Tuesday, November 20, 2012

రోదసి నుంచి Soyuz TMA-05 లో తిరిగొచ్చిన సునీతా విలియంస్…..అద్భుత ఫోటోలు

నాలుగు నెలలుగా అంతరిక్షంలో ఉన్న భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో ఇద్దరు సహచర వ్యోమగాములతో కలిసి భూమికి తిరిగి వచ్చేరు. సునీతతోపాటు జపాన్ ఎయిరోస్పేస్ ఏజెన్సీకి చెందిన అకి హోషిడే, రష్యా సోయుజ్ కమాండర్ యూరి మలెన్చెంకోలు కూడా భూమికి తిరుగు వచ్చేరు.

ఐఎస్ఎస్ 33వ యాత్రకు సంబంధించి క్రూ కమాండర్గా వ్యవహరిస్తున్న సునీత. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10:26 గంటలకు సోయుజ్ టీఎంఏ-05ఎం లో సహ రోదసి యాత్రీకులు హోషిడే, మలెన్చెంకోలతో ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 7:23 గంటలకు కజకస్థాన్లో భూమిపై దిగేరు. ఈ ఏడాది జూలై 15న కజకస్థాన్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ 127 రోజుల తర్వాత తిరిగి భూమిపై అడుగు పెట్టేరు.


No comments:

Post a Comment