Thursday, November 22, 2012

"థాంక్స్ గివింగ్ డే" సీమ కోడిని విడిచిపెట్టే చరిత్రలో అమెరికన్ ప్రెశిడెంట్లు....ఫోటోలు

థాంక్స్ గివింగ్ డే ' అనేది పంటకోత పండుగ . ఇది వరకు చేసిన పనులకు ధన్యవాదములు తెలుపుతూ ,వారివారి కృతజ్ఞతలను సాంప్రదాయకముగా తెలుపుకునే రోజు. ఇది ముఖ్యంగా కెనడా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సెలవు రోజుగా ప్రకటించుకొని జరుపుకొనే రోజు. థాంక్స్ గివింగ్ అనేది మతపరంగా మొదలైనప్పటికి,ఇది ముఖ్యంగా మత రహిత సెలవు రోజుగా గుర్తింపబడింది.ఈ థాంక్స్ గివింగ్ మొదటగా ఏ రోజు,ఎక్కడ ముధలైనది అనే విషయం ఒక మెత్తటి వివాదాస్పదముగా మిగిలిపోయింది. "మొదటి థాంక్స్ గివింగ్"జరుపుకోవడం 1621 లో ప్ల్యమౌత్ ప్లాన్టేషన్ లో సాంప్రదాయకంగా మొదలైంది.

ఇప్పుడు కెనడా లో ఈ థాంక్స్ గివింగ్ వేడుకలు అక్టోబర్ లోని రెండొవ సోమవారం జరుపుకోగా,అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నవంబర్ లోని నాల్గోవ గురువారం జరుపుకొంటారు. మాములుగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కలిసి ఈ థాంక్స్ గివింగ్ రోజున రాత్రి భోజనాలు కానిస్తారు.

ఈ రోజున సీమ కోడి మాంసం తినడం ఒక సాంప్రదాయంగా వచ్చిందనే చెప్పాలి. ఆ రోజున నేషనల్ టర్కీ ఫెడరేషన్ అమెరికా ప్రెశిడెంట్లకు 2 సీమ కోళ్ళను బహుకరిస్తారు. ఒకటి బ్రతికున్న కోడి, రెండవది సీమ కోడి మాంసం. బ్రతికున్న సీమ కోడిని ప్రెశిడెంట్లు హాయిగా బ్రతకమని దీవించి వదిలేస్తారు. మీరు చూస్తున్న ఫోటోలు అవే.


1 comment: