Friday, November 9, 2012

ఎక్కువగా అమ్ముడుపోయిన మొబైల్ ఫోన్లు.....ఫోటోలు

మొబైల్ ఫోన్లు లేని ప్రపంచాన్ని మనం కలలో కూడా ఊహించుకోలేము. ఎందుకంటే ఆ కల అతి భయంకరంగా ఉంటుంది. ఈ రోజు మనం ఎవరితోనైనా, వారు ఎంత దూరంలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా అనుకున్న వెంటనే వారితో మాట్లాడగలిగే అవకాశం ఇట్టే దొరుకుతొంది. ఇదే గనుక లేకపోతే?....ఎందుకు ఉన్నప్పుడు కూడా లేదు అనుకోవడం. కానీ దీనికి అవకాశం కలిపించినవారిలో ఎవరు(ఏ మొబైల్ ఫోన్) ఎక్కువగా ఉపయోగపడిందో తెలుసుకుందాం.

NOKIA 1100....ఈ సాదారణమైన మొబైల్ ఫోన్ 2003 లో 250 మిల్లియన్ల సెట్ లు అమ్ముడుపోయింది.

NOKIA 3210.....1999 లో పరిచయంచేయబడ్డ ఈ సెట్టు 150 మిల్లియన్ల దాకా అమ్ముడుపోయింది.

NOKIA 1110....2005 లో విడుదలచేయబడ్డ ఈ సెల్ ఫోన్ సెట్లు కూడా 150 మిల్లియన్ల దాకా అమ్ముడుపోయింది.

NOKIA 1200.....2007 లో జి.ఎస్.ఎం మాడల్తో విడుదలైన ఈ ఫోను కూడా 150 మిల్లియన్ల దాకా అమ్ముడుపోయింది.

NOKIA 2600/2610/2626/2630.....2004 లో కలర్ డిస్ ప్లే తో విడుదల్చేయబడ్డ ఈ ఫోన్ 130 మిల్లియన్ సెట్లు అమ్ముడుపోయింది.

MOTOROLA RAZR V3....2004 లో ఫోల్డ్ చేయబడే విధంగా అందంగా తయారుచేయబడ్డ ఈ సెట్లు 135 మిల్లియన్లు అమ్ముడుపోయేయి.

NOKIA 1600/1650/1661.....2006 లో పరిచయం చేబడింది. 130 మిల్లియన్ల సెట్లు అమ్ముడైనై.

NOKIA 3310....2000 సంవత్సరంలో విడుదలచేయబడ్డ ఈ సెట్టు 126 మిల్లియన్లకుపైనే అమ్ముడైనై.

NOKIA 1208/1209....2007 లో వచ్చిన ఈ సెట్టు 100 మిల్లియన్ల దాకా అమ్ముడైనది.

IPHONE MODELS......ఇందులో ఆపిల్ కంపెనీవారి ఐ ఫోన్ కూడా ఉన్నది. 2007 లో వారు రిలీజ్ చేసిన ఐ ఫోన్ ఎక్కువగా అమ్ముడుపోలేదు. కేవలం 6 మిల్లియన్ సెట్లనే అమ్మగలిగింది. 2008 లో టచ్ స్క్రీన్ తో పరిచయం చేయబడ్డ ఐ ఫోన్ 35 యూనిట్లు అమ్ముడైంది. 2009 లో ఆపిల్ కొత్త సౌకర్యాలతో పరిచయంచేసిన ఐ ఫోన్ కూడా 35 మిల్లియన్ సెట్ల దాకా అమ్ముడైంది. కానీ వీరు 2010 లో పరిచయం చేసిన ఐ ఫోన్4 మాత్రం 28 మిల్లియన్ సెట్లే అమ్ముడైనై. 2011 లో పరిచయం చేయబడ్డ ఐ ఫోన్ 4S ఇప్పటిదాకా 70 మిల్లియన్ల సెట్లు అమ్ముడైనై.

No comments:

Post a Comment