Monday, November 12, 2012

ఇండియాలో మండుతూ మాయమౌవుతున్న యూ.ఎఫ్.ఓ(UFO)లు!....భారత్ పై చైనా మానసిక యుద్దమా?.... ఫోటోలు మరియూ వీడియో

ఇటీవలి కాలంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సరిహద్దుల్లో చోటు చేసుకున్న సున్నిత అనుమానాస్పద సంఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కొద్ది కాలంలో లేహ్ సరిహద్దు ప్రాంతాల్లో చీకటిపడితే చాలు.. ఆకాశంలో ఎవో వస్తువులు నారింజ రంగుతో వెలిగిపోతూ అలజడి సృష్టిస్తున్నాయి. అలా కొంతసేపు వెలిగిన తర్వాత అవి మాయమవుతున్నాయి. దీంతో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. లేహ్ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలోని ప్యాంగాంగ్ సరస్సుపై ఆకాశంలో ఇవి దర్శనమిస్తున్నాయని లేఖలో పేర్కొంది.

Pangong Tso Lake, India Side

ప్రభుత్వ ఆదేశాలతో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. వారంతా లేహ్ పట్టణానికి చేరుకుని ఆ ఎగిరే వస్తువులేంటా..? అన్నదానిపై పరిశోధన మొదలుపెట్టారు. దీనిలో భాగంగా వాయుసేన సహకారం తీసుకున్నారు. కానీ, ఆ ఎగిరే వస్తువుల జాడ ను వాయుసేన రాడార్లు సైతం పసిగట్టలేకపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో మరిన్ని సందేహాలు తలెత్తాయి. ప్యాంగాంగ్ సరస్సులో 45 కిలోమీటర్ల భాగం మన భూభాగంలోను, మరో 90 కిలోమీటర్ల మేర చైనా ఆధీనంలో ఉంటుంది.



ఇది చైనా భారత్ పై చేస్తున్న మానసిక యుద్దం అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

No comments:

Post a Comment