Saturday, November 10, 2012

అరటిపండు జలగ...ప్రక్రుతి యొక్క అతిపెద్ద రీసైకలర్......ఫోటోలు

జెలగ/జలగ. పేరువింటేనే వొల్లంతా జలదరిస్తుంది. ఇక కనిపిస్తే దానిని చెంపేస్తారు. ఎందుకంటే అది రక్తం పీల్చుకుని బ్రతికే కీటకం. జెలగ (Leech) అనెలిడాలో హిరుడీనియా విభాగానికి చెందిన జంతువు. ఇవి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి ఆలిగోకీటా లోని వానపాముల వలె వీటికి కూడా క్లైటెల్లమ్ ఉంటుంది.

కొన్ని జలగలను ప్రాచీనకాలం నుండి వైద్యచికిత్సలో ఉపయోగించారు. అయితే చాలా జీవులు చిన్న అకశేరుకాల మీద ఆధారపడతాయి. ఇవి ఉభయలింగ జీవులు.

రక్తాన్ని పీల్చే జలగలు అతిథిని అంటి పెట్టుకొని, కడుపునిండా రక్తం త్రాగగానే రాలిపోతాయి. పృష్టభాగంలోని చూషకము ఇలా అతుక్కొడానికి మరియు తిమ్మిరి ఎక్కడానికి అవసరమైన రసాయనాన్ని విడుదలచేసి అతిథికి ఇవి అతిక్కొన్నట్లుగా తెలియకుండా చేస్తాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా ఎంజైమ్ ను స్రవించి రక్తంలోని పంపుతాయి.

కానీ ఈ అరటిపండు జలగ(Banana Slug) మానవులకు చాలా మేలుచేస్తుంది. అడవులలోఎక్కువగా కనిపించే ఈ జెలగలు చనిపోయిన క్రిములను తిని వాటిని రీసైకిల్ చేసి దానిని ఎరువుగా మారుస్తుంది. నార్త్ అమెరికా లో ఎక్కువగా కనబడతాయి.


No comments:

Post a Comment