Wednesday, December 12, 2012

అసాధారణమైన డబ్బులు...ఫోటోలు

డబ్బును మనం బ్యాంక్ నోట్ల రూపంలోనూ మరియూ నాణెము రూపములోనూ చూసేము. కానీ మానవ చరిత్రలో చెల్లింపులు రకరకాలుగా ఉండేవి.అది రాయిగాగానీ, మెటల్ రాడ్ గాగానీ, జియోమెట్రిక్ రూపంలోగానీ లేక మరేదైనా విచిత్రమైన రూపంలోగాని ఉండేవి. అలాంటి రకరకాల రూపంలో ఉన్న కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

రాతి రూపం
యాప్ దీవులలో రాయ్ రాతులు చట్టపరమైన చెల్లింపు

Coins of Africa: money Kissi
20వ శతాబ్ధము వరకు ఆఫ్రికా దేశాలలోని కొన్ని ప్రాంతాలలో ఇనుప చువ్వలు చెల్లింపుకు వాడేరు

పెద్ద నాణెము
కెనడా దేశపు ఒక మిల్లియన్ కెనడియన్ డాలర్ల నాణెము. దీని బరువు 100 కేజీలు. స్వచ్చమైన బంగారంతొ చేయబడినది. 2011 వరకు ప్రపంచములో ఇదే అతి పెద్ద నాణెము

అతి పెద్ద నాణెము
అక్టొబర్ 2011 లో ఆస్ట్రేలియా వారు ప్రపంచములోనే అతిపెద్ద నాణెము విడుదలచేసేరు. ఈ నాణెమును ఒక టన్ను బంగారంతో తయారుచేసేరు

అతిచిన్న నాణెము
చారిత్రాత్మకంగా అతి చిన్న నాణెము భారతదేశంలో విజయనగర సామ్రాజ్యంలో తయారు చేయబడింది. వెండితో తయారుచేసిన ఈ నాణెము బరువు 1.7 గ్రాములు మాత్రమే.

అతిచిన్న డైమండ్ నాణెము
2012లో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎలిజిబత్ రాణి డైమండ్ జూబ్లీ సంధర్భంగా దీనిని విడుదలచేసేరు. దీని వెడల్పు 750 నానో మీటర్లు.

జియోమెట్రిక్ మరియూ కారు,గిటార్, మోటార్ సైకిల్ రూపం డబ్బు
సొమాలియాలో ఈ విధమైన డబ్బు తయారుచేసేరు.

ఫైబర్ నాణాలు
1944-45 మధ్యలో జపాన్ ఆక్రమించుకున్న మంచూరియాలో ఈ నాణాలు ఉపయోగించేరు.

చెక్క డబ్బు
రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత కెనడాలో ఉపయోగించేరు.

మాట్లాడే నాణెము
మంగోలియన్ నాణెము మీద అమెరికన్ ప్రెశిడంట్ కెనడీ బొమ్మతో ఒక నాణెము తాయరుచేసేరు. ఈ నాణెము మీద ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఆయన మాట్లాడిన “I am proud that I am a Berliner”అనే మాట వినబడుతుంది.

పవిత్రమైన నీటితో వెండి నాణెము
Palau అనే అతిచిన్న దీవిలో 2007 వ సంవత్సరం ఒక డాలర్ విడుదలచేసేరు. ఈ డాలరులో విర్జిన్ మేరీ బొమ్మతో పాటు ఒక చిన్న నీళ్ళ బాటిల్ ఉంటుంది. ఈ బాటిల్లో ఫ్రాన్స్ దగ్గరున్న Lourdes అనే ప్రాంతంలోని పవిత్రమైన నీరు ఉంటుంది.

అంతరిక్షం డబ్బు
ఈ డబ్బు ఇంకా వాడకంలోకి రాలేదు. గ్రహాల రూపంలో అత్యంత పటిష్టమైన ప్లాస్టిక్ తో తయారుచేయబడిన ఈ డబ్బు అంతరిక్షం టూరిస్టులకోసం తయారుచేయబడింది.

No comments:

Post a Comment