ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Wednesday, December 19, 2012
25 సంవత్సరాలు నీటిలో మునుగి ఉన్న గ్రామము....ఫోటోలు
1920 లో విల్లా ఇపీక్యూయన్(Villa Epecuen)అనే గ్రామం కొండ లోయల మధ్య ఉన్న లగో ఇపీక్యూయాన్(Lago Epecuen)అనే ఉప్పునీటి సరస్సు తీర ప్రాంతంలో స్థాపించేరు.ఇది అర్జెంటీనా దేశ నగరమైన బొయనస్ అయర్స్(Buenos Aires)కి 600 కిలోమీటర్ల దూరంలో స్థాపితమైనది. దీనిని ఒక టూరిస్ట్ ప్రదేశంగా స్థాపించేరు. దీనికి ముఖ్య కారణం ఈ సరస్సులోని నీరు అత్యంత ఉప్పగా ఉంటుంది. ఎంత అని అడిగితే సముద్రపు నీటి ఉప్పదనం కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పగా ఉంటుంది ఈ సరస్సులోని నీరు.
ఎన్నో శతాబ్ధాలుగా ప్రసిద్దికెక్కిన ఈ నీటికున్న వైద్య శక్తి వలన ఈ సరస్సుకు ప్రపంచం నలుమూలల నుండీ ప్రజలు వస్తూ ఉంటారు. ఈ సరస్సులో స్నానం చేస్తే ఎటువంటి రోగమైన నయమైపోతుందని నమ్ముతారు. ఈ ప్రదేశానికి చెందిన ఒక ప్రముఖుని కన్నీరే(ఆయన ఆప్తులు చనిపోయినందువలన) ఈ సరస్సు అని కూడా చెబుతారు.
1983 వరకు అక్కడ హోటళ్ళూ, ఇళ్ళూ, షాపులూ, పార్కులూ మరియూ మ్యూజియం ఉండేదట. 1984 లో ఆ సరస్సులో నీరు 4 మీటర్ల ఎత్తుకు పెరిగడంతో ఆ గ్రామం నీటిమయమయ్యింది. 1993 లో నీటిమట్టం 10 మీటర్ల ఎత్తుకు పెరగడంతో ఆ గ్రామం పూర్తిగా మునిపోయింది. నీరు పెరుగుతూ ఉన్నందువలన అందరూ ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేరు......2009 లో అక్కడ నీరు తగ్గడంతో గ్రామం బయటపడింది. పబ్లో నోవక్ అనే 81 సంవత్సరాల వయసున్న ఒకతను మాత్రం తిరిగి ఆ గ్రామానికి వచ్చేరు. 2011 లో AFP ఫోటొగ్రాఫర్ Juan Mabromata ఈ ఫోటోలను తీసేరు.
ఈ ఫోటోలోని ఫోటోలో కనబడేదే 1970లో ఆ గ్రామం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment