Monday, December 31, 2012

కెనడాలొ రోడ్డు మీద పేరుకుపోయిన మంచును ఎలా తీస్తున్నారో చూడండి....వీడియో


ఈ కొత్త సంవత్సరములో మొదటగా నమ్మలేని కొన్ని ఉపకార సేవల గురించి తెలుసుకుందాం...ఫోటోలు


ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు……ఫోటో & అనిమేటడ్ వీడియో


మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యేడాదిలో మీ కోరికలు అన్నీ నెరవేరాలని, మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలకు చేరువకావాలని , సుఖ శాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ……మీకోసం

గూగుల్ పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ 2013 లో రెడీ...ఫోటోలు

ఎన్.ఆర్.జీ ఎనర్జీ, గూగుల్ మరియూ బ్రైట్ సోర్స్ ఎనర్జీ(NRG Energy, Google, and BrightSource Energy) అనే 3 సంస్థలూ కలిసి కాలిఫోర్నియాలో 3500 ఎకరాలలో The Ivanpah Solar Electric Generating System (SEGS) అనే పేరుతో సోలార్ ఎనర్జీ తాయారుచేసే ప్లాంట్ నిర్మాణం చేస్తున్నారు. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అవుతుంది. ఈ ప్లాంట్ నుండి కరెంట్ ఉత్పత్తి 2013 చివరిలో మొదలౌతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్త ఖర్చు 2.2 బిల్లియన్ల డాలర్లుగా అంచనా వేసేరు. అందులో గూగుల్ సంస్థ పెట్టుబడి 168 మిల్లియన్ డాలర్లట. కరెంట్ ఉత్పత్తి మొదలైతే సుమారు 1,40,000 ఇళ్ళకు క్లీన్ ఎనర్జీ కరెంట్ ఇస్తారు. దీనివలన వాతావరణంలో ఎన్నో మిల్లియన్ టన్నుల కార్బండ ఆక్సైడ్ మరియూ ఇతర కాలుష్య పధార్ధాలు తగ్గుతాయి. అంటే 70,000 కార్లు వెలువరిచే కాలుష్యంతో సమానమట.


Sunday, December 30, 2012

యుద్దాలలో ఉపయోగించిన కొన్ని అసాధారణమైన ఆయుధాలు....వీడియో


ఆంస్టర్ డాం లో గడ్డకట్టుకుపోయిన కాలువలు....ఫోటోలు


7 వారాల పాపను పార్లమెంట్ కు తీసుకువెల్లిన యూరోపియన్ పార్లమెంట్ మెంబర్....ఫోటోలు

ఇటలీ నుండి యూరోపియన్ పార్లమెంట్ కు ఎన్నికైన Licia Ronzulli అనే స్త్రీ పార్లమెంటేరియన్ స్త్రీల ఉద్యోగ హక్కుల చట్టం ను విరివిపరిచే అంశంపై జరిగే వివాదం లో పాల్గొనడానికి, ఓటు వేయడానికీ పార్లమెంట్ కు తన 7 వారాల పాపను తీసుకువెళ్ళి సంచలనం స్రుష్టించింది.అమెరికా నుండి వియత్నాం వరకు అన్ని న్యూస్ పేపర్లూ అమెను అభినందించేయి.


Saturday, December 29, 2012

నిర్భయ మరణం....నివాళి.....ఫోటోలు

13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న బాధితురాలు చివరకు మాతృభూమికి దూరంగా సింగపూర్ ఆస్పత్రిలో తనువు చాలించింది

మొదట దుండగుల చేతుల్లో హింస. తరువాత ప్రభుత్వ చేతుల్లో హింస

ఏన్నో ప్రశ్నలూ....జవాబులు మౌనం

దేశం మారుమూల ప్రాంతాల్లో మహిళలపై సాగుతున్న నేరాల గురించి నిలదీసేవారు కావాలి


2013 ఐస్ ఫెస్టివల్ కు తయారౌతున్న చైనా....ఫోటోలు

జనవరి 5,2013 చైనాలోని హర్బిన్ లో ఐస్ ఫెస్టివల్ మొదలౌతుంది