Saturday, November 10, 2012

చరిత్రలోనే ఎక్కువగా నచ్చిన, రీ ట్వీట్ చేయబడ్డ ఫోటో


నవంబర్ 6, 2012 ఈస్ట్రన్ టైం అమూల్య గడియలు 11.55 pm కి ఫేస్ బుక్ లోనూ, 11.56 pm కి ట్విట్టర్ లోనూ "మరో నాలుగు సంవత్సరాలు" అనే శీర్షికతో అమెరికా ప్రెశిడెంట్ బారక్ ఒబామా పై ఫోటోను పొస్టు చేసేరు.

నవంబర్ 10,2012 ఈస్ట్రన్ టైం 1.30 pm కి ఫేస్ బుక్ ఫోటోలో 43,06,739 "నచ్చింది", 5,77,941 పంచుకోవటాలూ మరియూ 2,07,747 కామెంట్లూ తో ఫేస్ బుక్ లో ఎక్కువగా నచ్చిన ఫోటోగా రికార్డ్ పొందింది. ఆయన సొంత పేజీ "బారక్ ఒబామా" లో 33.1 మిల్లియన్ల "నచ్చింది" అనె కామెంట్లు వచ్చేయి.


ట్విట్టర్లో ఆ ఫోటోను 8,09,193 మంది రీ ట్వీట్ చేసేరు, మరో 2,92,755 "ఇష్టం" తో ట్విట్టర్ చరిత్రలోనే అధిక రీ ట్వీట్ చేయబడ్డ ఫోటోగా ప్రశిద్ది పొందింది. తన సొంత ట్విట్టర్ అకౌంట్లో ఆయనకు 23 మిల్లియన్ మంది ఫాలోయర్స్ ఉన్నారు.

రికార్డ్ బ్రేక్ చేసిన ఈ ఫోటో ఒక విజయానికి సంభంధించినది అవడం ఆనందమైన అనుభూతినిస్తోంది.

No comments:

Post a Comment