటిచెప్పిన ఈయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు సరికదా ఈయనను ఎగతాలి చేసేరు. తాను చెప్పింది ఎవరూ నమ్మటంలేదని, ఎలా నమ్మించాలో తెలియక తనలోతాను సతమతమయ్యేరు గెలీలియో. ఈ రోజు చదువుకుంటున్న ప్రతి బాలుడి తెలుపుతున్న ఈ విషయాన్ని ఆ రోజుల్లో నమ్మకపోగా, గెలీలియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆయనను హౌస్ అరెస్ట్ లో ఉంచింది చర్చ్. ఆయన చనిపోయిన తరువాత ఆయనను పూడ్చిపెట్టి అక్కడ ఒక చిన్న సమాధిని కట్టేరు. ఆయన చెప్పింది నిజమని తెలుసుకున్న తరువాత ఆయన మ్రుతదేహాన్ని వెలికితీసి పెద్ద సమాధికి మార్చేరు. అప్పుడు ఆయన మ్రుతదేహాన్ని వెలికి తీసినవారిలో అంతక ముందు ఆయన చెప్పిన విషయాన్ని నమ్మినవారు ఆయన మ్రుతదేహంలోని కొన్ని అవయవాలను జ్ఞాపకార్ధంగా తీసుకున్నారు. అందులో ఒకటే ఆయన చేతిలోని మధ్య వేలు. ఇప్పుడు ఆ వేలు ఫ్లోరన్స్ లోని ఆయన పేరుమీదున్న హిస్టరీ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉంచేరు. 1992 లో ఆయనను హౌస్ అరెస్ట్ లో ఉంచిన చర్చ్ క్షమాపణలు తెలిపింది.

గౌతమ బుద్దుని దంతం
ఈయన ఆధ్యాత్మిక గురువు అని అందరికీ తెలుసు. ఈయనకు ఎంతోమంది అనుచరులు ఉన్నారు. ఈయన చనిపోయిన తరువాత ఈయనను గంధపు చెక్కలతో దహనం చేసేరు. మంటలు ఆయన శరీరం మొత్తాన్ని బూడిదచేసింది కానీ ఆయన శరీరంలోని కొరుకుడు దంతమును మాత్రం బూడిదచేయలేకపోయింది. ఆ దంతాన్ని పవిత్ర జ్ఞాపక చిహ్నం గా ఉంచుకున్నారు. ఎన్నో యుద్దాలు జరిగినప్పుడు ఎలాగైన ఈ దంతం ను తీసుకుపోవాలని ప్రతి దేశమూ ప్రయత్నించింది. చివరకు, అంటే ఈ రోజు ఈ దంతం శ్రీలంకలోని కాండీ నగరంలో అతిపెద్ద బంగారు పెట్టె లో ఉంచబడి ఉన్నది.

Henri IV తల
తిరుగుబాటు పోరాటాలలో మరణించిన వారికి కూడా గౌరవముండదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు ఈయన మ్రుతదేహాన్ని వెలికి తీసి దానిని ముక్కలుగా నరికి అన్ని చోట్లా పడేసేరట. అందులో కొంతమంది ఆయన తలను తీసుకు వెళ్ళి బద్రపరిచేరట. 2010 వ సంవత్సరం వరకు బద్రపరచబడ్డ ఆ తలను ఆయనదు కాదు అని చెప్పేవారు. కానీ 2010 లో శాస్త్రవేత్తలు ఆ తల ఆయనదేనని తెలిపేరు.

అబ్రహాం లింకన్ కపాల ముక్కలు
మేరీలాండ్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్ లో వీటిని ఉంచేరు. ఆయన హత్యచేయబడ్డ తరువాత డాక్టర్లు వీటిని తీసి ఉంచేరు.

No comments:

Post a Comment