Monday, November 5, 2012

బోత్స సత్యనారాయణ కూతురి వివాహా పనులలో ప్రభుత్వ ఉద్యోగులు?!!!....వీడియో

పీసీసీ అధ్యక్షుడు, ఆంద్ర రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె వివాహం లో విపరీతంగా అధికార దుర్వినియోగం జరిగిందని వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఏకంగా 700 మంది కానిస్టేబుళ్లు, 120 మందిసబ్ ఇన్స్పెక్టర్లు, 35 మంది డీఎస్పీలు, ఇంకా రెవిన్యూ, మున్సిపల్ డిపార్ట్ మెంట్ అధికారులు బొత్స కుమార్తె వివాహంలో పాలు పంచుకున్నారు. వీరంతా అచ్చం ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిలాగా బొత్స ఇంటిలో కూలి పనులు చేశారని అంటున్నారు. కేవలం ప్రభుత్వ అధికారులనే కాక ప్రైవేటు వారిని కూడా బొత్స కుటుంబం దాదాపు అదుపులోకి తీసుకుందట! దాదాపు 300 టాక్సీ వాలాలను వారి ముందస్తు బుకింగ్స్ ను బలవంతంగా రద్దుచేయించి, పెళ్లి మండపం వద్దకు తెచ్చిపెట్టించినట్లు తెలుస్తోంది. తమ అడ్వాన్స్ బుకింగ్ లను కేన్సిల్ చేయించడంతో పాటు, కేవలం సాధారణ చార్జీలు ఇచ్చి అతిధులను డ్రాప్ చేసే పనిచేయించుకున్నారని అనేక మంది టాక్సీ డ్రైవర్లు వాపోయారు.

No comments:

Post a Comment