Wednesday, November 7, 2012

ఒక మిల్లియన్ సాలెపురుగులతో తయారుచేసిన డ్రస్సు!?...ఫోటోలు

ఒక అరుదైన డ్రస్సును ఒక మిల్లియన్ సాలెపురుగుల సిల్క్ గూడు దారంతో తయారుచేసేరు. దీనిని న్యూయార్క్ నగరంలోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ లో ఉంచేరు. ఈ బంగారు డ్రస్సును తయారుచేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. దీనికోసం 70 మంది గోల్డన్ ఆర్బ్ సాలెపురుగు (genus Nephila) గూడులను వెదకి, అందులోని(గూడు)దారమును తీసి బద్రపరిచేరు. మరో 12 మంది ఆ గూడు దారంలో ఉన్న బంగారు రంగు దారమును వెలికితీసి 11 కి 4 ఆడుగుల డ్రస్సును తయారుచేసేరు. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి సాలెపురుగు సిల్క్ తో తయారుచేసిన డ్రస్సు.

"గోల్డన్ ఆర్బ్ వెబ్ స్పైడర్" …..ఈ సాలెపురుగులు ఎక్కువగా నార్త్ అమెరికాలో కనబడతాయి. ఈ సాలెపురుగులు గూడును అల్లుకునే గూడు దారాలు బంగారు రంగులో ఉంటాయి. ఆ దారాలలో కొంత సిల్క్ కూడా ఉంటుందట. ఆ సిల్క్ ను విడదీసి తయారుచేసినదే ఈ డ్రస్సు.


No comments:

Post a Comment